ఎయిర్‌టెల్ యూజర్ల కోసం... ‘స్మార్ట్ డ్రైవ్’

Posted By: Staff

ఎయిర్‌టెల్ యూజర్ల కోసం... ‘స్మార్ట్ డ్రైవ్’

హైదరబాద్: ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు గమ్యస్థానానికి తడబడకుండా చేరుకోవటం.. వెళ్లే దారిలో ట్రాఫిక్ అప్‌డేట్‌ను ముందుగానే తెలుసుకోవటం వంటి విశేషాలతో కూడిన ‘స్మార్ట్ డ్రైవ్’ మొబైల్ అప్లికేషన్‌ను ప్రముఖ టెలికామ్ ప్రొవైడర్ ఎయిర్‌టెల్ ఆవిష్కరించింది. యూజర్ తన మొబైల్‌లో ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసకున్నట్లయితే రూట్ అడ్ర‌ లతో పాటు ట్రాఫిక్ సమాచారాన్ని వాయిస్ ఆధారితంగా తెలుసుకోవచ్చు. దేశంలో ఈ ‘రియల్ టైమ్ నేవిగేషన్’ సర్వీస్‌ను ప్రారంభించిన ఏకైక సంస్థగా తాము గుర్తింపు పొందినట్లు ఎయిర్‌టెల్ వర్గాలు ఒ ప్రకటనలో పేర్కొన్నాయి.

ఈ అప్లికేషన్‌ను పొందాలనుకునే సదరు ఎయిర్‌టెల్ వినియోగదారు తన మొబైల్ ద్వారా ‘‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎయిర్‌టెల్‌లైవ్.కామ్/స్మార్ట్‌డ్రైవ్’’లోకి లాగినై డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చు. లేదా ‘‘స్మార్ట్’’ అని టైప్ చేసి ‘543221’కి ఎస్ఎంఎస్ పంపితే సరిపోతుంది. ఈ అప్లికేషన్ ద్వారా రియల్ టైమ్ ట్రాఫిక్ అప్డేట్ ను నెల మొత్తం పొందాలనుకున్న వారు నెలసరి ప్యాక్ కింద రూ.49 చెల్లించాల్సి ఉంటుంది. ఒక రోజు అప్‌డేట్ కోసం రూ.3 చెల్లించాల్సి ఉంది. టర్న్ బై టర్న్ నేవిగేషన్ అప్లికేషన్‌ను నెల మొత్తం ఉపయోగించుకోవాలనుకునే వారు నెలసరి ప్యాక్ కింద రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. డైలీ ప్యాక్ విలువ రూ.10. ఆండ్రాయిడ్, సింబియాన్, బ్లాక్‌బెర్రీ ఇంకా విండోస్ ప్లాట్‌ఫామ్‌లను ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది.

Read in English:

భారత్‌లో ఎయిర్‌టెల్ వినియోగదారుల సంఖ్య 20 కోట్లు!

టెలీ కమ్యూనికేషన్ సర్వీస్‌లను అందిస్తున్న ప్రముఖ సంస్థ ఎయిర్‌టెల్ భారత్‌లో 20కోట్ల మంది వినియోగదారులు సంఖ్యను దాటింది. భారతి ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తున్న 2జీ, 3జీ, 4జీ, ఫిక్సుడ్ లైన్, డీఎస్ఎల్ బ్రాడ్ బ్యాండ్, ఐపీటీవీ, డీటీహెచ్ సర్వీస్‌లను దేశ వ్యాప్తంగా 20 కోట్ల మంది వినియోగించుకుంటున్నారు. గడిచిన మూడు సంవత్సరాల కాలంలో ఏకంగా 10 కోట్ల మంది కొత్త వినియోగదారులను భారతీ ఎయిర్‌టెల్ రాబట్టుకోగలిగింది. ఈ అంశం పై భారతీ ఎయిర్‌టెల్ సీఈవో(భారత్, దక్షిణ ఆసియా దేశాలు) సంజయ్ కపూర్ స్పందిస్తూ భారతీయ టెలికాం విభాగంలో తాము క్రీయాశీలక బాధ్యతలు చేపట్టటం గర్వకారణంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. పోటీ మార్కెట్‌కు అనుగుణంగా వ్యవహరించటంతో పాటు ఉత్తమమైన సేవలను వినియోగదారుకు అందించడం కారణంగానే మొదటి 14 సంవత్సరాల్లో 10 కోట్లు, తరువాతి మూడు సంవత్సరాల కాలంలో మరో 10 కోట్ల మంది వినియోగదారులను ఆకట్టుకోగలిగినట్లు ఆయన వెల్లడించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot