విడుదలకు సిద్దమవుతోన్న Airtel VoLTE

ప్రముఖ ప్రయివేటురంగ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన వాయిస్ ఓవర్ ఎల్‌టీఈ (VoLTE) సర్వీసులను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు తెలియవచ్చింది. అయితే, ఈ సమచారాన్ని ఎయిర్‌టెల్ ఈ సమాచారాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

Read More : రూ.15,000లో బెస్ట్ డ్యుయల్ కెమెరా ఫోన్స్ ఈ నాలుగే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రస్తుతానికి రిలయన్స్ జియో ఒక్కటే...

ప్రస్తుతానికి రిలయన్స్ జియో ఒక్కటే దేశీయంగా VoLTE సేవలను అందిస్తోంది. త్వరలోనే ఈ జాబితాలోకి ఎయిర్‌టెల్ చేరబోతోంది. ముందుగా ఎయిర్‌టెల్ వోల్ట్ సర్వీసులు ముంబై నగరంలో అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. ఆ తరువాత కోల్‌కతాతో పాటు మరిన్ని మెట్రో నగరాల్లో సర్వీసును లాంచ్ చేస్తారని తెలుస్తోంది.

నోకియా అభివృద్ధి చేస్తోంది..

ఎయిర్‌టెల్ VoLTE టెక్నాలజీని నోకియా అభివృద్ధి చేస్తోంది. గతేడాది నవంబర్‌లో కుదిరిన ఈ డీల్ విలువ రూ.402 కోట్లు. జియోకు పోటీగా ఎయిర్‌టెల్ ఈ సర్వీసును తీసుకువస్తోంది. VoLTE కమ్యూనికేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాబోతున్న నేపథ్యంలో మోటరోలా, షియోమి, సామ్‌సంగ్, ఒప్పో వంటి బ్రాండ్‌లకు చెందిన స్మార్ట్‌ఫోన్‌లలో ఈ టక్నాలజీని విజయవంతంగా పరీక్షించి చూసినట్లు సమాచారం.

హై-స్పీడ్ వైర్‌లెస్ కమ్యూనికేషన్..

హై-స్పీడ్ వైర్‌లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థలలో ఒకటైన VoLTE, స్మార్ట్‌ఫోన్‌ కమ్యూనికేషన్‌‌ను సరికొత్త లెవల్‌కు తీసుకువెళ్లింది. ప్రస్తుత ట్రెండ్‌ను అంచనా వేసినట్లయితే దాదాపుగా అన్ని స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు 4G VoLTE ఫీచర్‌ను తమ ఫోన్‌లతో అందిస్తున్నాయి. 4G VoLTE కమ్యూనికేషన్‌కు అంతకంతకు డిమాండ్ పెరుగుతుండటంతో బేసిక్ ఫోన్‌లలోనూ ఈ
సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేస్తున్నాయి.

VoLTE కాల్స్ అనేవి.

వాస్తవానికి, వాయిస్ ఓవర్ ఎల్టీఈ అనేది ఇంటర్నెట్ ద్వారా కాల్స్ చేసుకునేందుకు మరొక మార్గం. VoLTE కాల్స్ అనేవి స్టాండర్డ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా కాకుండా మొబైల్ 4జీ LTE బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ ద్వారా డెలివరీ కాబడతాయి. VoLTE కమ్యూనికేషన్ స్టాండర్డ్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నట్లయితే హైడెఫినిషన్ వాయిస్ కాల్స్ చేసుకునే వీలుంటుంది.

VoLTE అంటే వాయిస్ ఓవర్ ఎల్టీఈ అని అర్థం.

ఈ కనెక్టువిటీ ఫీచర్.. 4జీ సర్వీస్ ద్వారా హై క్వాలిటీ వాయిస్, వీడియో ఇంకా మల్టీమీడియా సేవలను యూజర్లకు చేరువచేస్తుంది. VoLTE వ్యవస్థ ముఖ్యంగా కాల్ క్వాలిటీని మరింత మెరుగుపరుస్తుంది. 3జీ కంటే మూడు రెట్లు, 2జీ కంటే 6 రెట్ల వేగంతో డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి జియో మాత్రమే మార్కెట్లో 4జీ వోల్ట్ సర్వీసులను ఆఫర్ చేస్తోంది. త్వరలో ఈ జాబితాలో ఎయిర్‌టెల్ చేరబోతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel launching VoLTE services next week to take on Reliance Jio: Report. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot