Home
News

ఎయిర్‌టెల్ రూ.249, రూ.349 ప్రిపెయిడ్ ప్లాన్ విశేషాలివిగో...

దేశంలోనే అతి పెద్ద మొబైల్ నెట్ వర్క్ గా పేరున్న ఎయిర్ టెల్ తన కొత్త ప్లాన్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

By M Krishna Adithya

దేశంలోనే అతి పెద్ద మొబైల్ నెట్ వర్క్ గా పేరున్న ఎయిర్ టెల్ తన కొత్త ప్లాన్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రిలయన్స్ జియో మార్కెట్ లో రంగ ప్రవేశం చేసిన అనంతరం, మరోసారి టెలికాం రంగంలో టారిఫ్ ల యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ తన కొత్త టారిఫ్ ప్లాన్స్ తో కస్టమర్లను కట్టి పడేస్తోంది. ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు ఆన్ లిమిటెడ్ వాయిస్‌కాల్స్‌ను ఫెయిర్ యూసెజ్ పాలసీతో సంబంధం లేకుండా అందిస్తోంది.

airtel

గతంలో ఎయిర్‌టెల్ నుంచి రూ.499 లకే అన్ లిమిటెడ్ ప్లాన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఆ ప్లాన్ లో ప్రతీ రోజు 2 జీబీ డేటా, 82 రోజుల పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, ప్రతీరోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వంటి సౌకర్యాలు కల్పించారు. అయితే ప్రస్తుతం ఎయిర్‌టెల్ మరో కొత్త ప్లాన్ తో ముందుకు వచ్చింది. అందులో భాగంగా రూ.249 కే ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రకటించింది. 28 రోజుల వాలిడిటీతో ఉండే ఈ ప్లాన్‌లో సుమారుగా రూ. 499 ప్లాన్ లో ఉన్నటువంటి ఆఫర్లనే ఎయిర్ టెల్ అందుబాటులో ఉంచింది.

ఓ ట్విట్టర్ యూజర్ కథనం ప్రకారం.. ఎయిర్ టెల్ రూ. 299 ఆఫర్ లో ప్రతీ రోజు 2జీబీ డేటా. అన్ లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ వాయిస్ కాల్స్, నేషనల్ రోమింగ్, అలాగే ప్రతీ రోజు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు అందించనున్నారు. అలాగే ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు ఉంటుందని పేర్కొంది. అంతే కాదు ఎయిర్ టెల్ ప్రస్తుతం అందిస్తున్న రూ. 349 ప్లాన్ ను సైతం సవరించింది. ఇందులో భాగంగా ప్రతీ రోజు 3 జీబీ డేటాతో పాటు అన్ లిమిటెట్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్ఎమ్ఎస్‌ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ వాలిడిటీ సైతం 28 రోజులుగానే పేర్కొంది. ఇప్పుడు అమల్లో ఉన్న రూ.349 ప్లాన్ లో రోజుకు 2.5 జీబీ డేటాను అందిస్తున్నారు. ఇయితే కొత్త రూ.349 ప్లాన్ లో అదనంగా డేటాను అందిస్తున్నారు.

అయితే రూ.249, రూ. 349 ప్లాన్లను పోల్చి చూస్తే మొదటి ప్లాన్ లో 28 రోజుల్లో 56 జీబీ డేటాను అందిస్తుండగా, రెండో ప్లాన్ లో 84 జీబీ డేటా లభిస్తోంది. ఎయిర్ టెల్ యూజర్స్ మై ఎయిర్ టెల్ యాప్ లోకి వెళ్లి మరిన్ని వివరాలు పొందే అవకాశం ఉంది. అయితే తాజా ప్లాన్స్ చూస్తుంటే ఎయిర్ టెల్ రిలయన్స్ జియో ప్రకటించిన ప్లాన్స్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు తయారైనట్లు కనిపిస్తోంది.

ఇక ఎయిర్ టెల్ తన రూ.649 పోస్ట్ పెయిడ్ ప్లాన్ ను సైతం పునరుద్ధరించింది. కొత్త ప్లాన్ ప్రకారం ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు 50 జీబీల రోల్ ఓవర్ డేటా సౌకర్యం కల్పించారు. అంటే మీరు వాడకుండా మిగిలిపోయిన డేటాను వచ్చే నెలకు కూడా ట్రాన్స్ ఫర్ చేసి అదనంగా వాడుకునే సౌకర్యం కల్పించారు.

Best Mobiles in India

English summary
Airtel launches Rs. 249 prepaid plan and revises Rs. 349 plan More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X