Home
News

Airtel యొక్క మొబైల్ ప్లాన్‌తో ఊహించని ప్రయోజనాలు...

భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన భారతి ఎయిర్‌టెల్ తన యొక్క వినియోగదారులను ఆకట్టుకోవడానికి పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో అత్యధిక ప్రయోజనాలను అందిస్తోంది. కానీ ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు సాధారణంగా ప్రీపెయిడ్ ప్లాన్‌ల కంటే ఖరీదైనవి మాత్రమే కాకుండా అవి నెలవారీ ప్రాతిపదికన మాత్రమే వస్తాయి. బడ్జెట్ అనేది మీకు సమస్య కానట్లయితే మరియు మీ ఇంట్లో బహుళ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఉన్నట్లయితే కనుక మీరు భారతీ ఎయిర్‌టెల్ అందించే ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ఎంచుకోవడం ఉత్తమం.

ఎయిర్‌టెల్

భారతి ఎయిర్‌టెల్ టెల్కో పోస్ట్‌పెయిడ్ విభాగంలో రూ.999 ధర వద్ద నుండి లభించే ప్లాన్ లతో తన యొక్క వినియోదారులకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తున్నది. అయితే వినియోగదారులకు ఇతరులతో పోలిస్తే అత్యధిక ప్రయోజనాలను అందించే భారతి ఎయిర్‌టెల్ యొక్క మొబైల్ ప్లాన్‌ మరియు టెల్కో అందించే అత్యంత ఖరీదైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

భారతీ ఎయిర్‌టెల్ అత్యంత ఖరీదైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

భారతీ ఎయిర్‌టెల్ అత్యంత ఖరీదైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

భారతీ ఎయిర్‌టెల్ టెల్కో తన యొక్క వినియోగదారులకు అందించే అత్యంత ఖరీదైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రూ.1599 ధర వద్ద లభిస్తుంది. ఈ ధర వద్ద లభించే ప్లాన్ యొక్క ఆఫర్‌ల విషయానికి వస్తే ఎయిర్‌టెల్ వినియోగదారులకు 250GB నెలవారీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో మూడు యాడ్-ఆన్ కనెక్షన్‌లు అందించబడుతాయి. ప్రతి యాడ్-ఆన్ కనెక్షన్‌లకు 30GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ 200GB వరకు డేటా రోల్‌ఓవర్ సౌకర్యంతో కూడా వస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా పొందుతారు.

అదనపు ప్రయోజనాల

రూ.1599 ధర వద్ద లభించే భారతీ ఎయిర్‌టెల్ యొక్క అత్యంత ఖరీదైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అందించే అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఇది నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి మరిన్ని ప్రధాన ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్‌లకు ఉచిత యాక్సిస్ ను కూడా అందిస్తుంది. అదనంగా ఎయిర్‌టెల్ థాంక్స్ వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎయిర్‌టెల్ అందించే అత్యంత ఖరీదైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఇదే. పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో వాయిస్ కాలింగ్ లేదా డేటా ప్రయోజనాల గురించి వినియోగదారులు నిజంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ అదనపు డేటాను వినియోగించడం అనేది వినియోగదారులకు చాలా ఖరీదైన వ్యవహారం.

పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌

మీరు భారతీ ఎయిర్‌టెల్ నుండి పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌ను కొనుగోలు చేస్తుంటే కనుక మీరు ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్‌లను కూడా పరిగణించవచ్చు. ఎయిర్‌టెల్ బ్లాక్‌తో భారతి ఎయిర్‌టెల్ మొబైల్, DTH మరియు బ్రాడ్‌బ్యాండ్‌తో సహా బహుళ సేవలను ఒకే ప్లాన్‌లో బండిల్ చేయబడి అందిస్తుంది. దీని కోసం వినియోగదారు ఒక్క బిల్లు మాత్రమే చెల్లించాలి. ఈ సర్వీస్ అనేది డిస్కౌంట్ ధరలలో పొందడం కోసం కాదు. వినియోగదారుల సౌలభ్యం కోసం ఒకే బిల్లుతో అన్ని రకాల సేవలను పొందడం సులభం అవుతుంది.

