ఈ నెలలో వాడని డేటాను తరువాతి నెలకు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం

భారతీ ఎయిర్‌టెల్ తన పోస్ట్ పెయిడ్ చందాదారుల కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సదుపాయంలో భాగంగా ఈ నెలలో మిగిలిపోయిన డేటాను తరువాతి నెలలో వినియోగించుకునే అవకాశం ఉంటుంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తరువాతి నెలకు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం...

అంటే కరెంట్ బిల్లింగ్ సైకిల్‌లో వినియోగించుకోగా మిగిలిపోయిన డేటాను తరువాతి నెలలో వచ్చే బిల్లింగ్ సైకిల్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకుని వాడుకోవచ్చు. ఒక్కో ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్ తన అకౌంట్‌‌లోకి 200జీబి వరకు డేటాను బదిలీ చేసుకోవచ్చు.

ఉదాహరణకు...

మీరు రూ.799 ప్లాన్‌లో ఉన్నారనుకుందాం, ఈ ప్లాన్ క్రింద మీకు 10జీబి డేటా లభించింది. అందులో ఆ నెలమొత్తం మీద 5జీబి డేటాను మాత్రమే మీరు వినియోగించుకున్నారు. మిగిలిన ఆ 5జీబి డేటాను తరువాతి నెలలో వచ్చే బిల్లింగ్ సైకిల్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకన్నట్లయితే మొత్తం 15జీబి డేటా మీకు లభిస్తుంది.

ఆఫర్ క్రింద వర్తించే డేటాను కూడా ఫార్వర్డ్ చేసుకోవచ్చు

Free Monsoon offer క్రింద వర్తించే 10జీబి డేటాను కూడా తరువాతి బిల్లింగ్ సైకిల్‌కు ఫార్వర్డ్ చేసుకునే వీలుంటుంది. ఆగష్టు 1 నుంచి ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఎయిర్‌టెల్ చెబుతోంది.

మొదటిగా ఐడియా సెల్యులార్

ఈ తరహా సదుపాయాన్ని మొట్టమొదటి ఐడియా సెల్యులార్ 2015లో లాంచ్ చేసింది. ఇప్పుడు ఎయిర్‌టెల్ అందుబాటులోకి తీుసుకువచ్చింది.

రూ.2000 కోట్లతో ప్రాజెక్ట్ నెక్స్ట్...

తమ యూజర్లకు మరింత యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేసే క్రమంలో రూ.2000 కోట్ల వ్యయంతో  ప్రాజెక్ట్ నెక్స్ట్‌ను ఎయిర్‌టెల్ ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ క్రింద కొత్త యాప్‌లతో పాటు అధునాత సదుపాయాలను ఎయిర్‌టెల్ అందుబాటులోకి తీసుకురాబోతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel new offer will allow using unused data to its postpaid users. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting