Netflix ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్‌టెల్ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు!! వాటి పూర్తి వివరాలు
ఇండియాలో టెలికాం సర్వీసులతో పాటుగా DTH మరియు బ్రాడ్‌బ్యాండ్ రంగంలో కూడా ఎయిర్‌టెల్ తన యొక్క సేవలను అందిస్తున్నది. ఎయిర్‌టెల్ తన యొక్క వినియోగదారులకు అత్యంతమైన ఇంటర్నెట్ సర్వీస్లతో వివిధ రకాల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఎయిర్‌టెల్ అందించే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు వినియోగదారులకు ఎంటర్టైన్మెంట్ ప్రయోజనాలతో పాటుగా వృత్తిపరమైన ప్రయోజనాలను కూడా కలుపుకొని అందిస్తాయి.

దేశంలోని ఇతర ISPల మాదిరిగానే ఎయిర్‌టెల్ కూడా తమ ప్లాన్‌లతో వివిధ రకాల OTT సబ్‌స్క్రిప్షన్‌లను ఉచితంగా అందిస్తోంది. ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఇప్పుడు తన యొక్క అభివృద్ధిలో భాగంగా యూజర్లను ఆకట్టుకోవడానికి తన యొక్క ప్లాట్‌ఫారమ్‌లోని రెండు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో నెట్‌ఫ్లిక్స్ యొక్క సబ్‌స్క్రిప్షన్‌ను బండిల్ చేయబడి అందిస్తున్నది. ఈ ప్లాన్ల యొక్క వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ యొక్క 'ప్రొఫెషనల్' ప్యాక్
ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ తన ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కనెక్షన్‌తో 300 Mbps వేగంతో 'ప్రొఫెషనల్' ప్లాన్‌ను అందిస్తున్నది. దీనిని వినియోగదారులు నెలకు రూ.1,498 ధర వద్ద పొందవచ్చు. ఇది 300 Mbps వేగంతో అపరిమిత ఇంటర్నెట్ డేటాను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ అపరిమిత ప్లాన్ లో FUP డేటా 3500GB లేదా 3.5TB కి పరిమితం చేయబడి ఉంటుంది అని గమనించండి. ఈ ప్లాన్ యొక్క OTT ప్రయోజనాలలో నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, వింక్ మ్యూజిక్ మరియు షా అకాడమీ యొక్క ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లు ఉన్నాయి. ఇది తన యొక్క బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో ‘ఎయిర్‌టెల్ థాంక్స్ బెనిఫిట్స్' ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఎయిర్‌టెల్ ఇన్ఫినిటీ ప్లాన్
ఎయిర్‌టెల్ సంస్థ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో 1Gbps వేగంతో 'ఇన్ఫినిటీ ప్లాన్' పేరుతో మరొక అపరిమిత డేటా ప్లాన్‌ను అందిస్తుంది. 'ఇన్ఫినిటీ' ప్లాన్‌ను యాక్సెస్ చేయడానికి వినియోగదారులు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కనెక్షన్‌ని కలిగి ఉండాలి. ఈ ప్లాన్ నెలకు రూ.3,999 ధరతో 1Gbps హై-స్పీడ్ తో అపరిమిత డేటాను అందిస్తుంది. అన్ని అపరిమిత ప్లాన్‌ల వలె ఇది కూడా 3500GB లేదా 3.5TB FUP డేటాకు పరిమితం చేయబడి ఉంది. ఈ ప్లాన్ తో యూజర్లు అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి కొన్ని ప్రధాన OTT ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్‌లకు ఉచితంగా అందిస్తుంది. వీటితో పాటుగా కంపెనీ ఇప్పుడు కొత్తగా ఈ ప్లాన్ కు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ని కూడా జోడించబడింది.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కనెక్షన్‌లోని ప్రొఫెషనల్ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ యాక్సెస్ ఉంటుంది. అయితే ఇన్ఫినిటీ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం యాక్సెస్ ఉంటుంది. మీరు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను విడిగా కొనుగోలు చేయాలని అనుకుంటే కనుక స్టాండర్డ్ ప్లాన్ ను రూ.199 ధర వద్ద పొందవచ్చు. ఇది ఒక పరికరంలో 480p రిజల్యూషన్‌లో వీడియో స్ట్రీమింగ్‌ను అనుమతిస్తుంది. అలాగే ప్రీమియం ప్లాన్ గరిష్టంగా నాలుగు పరికరాల్లో స్ట్రీమింగ్‌ను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్ ప్రయోజనాలు
రూ.1,099 ధర వద్ద లభించే ఎయిర్‌టెల్ బ్లాక్ కొత్త ప్లాన్ వినియోగదారులకు ఒకే కనెక్షన్ తో ఫైబర్+ల్యాండ్‌లైన్ మరియు DTH (డైరెక్ట్-టు-హోమ్) కనెక్షన్‌ని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఫైబర్ కనెక్షన్‌తో ఇంటర్నెట్ స్పీడ్ ని 200 Mbps వరకు పొందవచ్చు అని టెల్కో వెబ్‌సైట్‌లో పేర్కొనబడింది. అయితే ఈ ప్లాన్‌ను పొందడానికి ప్రాథమిక పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ అవసరం ఉండకపోవచ్చు కావున ఇది మంచి విషయం అనిచెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు నిబంధనలు మరియు షరతులు స్పష్టంగా పేర్కొనబడలేదు. ఈ ప్లాన్ ప్రయోజనాలలో లేనందున దానితో ఎటువంటి పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ ప్రమేయం లేనట్లు కనిపిస్తోంది. ఎయిర్‌టెల్ బ్లాక్ కొత్త ప్లాన్ మొబైల్ సేవలను కాకుండా టెల్కో యొక్క ఫైబర్ మరియు DTH సేవలను వినియోగించాలనుకునే వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని విడుదల చేసినట్లు స్పష్టంగా ఉంది. ఎయిర్‌టెల్ యొక్క ఈ ప్లాన్‌లో రూ.350 విలువైన టీవీ ఛానెల్‌లు చేర్చబడ్డాయి. దానికి అదనంగా అమెజాన్ ప్రైమ్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ రెండింటికీ ఒక-సంవత్సరంపాటు ఉచిత సబ్‌స్క్రిప్షన్ ను కూడా చేర్చబడింది. ఇప్పటికే ఉన్న ప్లాన్‌కు కొత్త సర్వీస్‌ను జోడించడం వల్ల వినియోగదారులు నెలకు రూ. 300 వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








