ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు లాంచ్!! జియో 1నెల పూర్తి వాలిడిటి ప్లాన్‌కి పోటీగా

|

దేశంలోని ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లలో ఒకటైన ఎయిర్‌టెల్ ఇప్పుడు తన యొక్క వినియోగదారులకు ఊహించని బహుమతిగా ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండానే రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. అది కూడా ఒక నెల పూర్తి చెల్లుబాటుతో. టెల్కో యొక్క కొత్త ప్లాన్లు రెగ్యులేటర్ TRAI యొక్క ఆర్డర్‌కు అనుగుణంగా వస్తుంది. దీని ప్రకారం ప్రతి సర్వీస్ ప్రొవైడర్ ప్రతి నెలా అదే తేదీన రీఛార్జ్ చేసుకోవడానికి వీలుగా ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉండాలి. ఎయిర్‌టెల్ యొక్క ప్రత్యర్థి జియో కూడా ఇటీవల రూ.296 మరియు రూ.259 ధర వద్ద 1-నెల పూర్తి వాలిడిటీతో వచ్చే రెండు ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. మరోవైపు వోడాఫోన్ ఐడియా లేదా Vi కూడా నెలవారీ చెల్లుబాటుతో రూ.337 మరియు రూ.327 వద్ద రెండు ప్లాన్‌లను అందిస్తోంది. ఎయిర్‌టెల్ ప్రారంభించిన ఈ రెండు కొత్త ప్లాన్‌లు మిగిలిన వాటి కంటే ఎంత వరకు మెరుగ్గా ఉన్నాయో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ రూ. 296 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ. 296 ప్లాన్

296 రూపాయల ధర వద్ద ఎయిర్‌టెల్ టెల్కో ప్రవేశపెట్టిన కొత్త ప్లాన్ 30 రోజుల సర్వీస్ వ్యాలిడిటీతో వస్తుంది. ఇది మొత్తం వాలిడిటీ కాలానికి 25GB డేటాను అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్ మరియు 100 SMS/రోజు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దీనితో పాటు అపోలో 24/7 సర్కిల్, వింక్ మ్యూజిక్ వంటి మరిన్నింటితో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ యొక్క ఉచిత ట్రయల్ యాక్సెస్‌తో ఈ ప్లాన్ లభిస్తుంది. అందించిన డేటా పూర్తయిన తర్వాత వినియోగదారులకు 50p/MB ఛార్జ్ చేయబడుతుంది. అంతేకాకుండా 100SMS/రోజు ముగిసిన తర్వాత స్థానిక SMS ఛార్జీలు రూ.1 మరియు STD SMSకి రూ.1.5 వసూలు చేయబడతాయి.

D2h ఇన్‌యాక్టివ్‌ యూజర్ల కోసం కొత్తగా రెండు ఛానెల్ ప్యాక్‌లను లాంచ్ చేసింది...D2h ఇన్‌యాక్టివ్‌ యూజర్ల కోసం కొత్తగా రెండు ఛానెల్ ప్యాక్‌లను లాంచ్ చేసింది...

ఎయిర్‌టెల్ రూ. 319 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ. 319 ప్లాన్

ఎయిర్‌టెల్ కొత్తగా ప్రవేశపెట్టిన మరొక ప్లాన్ వాస్తవానికి రోజువారీ డేటా ప్రయోజనంతో రూ.319 ధర ట్యాగ్‌తో లభిస్తుంది. ఇది పూర్తిగా 1 నెల చెల్లుబాటు వ్యవధిలో రోజుకు 2GB డేటా ప్రయోజనంను అందిస్తోంది. అలాగే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పైన పేర్కొన్న విధంగానే ఈ ప్లాన్ కూడా అపోలో 24/7 సర్కిల్, వింక్ మ్యూజిక్ వంటి మరిన్నింటితో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ యొక్క ఉచిత ట్రయల్‌ యాక్సెస్‌తో వస్తుంది. రోజువారీ డేటా పూర్తయిన తర్వాత వినియోగదారులకు 50p/MB ఛార్జ్ చేయబడుతుంది. అంతేకాకుండా 100SMS/రోజు ముగిసిన తర్వాత SMS ఛార్జీలు స్థానిక SMSకి రూ.1 మరియు STD SMSకి రూ. 1.5 వసూలు చేయబడతాయి.

ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ సంస్థ మొదటిసారిగా యాక్సిస్ బ్యాంక్ తో కలిసి అందించే క్రెడిట్ కార్డుతో కస్టమర్‌లు పొందే ప్రయోజనాలు కింద వివరంగా ఉన్నాయి.

** ఏదైనా ఎయిర్‌టెల్ DTH లేదా మొబైల్ రీఛార్జ్, ఎయిర్‌టెల్ Xstream ఫైబర్ లేదా ఎయిర్‌టెల్ బ్లాక్ పేమెంట్లపై 25% క్యాష్‌బ్యాక్.

** Zomato, Swiggy మరియు BigBasket వంటి వ్యాపారులతో ఖర్చు చేయడంపై 10% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

** ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా కరెంట్/ వాటర్ బిల్లు/గ్యాస్ వంటి పేమెంట్లపై 10% క్యాష్‌బ్యాక్.

** అలాగే వినియోగదారులు ఉపయోగించే ఇతర ఖర్చులపై 1% క్యాష్‌బ్యాక్.

** జారీ చేసిన 30 రోజులలోపు కార్డ్ యాక్టివేషన్‌పై రూ.500 విలువైన అమెజాన్ ఇ-వోచర్ ఉచితంగా లభిస్తుంది.

 

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా బంగారాన్ని కొనుగోలు చేసే విధానం

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా బంగారాన్ని కొనుగోలు చేసే విధానం

** ముందుగా ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ని ఓపెన్ చేసి బ్యాంకింగ్ విభాగానికి వెళ్లాలి.

** తరువాత అందులో డిజిగోల్డ్ చిహ్నంపై నొక్కాలి.

** ఇందులో బంగారం కొనండి, బంగారం అమ్మండి మరియు బహుమతి బంగారంతో సహా బహుళ ఎంపికలను పొందుతారు.

** బయ్ గోల్డ్ ఆప్షన్‌పై ట్యాప్ చేసి మీరు ఎంత మొత్తంలో గ్రాముల పరంగా కొనుగోలు చేయాలనుకుంటున్నారో అని ఎంచుకోండి.

** లావాదేవీని పూర్తి చేయడానికి మీరు ఎంచుకున్న మొత్తం లేదా గ్రాములు మరియు Mpinని నమోదు చేయండి.

** పూర్తయిన తర్వాత మీరు కొనుగోలు చేసిన లావాదేవీకి సంబందించిన రసీదును అన్ని వివరాలతో అందుకుంటారు.

 

Best Mobiles in India

English summary
Airtel Launches Two New Prepaid Plans! Compete With Jio's 1 Month Validity Plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X