ఎయిర్‌టెల్ బ్లాక్ రూ.1,099 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ బ్లాక్ రూ.1,099 ప్లాన్ ప్రయోజనాలు

రూ.1,099 ధర వద్ద లభించే ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్ వినియోగదారులకు ఒకే కనెక్షన్ తో ఫైబర్+ల్యాండ్‌లైన్ మరియు DTH (డైరెక్ట్-టు-హోమ్) కనెక్షన్‌ని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఫైబర్ కనెక్షన్‌తో ఇంటర్నెట్ స్పీడ్ ని 200 Mbps వరకు పొందవచ్చు అని టెల్కో వెబ్‌సైట్‌లో పేర్కొనబడింది. అయితే ఈ ప్లాన్‌ను పొందడానికి ప్రాథమిక పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ అవసరం ఉండకపోవచ్చు కావున ఇది మంచి విషయం అనిచెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు నిబంధనలు మరియు షరతులు స్పష్టంగా పేర్కొనబడలేదు. ఈ ప్లాన్ ప్రయోజనాలలో లేనందున దానితో ఎటువంటి పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ ప్రమేయం లేనట్లు కనిపిస్తోంది.

ఎయిర్‌టెల్ బ్లాక్

ఎయిర్‌టెల్ బ్లాక్ కొత్త ప్లాన్ మొబైల్ సేవలను కాకుండా టెల్కో యొక్క ఫైబర్ మరియు DTH సేవలను వినియోగించాలనుకునే వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని విడుదల చేసినట్లు స్పష్టంగా ఉంది. ఎయిర్‌టెల్ యొక్క ఈ ప్లాన్‌లో రూ.350 విలువైన టీవీ ఛానెల్‌లు చేర్చబడ్డాయి. దానికి అదనంగా అమెజాన్ ప్రైమ్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ రెండింటికీ ఒక-సంవత్సరంపాటు ఉచిత సబ్‌స్క్రిప్షన్ ను కూడా చేర్చబడింది. ఇప్పటికే ఉన్న ప్లాన్‌కు కొత్త సర్వీస్‌ను జోడించడం వల్ల వినియోగదారులు నెలకు రూ. 300 వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ 'సేఫ్ పే' ఫీచర్

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ 'సేఫ్ పే' ఫీచర్

సేఫ్ పే ఫీచర్ అనేది కొత్త విషయం ఏమి కాదు. ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' అనేది పేమెంట్ ధృవీకరణ ప్రక్రియ యొక్క అదనపు ప్రొటెక్షన్. ఇది వినియోగదారులు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ ద్వారా జరిపే లావాదేవీలు మరింత సురక్షితమైనవిగా చేయడానికి టూ-స్టెప్ వెరిఫికేషన్ యాక్సిస్ ని అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' అనేది మీ అకౌంట్ నుండి లావాదేవీలు జరిగిన ప్రతిసారి లావాదేవీని ఆమోదించమని అడగబడుతు నిర్ధారనను పంపుతుంది. ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' OTA (ఓవర్ ది ఎయిర్) టెక్నాలజీని ఉపయోగించి వినియోగదారులకు వారి అకౌంట్ నుండి జరిగే లావాదేవీ గురించి హెచ్చరికను పంపుతుంది. ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' ఫీచర్ అందుబాటులోకి రావడంతో ఇందుకోసం ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అదనంగా ఏమైనా వసూలు చేస్తుంది అని అనుకుంటే కనుక పొరపాటు. దీనికోసం బ్యాంక్ ఏమి వసూలు చేయదని గమనించండి. కాబట్టి కస్టమర్ పేమెంట్స్ చేస్తున్నప్పుడు ఆ లావాదేవీని యాక్సిస్ చేయడానికి వినియోగదారులు వారి mPIN లేదా OTPని నమోదు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా సరైన mPIN లేదా OTPని నమోదు చేయడం వలన పేమెంట్ పూర్తిచేయబడుతుంది. కానీ ఎయిర్‌టెల్ సేఫ్ పే రాకతో mPIN లేదా OTPని నమోదు చేసిన తర్వాత కూడా వినియోగదారులు తమ ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ నుండి మాన్యువల్‌గా లావాదేవీని ఆమోదించమని అడగబడతారు.

Best Mobiles in India

English summary
Airtel Most Expensive Postpaid Mobile Plan Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X