ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్ : రోజుకి 3 జీబీ డేటా
టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్, తన ప్రత్యర్థి రిలయన్స్ జియోకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉంది. జియోకు పోటీగా మరో సరికొత్త ప్లాన్‌తో కస్టమర్ల ముందుకు వచ్చింది ఎయిర్‌టెల్.
టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్, తన ప్రత్యర్థి రిలయన్స్ జియోకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉంది. జియోకు పోటీగా మరో సరికొత్త ప్లాన్‌తో కస్టమర్ల ముందుకు వచ్చింది ఎయిర్‌టెల్. 181 రూపాయలతో ప్రీపెయిడ్ కస్టమర్లకు ఈ ప్లాన్‌ను ప్రకటించింది.ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకున్న యూజర్ కి రోజుకి 3 జీబీ డేటాను అందిస్తోంది. ఆయితే ఈ ప్లాన్ కొన్ని సర్కిళ్లకు మాత్రమే పరిమితం కానుంది.

రూ.181 రీఛార్జి...
ఈ రూ.181 ప్లాన్ ను రీఛార్జ్ చేసుకున్న యూజర్ కి రోజుకి 3 జీబీ డేటాను అందిస్తోంది. వాయిస్ కాల్స్‌పై ఎలాంటి ఎఫ్‌యూపీ పరిమితి ఉండదు ఇండియా లో ఏ నెంబర్ కి అయిన అన్ లిమిటెడ్ కాల్స్ చేయవచ్చు. దీంతో పాటు రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 14 రోజులు మాత్రమే.

ఎయిర్టెల్ vs జియో...
జీయోకు రూ. 198 ప్లాన్ లో మొత్తం 56 జీబి డేటా తో పాటు , అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్ 28 రోజులపాటు అందిస్తుంది. డేటా అపరిమితంగా ఉంది కానీ రోజుకు 2GB అధిక వేగం డేటాను కలిగి ఉంటుంది. FUP పోస్ట్, ఇంటర్నెట్ వేగం 60Kbps కు వస్తుంది. ఇక్కడ ఎయిర్టెల్ జీయో కన్నా ఎక్కువ రోజువారీ డేటాను అందిస్తోంది, కానీ జీయో ఇస్తున్న వ్యాలిడిటీ తో పోలిస్తే ఎయిర్టెల్ తక్కువ ఇస్తుంది .

ఎయిర్టెల్ రూ .289 ప్లాన్...
ఎయిర్‌టెల్ తాజాగా రూ.289 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకునే కస్టమర్లకు రోజుకు 1జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 48 రోజులుగా నిర్ణయించారు.

రూ.299కి మరో ప్లాన్ ....
ఎయిర్టెల్ లో రూ.299కి మరో ప్లాన్ అందుబాటులో ఉంది. ఇందులో కస్టమర్లకు రోజుకు 1.4 జీబీ డేటా లభిస్తుంది. మిగిలిన బెనిఫిట్స్ అలాగే వస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీ 42 రోజులుగా ఉంది.


Click it and Unblock the Notifications








