ఎయిర్‌టెల్ యూజర్లకు శుభవార్త.. రూ.59కే వీకెండ్ డేటా రోల్ ఓవర్ ప్యాక్.. కానీ ఇది కొనొచ్చా?
Airtel Rs 59 Plan: ఈ రోజుల్లో డేటా లేకపోతే పూట గడవని పరిస్థితి. సినిమాలు, షోలు స్ట్రీమింగ్ చేయాలన్నా, గేమ్స్ ఆడాలన్నా, ఏదైనా వెతకాలన్నా డేటా ఉండటం తప్పనిసరి. అయితే చాలా మందికి రోజుకిచ్చిన డేటా మొత్తం వాడకుండానే మిగిలిపోతుంది. ఇలా డేటా వృథా పోకుండా ఉండాలని ఎయిర్‌టెల్ ఒక సూపర్ ప్లాన్ తెచ్చింది. అదే రూ.59 వీకెండ్ డేటా రోల్‌ఓవర్ ప్యాక్. ఈ ప్యాక్ ఉంటే వారమంతా మిగిల్చిన డేటాని వీకెండ్‌లో వాడుకోవచ్చు.
* ఎయిర్‌టెల్ రూ.59 వీకెండ్ డేటా రోల్ ఓవర్ ప్యాక్
ఇటీవలే ఈ రూ.59 యాడ్-ఆన్ ప్యాక్‌ను హర్యానా, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో లాంచ్ చేసింది ఎయిర్‌టెల్. త్వరలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ అందుబాటులోకి తేనుంది. దీనికి 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అంతేకాదు, అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ డేటా బెనిఫిట్స్ ఉన్న బేస్ ప్లాన్ కూడా ఉండాలి.

* ఈ ప్లాన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే..
సోమవారం నుంచి శుక్రవారం వరకు మీరు వాడని డేటా శని, ఆదివారాల్లోకి యాడ్ అవుతుంది. ఉదాహరణకు మీకు రోజుకి 2GB డేటా ఉందనుకోండి, మీరు 1GB మాత్రమే వాడితే మిగిలిన 1GB వీకెండ్ డేటాలో కలుస్తుంది. వారమంతా తక్కువ డేటా వాడేవాళ్లకి, వీకెండ్‌లో స్ట్రీమింగ్, గేమ్స్ కోసం ఎక్కువ డేటా కావాలనుకునేవాళ్లకి ఇది మంచి ఆప్షన్.
ఐతే ఒకసారి డేటా లిమిట్ అయిపోతే స్పీడ్ మాత్రం 64Kbpsకి పడిపోతుంది. డేటా రోల్‌ఓవర్ ఆఫర్ చేయడం ఇండియాలో ఇదేం మొదటిసారి కాదు. వొడాఫోన్ ఐడియా (Vi) కూడా ఇలాంటి ఫీచర్ ఎప్పటినుండో ఇస్తుంది. ఈ ప్లాన్ ద్వారా ఎయిర్‌టెల్, డేటా పూర్తిగా వాడాలనుకునే యూజర్లను అట్రాక్ట్ చేయాలని చూస్తోంది.
* ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్
అంతేకాదు, ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌లో నెలవారీ డేటా రోల్‌ఓవర్ ఆప్షన్ కూడా ఉంది. పోస్ట్‌పెయిడ్ యూజర్లు వాడని డేటాని నెక్స్ట్ నెలకి వాడుకోవచ్చు. ఎక్కువ రోజులు వాలిడిటీ కావాలనుకునే వాళ్ల కోసం ఎయిర్‌టెల్ ఇంకో ప్లాన్ తెచ్చింది. అదే రూ.929 ప్రీపెయిడ్ ప్లాన్. ఇందులో రోజుకి 1.5GB డేటా (మొత్తం 90 రోజులకు 135 GB) వస్తుంది.
ఇండియా మొత్తం అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకి 100 SMSలు వస్తాయి. ఇంకా అపోలో 24/7 సర్కిల్ యాక్సెస్, హలో ట్యూన్స్ లాంటి అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్‌లో కూడా డైలీ డేటా లిమిట్ అయిపోతే స్పీడ్ 64Kbpsకి తగ్గుతుంది.
* ఎయిర్‌టెల్ ప్లాన్స్‌తో యాపిల్ TV+, మ్యూజిక్
డేటా రోల్‌ఓవర్‌తో పాటు, ఎయిర్‌టెల్, యాపిల్‌తో పార్ట్‌నర్‌షిప్ పెట్టుకుంది. పోస్ట్‌పెయిడ్, హోమ్ వై-ఫై యూజర్లకు యాపిల్ TV+, యాపిల్ మ్యూజిక్ ఫ్రీగా ఇస్తోంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్, పోస్ట్‌పెయిడ్ యూజర్లు రూ.999 ప్లాన్స్ నుంచి యాపిల్ TV+ యాక్సెస్ చేయొచ్చు. పోస్ట్‌పెయిడ్ యూజర్లకు ఆరు నెలల పాటు యాపిల్ మ్యూజిక్ ఫ్రీగా వస్తుంది.
* రూ.59 ప్యాక్ కొనొచ్చా, వద్దా?
మీరు వారమంతా డేటా మిగిలిస్తే, వీకెండ్‌లో స్ట్రీమింగ్ లేదా గేమ్స్ కోసం ఎక్కువ డేటా కావాలంటే ఈ ప్యాక్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇది డేటా వృథా పోకుండా చేస్తుంది, డేటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునేంత వెసులుబాటు కలిగిస్తుంది. ఐతే, బేస్ ప్లాన్ ఉండాలి, కొన్ని రాష్ట్రాల్లోనే అందుబాటులో ఉంది కాబట్టి అందరికీ ఇది వర్తించకపోవచ్చు.


Click it and Unblock the Notifications








