రోజుకు 3జిబి డేటాతో ప్రత్యర్థులకు Airtel షాక్, టాప్ 10 ప్లాన్లు మీకోసం

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది.

|

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే పలు ప్రీపెయిడ్‌ ప్లాన్ల సమీక్షలతో కస‍్టమర్లను తనవైపు తిప్పుకుంటున్న ఎయిర్టెల్‌ తాజాగా మరో ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.558 ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై కస్టమర్లకు భారీ డేటా ప్రయోజనాలను అందిస్తోంది. ప్రధాన ప్రత్యర్థులు జియో, వోడాఫోన్‌లకు పోటీగా తాజా రీచార్జ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.558 ప్లాన్‌లో 3జీబీ డేటాను రోజువారీ అందిస్తుంది. వాలిడిటీ 82రోజులు. అంటే ఈ ప్లాన్ రీచార్జ్‌ ద్వారా వినియోగదారుడు మొత్తం 246 జీబీ డేటానువాడుకోవచ్చు. అలాగే అన్‌లిమిటెడ్‌ వాయిస్‌కాలింగ్‌ సదుపాయం, 100 ఎస్‌ఎంఎస్‌లను కూడా ఆఫర్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో Airtel నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన టాప్ 10 ప్లాన్లను ఓ సారి పరిశీలిస్తే..

వన్‌ప్లస్ 6లో సెక్యూరిటీ లోపం,ఫోనంతా హ్యాకర్ల చేతిలోకి !వన్‌ప్లస్ 6లో సెక్యూరిటీ లోపం,ఫోనంతా హ్యాకర్ల చేతిలోకి !

రూ. 149 ప్లాన్

రూ. 149 ప్లాన్

ఎయిర్‌టెల్‌ రూ.149ల ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై 2జీబీ 3జీ/4జీబీడేటాను ఆఫర్‌ చేస్తోంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 28రోజులు. రోజుకు రూ. 2.68కు జీబీ డేటా చొప్పున మొత్తం 56 జీబీ డేటాను కస్టమర్లకు అందివ్వనుందన్నమాట. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.

రూ.399 ప్లాన్

రూ.399 ప్లాన్

ఎయిర్‌టెల్‌ రూ. 349ల ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై 2.4జీబీ 3జీ/4జీబీడేటాను ఆఫర్‌ చేస్తోంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 70రోజులు. ఎంపిక చేసిన యూజర్లకు 84 రోజుల వ్యాలిడిటీ.దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.ఈ లెక్కన 1 జీబీ, ఒక్క రూపాయి 97 పైసలకే లభ్యమవుతోంది.

రూ.449 ప్లాన్
 

రూ.449 ప్లాన్

రూ.449 ల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌పై వినియోగదారులు రోజుకు 2 జీబీ డేటా వాడుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజులు. అంటే మొత్తం 140 జీబీ డేటాను అందిస్తోంది. దీనితోపాటు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

రూ.49,రూ.92 ప్లాన్లు

రూ.49,రూ.92 ప్లాన్లు

రూ.49 ప్యాక్ వ్యాలిడిటీ ఒక రోజు. ఇందులో 3జీబీ హై స్పీడ్‌ డేటా.
మరొక ప్లాన్ రూ. 92 ప్యాక్‌ 7 రోజులపాటు చెల్లుబాటులో ఉంటుంది. 6జీబీ డేటా అందిస్తుంది. డేటా వినియోగంపై రోజువారీ నిబంధన ఏదీ లేదు. అంటే ఏడు రోజుల్లోనూ ఎపుడైనా 6జీబీ డేటా వాడు కోవచ్చు.

