Airtel కొత్తగా బ్లాక్ ప్లాన్‌ను లాంచ్ చేసింది!! ఒకే బిల్ తో రెండు రకాల ప్రయోజనాలు
ఇండియాలోని టెలికాం రంగంలో రెండవ అతిపెద్ద టెల్కో భారతి ఎయిర్‌టెల్ తన యొక్క వినియోగదారుల కోసం కొత్తగా ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.1,099 ధర వద్ద లభించే ఈ ప్లాన్‌లోని ప్రత్యేకత ఏమిటంటే పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ కాకపోవడం. ఎయిర్‌టెల్ సంస్థ బ్లాక్ ప్లాన్‌లను ప్రకటించినప్పుడు టెల్కో అందించే అన్ని ప్లాన్‌లకు పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ ఉంది. Airtel బ్లాక్ ప్లాన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు ఎయిర్‌టెల్ యొక్క పోస్ట్‌పెయిడ్ వినియోగదారుగా మారడం తప్పనిసరి. కానీ రూ.1,099 ప్లాన్‌తో పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ కు మారవలసిన అవసరం లేదు. ఈ ప్లాన్ యొక్క పూర్తి ప్రయోజనాల గురించి పరిశీలించడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ బ్లాక్ రూ.1,099 కొత్త ప్లాన్ ప్రయోజనాలు
రూ.1,099 ధర వద్ద లభించే ఎయిర్‌టెల్ బ్లాక్ కొత్త ప్లాన్ వినియోగదారులకు ఒకే కనెక్షన్ తో ఫైబర్+ల్యాండ్‌లైన్ మరియు DTH (డైరెక్ట్-టు-హోమ్) కనెక్షన్‌ని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఫైబర్ కనెక్షన్‌తో ఇంటర్నెట్ స్పీడ్ ని 200 Mbps వరకు పొందవచ్చు అని టెల్కో వెబ్‌సైట్‌లో పేర్కొనబడింది. అయితే ఈ ప్లాన్‌ను పొందడానికి ప్రాథమిక పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ అవసరం ఉండకపోవచ్చు కావున ఇది మంచి విషయం అనిచెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు నిబంధనలు మరియు షరతులు స్పష్టంగా పేర్కొనబడలేదు. ఈ ప్లాన్ ప్రయోజనాలలో లేనందున దానితో ఎటువంటి పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ ప్రమేయం లేనట్లు కనిపిస్తోంది.

ఎయిర్‌టెల్ బ్లాక్ కొత్త ప్లాన్ మొబైల్ సేవలను కాకుండా టెల్కో యొక్క ఫైబర్ మరియు DTH సేవలను వినియోగించాలనుకునే వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని విడుదల చేసినట్లు స్పష్టంగా ఉంది. ఎయిర్‌టెల్ యొక్క ఈ ప్లాన్‌లో రూ.350 విలువైన టీవీ ఛానెల్‌లు చేర్చబడ్డాయి. దానికి అదనంగా అమెజాన్ ప్రైమ్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ రెండింటికీ ఒక-సంవత్సరంపాటు ఉచిత సబ్‌స్క్రిప్షన్ ను కూడా చేర్చబడింది. ఇప్పటికే ఉన్న ప్లాన్‌కు కొత్త సర్వీస్‌ను జోడించడం వల్ల వినియోగదారులు నెలకు రూ. 300 వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

ఎయిర్‌టెల్ బ్లాక్ కొత్త ప్లాన్ వినియోగదారులకు సౌకర్యాన్ని అందించడానికి ఉద్దేశించబడింది. ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్ విభాగంలో టెల్కో తన ఉత్పత్తులు/సేవలను వినియోగదారులకు బండిల్ చేయబడి అందిస్తోంది కావున వారికి ఒకే బిల్లు సౌకర్యం ఉంటుంది. ఇంకా IVR నిరీక్షణ సమయాన్ని తగ్గించడానికి మరియు వారు ఉపయోగించాలనుకుంటున్న సేవలను ఎంచుకునే స్వేచ్ఛను తగ్గించడానికి Airtel బ్లాక్ ప్లాన్ కస్టమర్‌ల కోసం ప్రత్యేక కస్టమర్ కేర్ టీమ్ ఉంది. మరిన్ని వివరాల కోసం మీరు Airtel వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 296 ప్లాన్
296 రూపాయల ధర వద్ద ఎయిర్‌టెల్ టెల్కో ప్రవేశపెట్టిన కొత్త ప్లాన్ 30 రోజుల సర్వీస్ వ్యాలిడిటీతో వస్తుంది. ఇది మొత్తం వాలిడిటీ కాలానికి 25GB డేటాను అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్ మరియు 100 SMS/రోజు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దీనితో పాటు అపోలో 24/7 సర్కిల్, వింక్ మ్యూజిక్ వంటి మరిన్నింటితో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ యొక్క ఉచిత ట్రయల్ యాక్సెస్‌తో ఈ ప్లాన్ లభిస్తుంది. అందించిన డేటా పూర్తయిన తర్వాత వినియోగదారులకు 50p/MB ఛార్జ్ చేయబడుతుంది. అంతేకాకుండా 100SMS/రోజు ముగిసిన తర్వాత స్థానిక SMS ఛార్జీలు రూ.1 మరియు STD SMSకి రూ.1.5 వసూలు చేయబడతాయి.

ఎయిర్‌టెల్ రూ. 319 ప్లాన్
ఎయిర్‌టెల్ కొత్తగా ప్రవేశపెట్టిన మరొక ప్లాన్ వాస్తవానికి రోజువారీ డేటా ప్రయోజనంతో రూ.319 ధర ట్యాగ్‌తో లభిస్తుంది. ఇది పూర్తిగా 1 నెల చెల్లుబాటు వ్యవధిలో రోజుకు 2GB డేటా ప్రయోజనంను అందిస్తోంది. అలాగే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పైన పేర్కొన్న విధంగానే ఈ ప్లాన్ కూడా అపోలో 24/7 సర్కిల్, వింక్ మ్యూజిక్ వంటి మరిన్నింటితో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ యొక్క ఉచిత ట్రయల్ యాక్సెస్‌తో వస్తుంది. రోజువారీ డేటా పూర్తయిన తర్వాత వినియోగదారులకు 50p/MB ఛార్జ్ చేయబడుతుంది. అంతేకాకుండా 100SMS/రోజు ముగిసిన తర్వాత SMS ఛార్జీలు స్థానిక SMSకి రూ.1 మరియు STD SMSకి రూ. 1.5 వసూలు చేయబడతాయి.


Click it and Unblock the Notifications