Home
News

ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్‌ల ధరలు ఎలా ఉన్నాయో చూడండి

ఎయిర్టెల్ టెల్కో సంస్థ ఇప్పుడు దాని కొత్త ప్లాన్‌ల ధరలను ప్రకటించింది. వోడాఫోన్ ఐడియా మొదటిగా తన కొత్త ధరలను విడుదల చేసింది. ఇప్పుడు భారతి ఎయిర్‌టెల్ కూడా అదే పంథాను అనుసరించి తను అప్‌డేట్ చేసిన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రకటించింది. ఈకొత్త ప్లాన్‌లు ఈ రోజు అంటే డిసెంబర్ 3 నుంచి అమలులోకి రానున్నాయి.

ఎయిర్‌టెల్

భారతి ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ సంస్థల మాదిరిగానే జియో కూడా తన ధరల పెంపును ప్రకటించినప్పటికీ అది దాని కొత్త ధరల వివరాలను ఇంకా వివరించలేదు. భారతి ఎయిర్‌టెల్ యొక్క కొత్త ధరలు రూ.19 నుండి మొదలై రూ.2,398 వరకు ఉంటాయి. ఇవి అన్ని కూడా అపరిమిత వాయిస్ కాలింగ్ మద్దతుతో పాటు బండిల్ చేసిన SMS మెసేజ్లు మరియు డేటా వంటి ప్రయోజనాలను అందిస్తాయి.

 

అప్‌డేట్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

భారతి ఎయిర్‌టెల్ యొక్క కొత్త అప్‌డేట్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు రోజుకు 50 పైసల నుండి రూ.2.85ల వరకు పెరుగుదలను పొందాయి అని ఎయిర్‌టెల్ ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది. అప్‌డేట్ చేయబడిన ప్రీపెయిడ్ ప్లాన్‌లు చందాదారులకు అవి అందించే ప్రయోజనాల విషయంలో ఎటువంటి మార్పులను తీసుకురాలేదు. అంటే దీని అర్థం ఎయిర్టెల్ థాంక్స్ మరియు వింక్ మ్యూజిక్ వంటి వాటికి కూడా యాక్సెస్ లభిస్తున్నది.

 

భారతి ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు

భారతి ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు

వోడాఫోన్ సంస్థ మాదిరిగానే ఎయిర్‌టెల్ కూడా కొన్ని ప్రసిద్ధ అపరిమిత ప్రీపెయిడ్ ప్లాన్‌లను అప్‌డేట్ చేసింది. వాటిలో రూ.129, రూ. 169, రూ.249, మరియు రూ.448 ప్లాన్‌లు ఉన్నాయి. వార్షిక మరియు సెమీ వార్షిక చెల్లుబాటుతో రూ. 998 మరియు రూ. 1,699ల దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి అన్ని కూడా అపరిమిత వాయిస్ కాల్స్, డేటా బెనిఫిట్స్ మరియు SMS మెసేజ్లు వంటి ప్రయోజనాలను వాటి ప్లాన్‌లకు తగ్గ చెల్లుబాటు కాలంతో అందిస్తున్నాయి. వోడాఫోన్ యొక్క కొత్త ప్లాన్‌ల వివరాలు తెలుసుకోవడానికి కింద వున్న లింకును చదవండి.

 

పోర్ట్‌ఫోలియో

ఎయిర్‌టెల్ కొత్తగా ప్రవేశపెట్టిన పోర్ట్‌ఫోలియోలో పరిమిత డేటా ప్రయోజనాలతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని తక్కువ ధర వద్ద రూ.19ల ప్రీపెయిడ్ ప్లాన్ ఉంది. ఎయిర్టెల్ యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రెండు రోజుల చెల్లుబాటు కాలంతో అపరిమిత వాయిస్ కాలింగ్, 150MB డేటా మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్ లను అందిస్తుంది. ఇదే ప్లాన్ ఇప్పటివరకు 200MB డేటాను అందించేది. అదేవిధంగా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 300 ఎస్ఎంఎస్ లు మరియు 2 జిబి డేటాను 28 రోజుల చెల్లుబాటుతో వస్తున్న రూ.129 ప్రీపెయిడ్ ప్లాన్ ఉంది. అలాగే రూ.148. రూ.249 మరియు రూ.298 ప్రీపెయిడ్ ప్లాన్‌ల వివరాలు తెలుసుకోవడానికి కింద ఉన్న పట్టికను చూడండి.

 

ప్రయోజనాలు
పాత ప్లాన్ ధర  వాలిడిటీ ప్రయోజనాలు  కొత్త ప్లాన్ ధర   వాలిడిటీ  ప్రయోజనాలు 
 19  2 అపరిమిత కాలింగ్, 200MB డేటా   19 2 అపరిమిత కాలింగ్, 100 ఎస్ఎంఎస్, 150 MB డేటా 
35 28 రూ. 26.66 టాక్‌టైమ్, 100 ఎంబి డేటా    49 28 రూ. 38.52 టాక్‌టైమ్, 100 ఎంబి డేటా 
 65 28 రూ. 130 టాక్‌టైమ్, 200 ఎంబి డేటా   79 28 రూ. 63.95 టాక్‌టైమ్, 200 ఎంబి డేటా 
 129 28  అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్ సందేశాలు, 2 జిబి డేటా 148 28  అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్ సందేశాలు, 2 జిబి డేటా
169 Or 199 28 అపరిమిత కాలింగ్, 100 ఎస్ఎంఎస్ /1 రోజు, 1 జిబి డేటా / రోజు  248  28 అపరిమిత కాలింగ్, 100 ఎస్ఎంఎస్ సందేశాలు / రోజు, 1.5 జిబి డేటా / రోజు 
249 28  అపరిమిత కాలింగ్, 100 ఎస్ఎంఎస్ సందేశాలు / రోజు, 2 జిబి డేటా / రోజు  298  28  అపరిమిత కాలింగ్, 100 ఎస్ఎంఎస్ సందేశాలు / రోజు, 2 జిబి డేటా / రోజు
448 82 అపరిమిత కాలింగ్, 100 ఎస్ఎంఎస్ సందేశాలు / రోజు, 1.5 జిబి డేటా / రోజు  598 84 అపరిమిత కాలింగ్, 100 ఎస్ఎంఎస్ సందేశాలు / రోజు, 1.5 జిబి డేటా / రోజు 
499 82 అపరిమిత కాలింగ్, 100 ఎస్ఎంఎస్ సందేశాలు / రోజు, 2 జిబి డేటా / రోజు  698 84 అపరిమిత కాలింగ్, 100 ఎస్ఎంఎస్ సందేశాలు / రోజు, 2 జిబి డేటా / రోజు 
998 336  అపరిమిత కాలింగ్, 3600 ఎస్ఎంఎస్, 12 జిబి డేటా 1498 365  అపరిమిత కాలింగ్, 3600 ఎస్ఎంఎస్, 24 జిబి డేటా
1699 365  అపరిమిత కాలింగ్, 100 SMS/Day,1.5GB డేటా/ Day 2398 365 అపరిమిత కాలింగ్, 100 SMS/Day,1.5GB డేటా/ Day 

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel New Plans vs Old plans: Price, Talktime, Validity and Other Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X