Home
News

తక్కువ ధర, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, 45 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్ రీఛార్జీ ప్లాన్‌.. పూర్తి వివరాలు!

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌ టెల్‌ (Airtel) ఇటీవల వినియోగదారులను ఆకట్టుకొనే విధంగా రీఛార్జీ ప్లాన్‌ లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో డేటా, వ్యాలిడిటీ పెంచుకొనే ప్లాన్‌లు కూడా ఉంటున్నాయి. దీంతోపాటు OTT సబ్‌స్ర్కిప్షన్‌ కూడా కలిగిన ప్లాన్‌లు అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే తాజాగా ఎయిర్‌టెల్‌ తక్కువ ధరలో 45 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ప్రీపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్‌ను ( Airtel New Prepaid Recharge Plan With 45 days Validity Launched ) ఆవిష్కరించింది.

ఏకంగా 45 రోజుల వ్యాలిడిటీ :
ఎయిర్‌టెల్‌ తాజాగా రూ.279 ధరతో ప్రీపెయిట్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ ద్వారా ఏకంగా 45 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. తక్కువ ధరలో వ్యాలిడిటీని పెంచుకొనే ప్లాన్‌ ల గురించి ఎదురుచూసే వారికి ఈ ప్లాన్‌ సౌకర్యంగా ఉంటుంది. ఈ ప్లాన్‌ ప్రయోజనాల పూర్తి వివరాలు.

airtel launches Prepaid recharge plan RS279

మరెన్నో ప్రయోజనాలు :

ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్ రూ.279 తో రీఛార్జీ చేసుకుంటే.. 45 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సహా మొత్తంగా 600 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు మొత్తంగా 2GB డేటాను పొందవచ్చు. అదనపు డేటా కోసం రీఛార్జీ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితోపాటు Wync మ్యూజిక్‌, Hellotunes ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. మూడు నెలలపాటు అపోలో 24|7 సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.

ఇటీవలే మరో ప్లాన్‌ ను లాంచ్‌ చేసిన ఎయిర్‌టెల్‌ :

రెండు రోజుల క్రితం ఎయిర్‌టెల్‌ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ తో కలిపి మరో ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.699 రీఛార్జీ ప్లాన్‌ ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, హై స్పీడ్ డేటా సహా 20 పైగా OTT (ఓవర్‌ ది టాప్‌) సబ్‌స్క్రిప్షన్‌ లను పొందవచ్చు.

56 రోజుల వ్యాలిడిటీ :

ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ రూ.699 రీఛార్జీ ప్లాన్‌ ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 3GB హైస్పీడ్‌ డేటా సహా రోజుకు 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు 5G నెట్‌ వర్క్‌ ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ డేటాను వినియోగించుకోవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది.

మొత్తంగా 168GB 4G డేటా :

ఈ ప్లాన్‌ ద్వారా అమెజాన్ ప్రైమ్‌ వీడియో మరియు ఎయిర్‌టెల్ Xstream ప్లే సహా 20 కి పైగా OTT యాప్‌లను వినియోగించుకోవచ్చు. మరియు దీంతోపాటు Wynk మ్యూజిక్‌ యాప్‌, Hellotunes ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ లో మొత్తంగా 168GB 4G డేటాను పొందవచ్చు.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
airtel launches RS279 Prepaid recharge plan with 45 days validity
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X