రూ. 129 ప్లాన్

రూ. 129 ప్లాన్

రూ. 129 రీఛార్జ్ కొత్త ప్యాక్‌ను తీసుకొచ్చింది. ఇందులో అన్‌లిమిటెడ్‌కాలింగ్‌ , రోజుకు 1జీబీ 4 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. దీనికి అదనంగా ఎయిర్‌టెల్‌ హలో ట్యూన్స్‌ను ఉచితంగా ఆఫర్‌ చేస్తోంది. ఈ ప్లాన్‌ 28 రోజులు వాలిడిటీ. అయితే ఈ ఆఫర్‌ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

రూ. 219 ప్లాన్

రూ. 219 ప్లాన్

219 రూపాయలతో ఎయిర్‌టెల్‌ ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ కింద రోజుకు 1.4జీబీ 3జీ లేదా 4జీ డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్టు ఎయిర్‌టెల్‌ తెలిపింది. అంటే మొత్తంగా 39.2జీబీ డేటాను యూజర్లు పొందనున్నారు. డేటాతో పాటు ‘హలో ట్యూన్‌' ప్రయోజనాలను, కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు ఆఫర్‌ చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది.

రూ.249 ప్లాన్‌

రూ.249 ప్లాన్‌

రూ.249రీఛార్జ్‌ ద్వారా వినియోగదారులు రోజుకు 2 జీబీ (3జీ/4జీ) డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 28రోజులు. అంటే మొత్తంగా 56జీబీ డేటా పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ (లోకల్‌,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.

రూ.349 ప్లాన్‌

రూ.349 ప్లాన్‌

ఈ ప్యాక్‌ను కూడా ఎయిర్‌టెల్‌ పునరుద్ధరించింది. ఇప్పటి వరకూ అందిస్తున్న 2.5జీబీ డేటా స్థానంలో తాజాగా 28రోజుల పాటు రోజుకు 3జీబీ డేటాను అందిస్తోంది.

రూ. 499 ప్లాన్‌

రూ. 499 ప్లాన్‌

రూ. 499 ప్లాన్‌లో రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటా అందిస్తుంది. యూజర్లు అన్‌ లిమిటెడ్‌, లోకల్‌, రోమిండ్‌ కాల్స్‌ ఉచితంగా పొందవచ్చు. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. ఈ ప్లాన్ 82 రోజులు చెల్లుతుంది. మొత్తం 164జీబీ డేటాను అందిస్తుందన్నమాట.

రూ.649 ప్లాన్‌

రూ.649 ప్లాన్‌

రూ.649 ప్లాన్‌ కింద నెలకు 50జీబీ డేటా మాత్రమే కాక, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోమింగ్‌లో అవుట్‌గోయింగ్‌ కాల్స్‌ ఉచితం. ఎలాంటి ఎఫ్‌యూపీ పరిమితి లేదు. ఈ పోస్టుపెయిడ్‌ ప్లాన్‌ డేటా రోల్‌ఓవర్‌ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. అంటే నెలలో సద్వినియోగం చేసుకోని డేటాను, తర్వాతి నెలకు పంపించుకునే అవకాశముంటుంది. ఈ ప్లాన్‌లో అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌కు ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. వింక్‌ టీవీ సబ్‌స్క్రిప్షన్‌, లైవ్‌టీవీ, మూవీలు, హ్యాండ్‌సెట్‌ డ్యామేజ్‌ ప్రొటెక్షన్‌ను ఇది ఆఫర్‌ చేస్తోంది.

రూ. 98 ప్లాన్

రూ. 98 ప్లాన్

రూ. 98 రీచార్జ్‌పై రోజువారీ పరిమితి లేకుండా 28 రోజుల వ్యవధిలో 5జీబీ (3జీ / 4జీ)డేటా ఉచితమని ప్రకటించింది. అంటే 28 రోజుల్లో ఎపుడైనా మొత్తం 5జీబీ డేటాను వాడుకనే సౌలభ్యాన్ని అందిస్తోంది. అయితే ఈ ప్లాన్‌లో ఎలాంటి వాయిస్‌ కాలింగ్‌ ఆఫర్లు లేవు. అలాగే ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు మాత్రమే అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Airtel Launches Rs. 558 Prepaid Plan With 3GB Data per Day for 82 Days to Take on Jio More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X