Home
News

లోక్‌సభ ఎన్నికల తర్వాత మొబైల్ రీఛార్జ్‌ టారిఫ్‌ల ధరలు పెరిగే ఛాన్స్‌.. పూర్తి వివరాలు..!

ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ (Airtel May hike Tariffs) త్వరలో యూజర్లకు షాక్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత టారిఫ్‌లు పెంచేందుకు ఎయిర్‌టెల్‌ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సగటు ఆదాయాన్ని పెంచుకొనే మార్గాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

లోక్‌సభ ఎన్నికల అనంతరం జులై- అక్టోబర్‌ మధ్య సుమారు 15 శాతం టారిఫ్‌లు పెంచే అవకాశం ఉంది. అయితే మరో టెలికాం దిగ్గజం జియో మాత్రం టారిఫ్‌లు పెంచే ఆలోచన చేయకున్నా... డేటా వినియోగాన్ని ఎక్కువగా ప్రోత్సహించాలని భావిస్తోంది. ఫలితంగా ఆయా ప్లాన్ల ద్వారా యూజర్లను ఆకట్టుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతానికి జియో కంటే ఎయిర్‌టెల్‌ ప్లాన్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి.

Airtel may hike tariffs after lok sabha elections 2024

ప్రస్తుతం మార్కెట్‌ వాటా ప్రకారం జియో తొలిస్థానంలో ఉంది. అనంతరం మరో టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌.. తర్వాత స్థానంలో వోడాఫోన్‌- ఐడియా ఉంది. ప్రస్తుతం వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం ఎయిర్‌టెల్‌కు రూ.208, జియోకు రూ.182 మరియు రూ.145 గా ఉంది.

టారిఫ్‌ల పెంపుపై ఎయిర్‌టెల్‌, జియో స్పష్టతతో ఉన్నా... వోడాఫోన్‌- ఐడియా గురించి ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. అయితే జియో మాత్రం టారిఫ్‌లు పెంచకున్నా ఇతర ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్‌ ప్రారంభం అయినందు వల్ల యువత ఎక్కువగా డేటాను వినియోగిస్తుందని భావిస్తోంది. ఫలితంగా ఎక్కువ డేటా కలిగిన ప్లాన్లతో రీఛార్జ్‌ చేసుకుంటారని భావిస్తోంది.

జియో సినిమా యాప్ ద్వారా ఉచితంగానే ఐపీఎల్‌ 2024 మ్యాచ్‌లను చూసేందుకు వీలుంది. జియో తన జియో ఫైబర్‌ బ్రాడ్ బ్యాండ్‌ ప్లాన్‌లను ఇతర సర్వీసులతో కలిపి అందిస్తోంది. ఫలితంగా టారిఫ్‌ ఛార్జీలు పెంచకుండానే సగటు ఆదాయం పెరుగుతుందని జియో భావిస్తోంది.

ఎయిర్‌టెల్‌ ఐపీఎల్‌ రీఛార్జి ప్లాన్‌
ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ రూ.699 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 56 రోజుల వ్యాలిడిటీని (IPL 2024 Airtel Recharge Plans) కలిగి ఉంటుంది. రోజుకు 3GB చొప్పున 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ ను కూడా పొందవచ్చు. మరియు 5G నెట్‌వర్క్‌ను సపోర్టు చేసే స్మార్ట్‌ఫోన్లలో అన్‌లిమిడెట్ 5G డేటాను పొందవచ్చు.

జియో ఐపీఎల్‌ ప్లాన్‌లు
జియో వినియోగదారులు రూ.444తో రీఛార్జ్‌ చేసుకుంటే 60 రోజుల వ్యాలిడిటిలో 100GB డేటాను పొందవచ్చు. అదే రూ.667 ప్లాన్‌తో 90 రోజులపాటు 150GBని పొందవచ్చు. దీంతోపాటు ఫెస్టివ్‌ ఆఫర్‌లో భాగంగా రూ.999 ప్లాన్‌ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 3GB చొప్పున 4G డేటాను పొందవచ్చు.

ఐపీఎల్‌ వోడాఫోన్- ఐడియా రీఛార్జ్‌ ప్లాన్‌లు
Vi రూ.699 ప్లాన్‌ ద్వారా రీఛార్జ్‌ చేసుకుంటే 56 రోజుల వ్యాలిడిటీతో 3GB డేటాను (IPL 2024 Vi Recharge Plans) పొందవచ్చు. దీంతోపాటు రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్‌ 4G డేటాను పొందవచ్చు. మరియు Vi మూవీస్‌, TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.

అధికంగా డేటాను వినియోగించుకొనే యూజర్ల కోసం రూ.475 ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా 28 రోజులపాటు 4GB చొప్పున డేటాను పొందవచ్చు. రూ.418 రీఛార్జీ ప్లాన్‌తో 56 రోజుల వ్యాలిడిటీతో 100GB డేటాను పొందవచ్చు. డేటా వోచర్లను కూడా అందుబాటులో ఉంచింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel may hike tariffs after lok sabha elections 2024 and jio has separate plan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X