ఈ రోజే ఎయిర్‌టెల్ VoLTE లాంచ్..?

భారతదేశపు అతిపెద్ద టెలికమ్ ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ నుంచి మేజర్ అనౌన్స్‌మెంట్ ఒకటి రాబోతున్నట్లు సమాచారం. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోన్న పలు రిపోర్ట్స్ ప్రకారం ఎయిర్‌టెల్ వాయిస్ ఓవర్ ఎల్‌టీఈ (VoLTE) సర్వీసులు ఈ రోజు మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా అభివృద్ధి చేస్తోంది...

ఎయిర్‌టెల్ VoLTE టెక్నాలజీని నోకియా అభివృద్ధి చేస్తోంది. గతేడాది నవంబర్‌లో కుదిరిన ఈ డీల్ విలువ రూ.402 కోట్లు. జియోకు పోటీగా ఎయిర్‌టెల్ ఈ సర్వీసును తీసుకువస్తోంది.

మోటరోలా, షియోమీ, సామ్‌సంగ్, ఒప్పో ఫోన్‌లలో..

VoLTE కమ్యూనికేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాబోతున్న నేపథ్యంలో మోటరోలా, షియోమీ, సామ్‌సంగ్, ఒప్పో వంటి బ్రాండ్‌లకు చెందిన స్మార్ట్‌ఫోన్‌లలో ఈ టక్నాలజీని విజయవంతంగా పరీక్షించి చూసినట్లు సమాచారం.

హై-స్పీడ్ వైర్‌లెస్ కమ్యూనికేషన్

హై-స్పీడ్ వైర్‌లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థలలో ఒకటైన VoLTE, స్మార్ట్‌ఫోన్‌ కమ్యూనికేషన్‌‌ను సరికొత్త లెవల్‌కు తీసుకువెళ్లింది.

దాదాపుగా అన్ని ఫోన్‌లు 4జీ వోల్ట్ సపోర్ట్‌తో ...

ప్రస్తుత ట్రెండ్‌ను అంచనా వేసినట్లయితే దాదాపుగా అన్ని స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు 4G VoLTE ఫీచర్‌ను తమ ఫోన్‌లతో అందిస్తున్నాయి. 4G VoLTE కమ్యూనికేషన్‌కు అంతకంతకు డిమాండ్ పెరుగుతుండటంతో బేసిక్ ఫోన్‌లలోనూ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేస్తున్నాయి.

స్టాండర్డ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా...

4జీ LTE బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ వాస్తవానికి, వాయిస్ ఓవర్ ఎల్టీఈ అనేది ఇంటర్నెట్ ద్వారా కాల్స్ చేసుకునేందుకు మరొక మార్గం. VoLTE కాల్స్ అనేవి స్టాండర్డ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా కాకుండా మొబైల్ 4జీ LTE బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ ద్వారా డెలివరీ కాబడతాయి.

హైడెఫినిషన్ వాయిస్ కాల్స్...

VoLTE కమ్యూనికేషన్ స్టాండర్డ్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నట్లయితే హైడెఫినిషన్ వాయిస్ కాల్స్ చేసుకునే వీలుంటుంది. VoLTE అంటే వాయిస్ ఓవర్ ఎల్టీఈ అని అర్థం. ఈ కనెక్టువిటీ ఫీచర్.. 4జీ సర్వీస్ ద్వారా హై క్వాలిటీ వాయిస్, వీడియో ఇంకా మల్టీమీడియా సేవలను యూజర్లకు చేరువచేస్తుంది. VoLTE వ్యవస్థ ముఖ్యంగా కాల్ క్వాలిటీని మరింత మెరుగుపరుస్తుంది. 3జీ కంటే మూడు రెట్లు, 2జీ కంటే 6 రెట్ల వేగంతో డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

ప్రస్తుతానికి జియో మాత్రమే...

ప్రస్తుతానికి జియో మాత్రమే మార్కెట్లో 4జీ వోల్ట్ సర్వీసులను ఆఫర్ చేస్తోంది. త్వరలో ఈ జాబితాలో ఎయిర్‌టెల్ చేరబోతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel may launch VoLTE services in India today. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting