ఎయిర్‌టెల్ స్టోర్‌లో iPhone X?

|

భారతీ ఎయిర్‌టెల్, ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన ఆపిల్ iPhone X స్మార్ట్‌ఫోన్‌ను తన అఫీషియల్ ఆన్‌లైన్ స్టోర్‌లో విక్రయించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నవంబర్ 3 నుంచి ప్రారంభయ్యే ఈ సేల్ భాగంగా ఐఫోన్ ఎక్స్ కొనుగోలు పై పలు ఆఫర్లను కూడా ఎయిర్‌టెల్ అందుబాటులో ఉంచబోతోందట. అయితే, ఈ సమాచారాన్ని ఎయిర్‌టెల్ అఫీషియల్‌గా ధృవీకరించాల్సి ఉంది.

Airtel may launch iPhone X on its newly launched online store

ఎయిర్‌టెల్ తన ప్రాజెక్ట్ నెక్స్ట్ డిజిటల్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్‌‌ను కొద్ది రోజుల క్రితం మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ స్టోర్ ద్వారా ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లను సలువైన డౌన్‌పేమెంట్‌లతో ఎయిర్‌టెల్ విక్రయిస్తోంది. అంతేకాకుండా, ఇన్‌స్టెంట్ క్రెడిట్ వెరిఫికేషన్, ఫైనాన్సింగ్, బండిల్డ్ మంత్లీ ప్లాన్స్ వంటి సౌకర్యాలను కూడా కల్పిస్తోంది.

ఈ స్టోర్‌లో ప్రస్తుతానికి iPhone 7, iPhone 7 Plus వేరియంట్‌లను ఎయిర్‌టెల్ విక్రయిస్తోంది. త్వరలోనే మరిన్ని బ్రాండ్‌లకు సంబంధించిన ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లను తమ స్టోర్‌లో అందుబాటులో ఉంచుతామని ఎయిర్‌టెల్ చెబుతోంది. ఎయిర్‌టెల్ స్టోర్‌లో ఐఫోన్ 32జీబి వేరియంట్‌, రూ.7,777 డౌన్‌పేమెంట్‌తో లభ్యమవుతోంది. మిగిలిన మొత్తాన్ని నెలకు రూ.2,499 చొప్పున 24 నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్‌లలో చెల్లించాల్సి ఉంటుంది.

ఎయిర్‌టెల్ అందించే హై-ఎండ్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో కలుపుకుని ఈ నెలవారీ వాయిుదా ఉంటుంది. ఈ ఫోన్ పై లభించే ప్లాన్‌లో భాగంగా నెలకు 30జీబి డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ (లోకల్, ఎస్ టీడీ, నేషనల్ రోమింగ్)తో పాటు నెల మొత్తం మెసేజెస్ అందుబాటులో ఉంటాయి. ఎయిర్‌టెల్ సెక్యూర్ ప్యాకేజీ క్రింద ఈ ఫోన్ పై ఫిిజికల్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌తో పాటు సైబర్ ప్రొటెక్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.

మతిపోగొడుతున్న సామ్‌సంగ్ గెలాక్సీ స్టూడియో..మతిపోగొడుతున్న సామ్‌సంగ్ గెలాక్సీ స్టూడియో..

ఎయిర్‌టెల్ తన ప్రాజెక్ట్ నెక్స్ట్ డిజిటల్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్‌ నిమిత్తం 2000 కోట్ల వరకు వెచ్చించబోతోంది. ఈ ప్రోగ్రామ్ క్రింద అనేక డిజిటల్ ఇన్నోవేషన్స్‌ను ఎయిర్‌టెల్ త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇదిలా ఉండగా ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో iPhone 8, iPhone 8 Plus స్మార్ట్‌ఫోన్‌లను నేవి ముంబైలోని తన ప్రధాన కార్యాలయంలో లాంచ్ చేసింది.

ఈ సందర్భంగా జియో యాజమాన్యం స్పందిస్తూ కొత్త ఐఫోన్‌ల కొనుగోలు పై రిలయన్స్ డిజిటిల్ 70 శాతం వరకు స్పెషల్ బుయ్ బ్యాక్‌ను ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. రూ.799 అంతకన్నా ఎక్కువ టారిఫ్‌తో కూడిన జియో ప్లాన్‌లను ఎంచుకునే వారికి ఫోన్ MRP పై 70 శాతం అమౌంట్‌ను ఏడాది తరువాత ఫోన్‌ను రిటర్న్ చేసిన వారికి ఇవ్వటం జరుగుతుందని జియో తెలిపింది.

యాపిల్ ఐఫోన్ మార్కెట్లో లాంచ్ అయి 10 సంవత్సరాల పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని ఆ సంస్థ iPhone X పేరుతో స్పెషల్ ఎడిషన్‌ను ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఐఫోన్ 10గా పిలవబడుతోన్న ఈ ఫోన్, ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్‌లతో పోలిస్తే అట్రాక్టివ్ ఫీచర్లను కలిగి ఉంది.

డిజైనింగ్ పరంగా ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్‌లతో పోలిస్తే, iPhone Xను పూర్తిగా రీడిజైన్ చేయటం జరిగింది. bezel-less edge-to-edge డిస్‌ప్లే, ఐఫోన్ ఎక్స్ ఫోన్‌కు ప్రధాన హైలైట్. ఈ మోడల్‌లో హోమ్ బటన్ కనిపించదు.

స్టెయిన్‌లెస్ స్టీల్ బ్యాండ్స్ ఫోన్ లుక్‌నే మార్చివేసాయి. గ్లాస్ బాడీ ఫోన్‌కు ప్రొఫెషనల్ లుక్‌ను తీసుకువచ్చింది. iPhone X స్మార్ట్‌ఫోన్‌కు మరో ప్రధానమైన హైలైట్ OLED స్ర్కీన్. అంతేకుండా ఈ స్మార్ట్‌ఫోన్ ఏకంగా 5.8 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే రిసల్యూషన్ విషయానికి వచ్చేసరికి 2436 x 1125పిక్సల్స్ విత్ 458 పీపీఐ.

iPhone X స్మార్ట్‌ఫోన్‌కు మరో ప్రధానమైన హైలైట్ FaceID. ఈ సెక్యూరిటీ ఫీచర్‌తో యూజర్ తన ముఖాన్నే పాస్‌వర్డ్‌గా సెట్ చేసుకుని ఫోన్‌ను అన్ లాక్ చేసే వీలుంటుంది. ఈ FaceID ఫీచర్‌ను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దే క్రమంలో ట్రుడెప్త్ కెమెరాను యాపిల్ వినియోగించింది.

ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ ఎక్స్ (256జీబి స్టోరేజ్) వర్షన్ ధర రూ.1,02,000గా ఉంటుంది. బేసిక్ వర్షన్ ధర రూ.89,000గా ఉంటుంది.

Best Mobiles in India

Read more about:
English summary
There is no official announcement by the company yet

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X