జియోని టార్గెట్ చేసిన Airtel, కొత్త ఆఫర్‌తో ఎంట్రీ

Written By:

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియోకి పోటీగా Airtel సరికొత్త ప్లాన్లతో దూసుకొస్తోంది. తాజాగా మరో 28 రోజుల వ్యాలిడిటీతో మరో సరికొత్త ప్లాన్ లాంచ్ చేసింది. యూజర్లు 65 రూపాయిలతో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు 1జీబీ 2జీ/3జీ డేటాను పొందవచ్చు. అయితే ఈ ప్లాన్‌ కేవలం ఎంపిక చేసిన ఎయిర్‌టెల్‌ సబ్‌స్క్రైబర్లకు మాత్రమేనని కంపెనీ తెలిపింది. మై ఎయిర్‌టెల్‌ యాప్‌ ద్వారా ఈ ప్లాన్‌కు యూజర్లు తాము అర్హులో కాదో చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. టెలికాం సర్కిల్‌ను బట్టి ఈ ప్లాన్‌ కింద ఎయిర్‌టెల్‌ కేవలం 2జీ లేదా 3జీ డేటాను మాత్రమే ఆఫర్‌ చేస్తోంది. అయితే ఎయిర్‌టెల్‌ 49 రూపాయిలతో డైలీ ప్లాన్‌ను కూడా ఆవిష్కరించింది. దీని కింద ఒక్క రోజు పాటు 1జీబీ 4జీ డేటాను యూజర్లు పొందవచ్చు. 49 రూపాయలతో టారిఫ్‌ ప్లాన్‌ కూడా ఉంది. ఈ టారిఫ్‌ ప్లాన్‌ కింద 28 రోజుల వాలిడిటీతో 2జీబీ 3జీ/4జీ డేటాను ఆఫర్‌ చేస్తోంది.

31తో జియో ప్రైమ్ సభ్యత్వం క్లోజ్, అధినేత స్పందన ఏంటంటే ?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 29 చెల్లించడం ద్వారా..

దీంతో పాటు రూ. 29 చెల్లించడం ద్వారా యూజర్లు నెల రోజుల పాటు డేటా వ్యాలిడిటీని పొందవచ్చు. రూ. 29 రీఛార్జ్ చేసుకుంటే మీకు 28 రోజులు పాటు 150 ఎంబి డేటా లభిస్తుంది. అయితే ఇది అంత గ్రేట్ డీల్ కాకపోవచ్చు కాని నెల రోజుల వ్యాలిడిటీ అనేది కొంచెం ఆలోచించదగ్గ విషయమేనని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా జియోలో రూ. 52 పాన్లో 7 రోజుల వ్యాలిడిటీతో 1.05 జిబి డేటాను అందిస్తోంది.

30జీబీ వరకు ఉచిత డేటా

Airtel జియోని టార్గెట్ చేస్తూ పలు రకాల ప్లాన్లను మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఇటీవలే వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ బీటా ప్రొగ్రామ్‌ను కూడా ఎయిర్‌టెల్‌ ఎంపికచేసిన జోన్లలో లాంచ్‌ చేసింది. ఈ ప్రొగ్రామ్‌ కింద ఎంపిక చేసిన యూజర్లకు 30జీబీ వరకు ఉచిత డేటాను అందిస్తోంది.

హెచ్‌డీ వాయిస్‌ కాలింగ్‌

హెచ్‌డీ వాయిస్‌ కాలింగ్‌, ఇన్‌స్టాంట్‌ కాల్‌ కనెక్ట్‌, మల్టి టాస్కింగ్‌ వంటి స్పెషల్‌ ఫీచర్లను వాయిస్‌ఓవర్‌ టెక్నాలజీ ఆఫర్‌ చేస్తోంది. ఈ సర్వీసులు ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒరిస్సా, అస్సాం, కేరళ, బిహార్‌, పంజాబ్‌లలో అందుబాటులో ఉన్నాయి.

4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ టెస్ట్‌లో

ఇదిలా ఉంటే Airtel 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ టెస్ట్‌లో దూసుకుపోయింది. జియోను దాటేసి, ఎయిర్‌టెల్‌ మెరుగైన పాయింట్లను స్కోర్‌ చేసిందని ఆల్ట్రా న్యూస్‌ రిపోర్టులో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 10 నగరాల్లో ట్రాయ్‌ చేపట్టిన 4జీ డౌన్‌లోడ్‌ స్పీడు టెస్ట్‌లో.. జియో, వొడాఫోన్‌, ఐడియాల కంటే ఎయిర్‌టెల్‌ మెరుగైన స్కోర్‌ను పొంది, 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ ప్రొవైడర్‌గా నిలిచింది.

రూ.9 ప్లాన్‌..

మీరు ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటోన్నట్లయితే రూ.50 బడ్జెట్‌లో అనేక ప్లాన్స్ మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఒకటైన రూ.9 ప్లాన్‌ను మీరు సబ్‌స్ర్కైబ్ చేసుకున్నట్లయితే 100 ఎంబి ఇంటర్నెట్‌తో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ అలానే 100 ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. ప్లాన్ వ్యాలిడిటీ ఒక్కరోజు మాత్రమే.

రూ.23 ప్లాన్‌

రెండు రోజుల వ్యాలిడిటీతో లభ్యమవుతోన్న రూ.23 ప్లాన్‌ను మీరు సబ్‌స్ర్కైబ్ చేసుకున్నట్లయితే 200 ఎంబి డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అలానే మెసేజెస్ అందుబాటులో ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel launches Rs 65 prepaid plan with 1GB data for 28 days to beat Jio tariffs More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot