ఎయిర్‌టెల్ యూజర్లకు 15GB బోనస్ డేటాతో కొత్తగా ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ ప్యాక్!!
భారతీ ఎయిర్‌టెల్ టెలికాం సంస్థ తన యొక్క అన్ని ప్లాన్‌లో చాలా వరకు ఎయిర్‌టెల్ థాంక్స్ బెనిఫిట్స్‌లో చేర్చబడిన 'ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్' సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగదారులకు అందిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ అనేది భారతీ ఎయిర్‌టెల్ యాజమాన్యంలోని ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్. ఇది ప్రయాణ సమయాలలో టీవీ కార్యక్రమాలు మరియు సినిమాలను వీక్షించే సామర్థ్యాన్ని వినియోగదారులకు అందిస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ తన యొక్క వినియోగదారులకు 'ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ ప్యాక్' అనే కొత్త సర్వీసును అందిస్తోంది. ఈ ప్యాక్ Xstream మొబైల్ ప్యాక్‌తో అందుబాటులో ఉన్న అన్ని ఛానెల్‌లకు 30 రోజుల ఉచిత యాక్సెస్‌తో పాటు 15GB డేటాను వినియోగదారులకు అందిస్తుంది.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ ప్యాక్ పూర్తి వివరాలు
భారతదేశం వైవిధ్యభరితమైన దేశం కాబట్టి దేశంలోని వివిధ ప్రాంతాలు వివిధ భాషల్లో కంటెంట్‌ను వినియోగించాలనుకుంటాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యూజర్లు హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ, తెలుగు, కన్నడ, మలయాళం, గుజరాతీ, పంజాబీ మరియు ఆంగ్లంతో సహా పలు భాషలలో కంటెంట్‌ను ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది. ఈ ప్లాట్‌ఫాం ఇతర OTT కంటెంట్ డిస్ట్రిబ్యూటర్‌లైన ఎపికాన్, షార్ట్స్ టీవీ, ఎరోస్ నౌ మరియు ముబి వంటి వాటితో భాగస్వామిగా ఉంది. ఇది విభిన్నమైన శైలులను వీక్షించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ విధంగా వినియోగదారులు కంటెంట్‌ని సెర్చ్ చేయడానికి వివిధ ప్లాట్‌ఫారమ్‌లకు వెళ్లవలసిన అవసరం లేదు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లో తమకు ఇష్టమైన అన్ని షోలు మరియు సినిమాలను పొందవచ్చు.

‘ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ ప్యాక్' ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో కనిపించడం లేదు. కేవలం iOS వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండవచ్చని గమనించండి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లలో కూడా తమకు ఇష్టమైన కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూజర్లు డేటాను సేవ్ చేయడానికి డౌన్‌లోడ్ నాణ్యతను మార్చవచ్చు.

అల్ట్రా, ముబి, ఇరోస్ నౌ, హోయిచోయ్, షార్ట్స్ టీవీ, డివో, షెమరూ, ఎపికాన్, డాలీవుడ్ ప్లే, నమ్మఫ్లిక్స్ మరియు మరిన్నింటితో సహా అనేక OTT ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్ అప్లికేషన్ తో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ ప్యాక్ లభిస్తుంది. అయితే ఈ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ ప్యాక్ ధర ప్రస్తుతానికి తెలియదు. ఇంకా కంపెనీ తన వెబ్‌సైట్‌లో దీని యొక్క ధరను పేర్కొనలేదు మరియు యాప్ వివరాలు కూడా ప్రకటించలేదు. ఇది త్వరలో iOS మరియు Android వినియోగదారుల కోసం దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని భావించవచ్చు. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నది.

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు
ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు నెలకు రూ.499ల నుండి ప్రారంభమయి రూ.3,999 వరకు అందుబాటులో ఉన్నాయి. అన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు 3, 6 మరియు 12 నెలల సబ్స్క్రిప్షన్ లతో అందించబడతాయి. ఒక కస్టమర్ ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఒక నెల చెల్లుబాటుకు ఎంచుకుంటే కనుక వారు ఇన్‌స్టాలేషన్ ఛార్జీల కోసం రూ.1000 చెల్లించాలి. అయితే 3/6/12 నెలల దీర్ఘకాలిక ప్లాన్‌లపై ఇన్‌స్టాలేషన్ ఛార్జీలను పూర్తిగా మాఫీ చేస్తాయని కంపెనీ తెలిపింది. అలాగే ఈ ప్లాన్‌లపై చందాదారులకు వరుసగా 7.5% మరియు 15% వరకు తగ్గింపు కూడా అదనంగా లభిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు రూ.799 ధర వద్ద మరియు అంతకంటే ఎక్కువ ధర గల ప్లాన్‌లను ఎంచుకుంటే కనుక కస్టమర్లందరికీ రూ.3999 విలువైన ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ను ఉచితంగా పొందడానికి అర్హత ఉంటుంది. దీని కోసం వారు తిరిగి చెల్లించాల్సిన 1,500 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. కస్టమర్లు 12 నెలల తర్వాత ఈ STBని తిరిగి ఇస్తే కనుక ఎయిర్‌టెల్ సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి ఇస్తుంది. అయితే కస్టమర్ 12 నెలల్లోపు STBని తిరిగి ఇస్తే కనుక రూ.1,500 సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి ఇవ్వబడదు.


Click it and Unblock the Notifications