ఎయిర్‌టెల్ సంచలనం రూ. 49కే 3జిబి డేటా

Written By:

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం Airtel తన ప్రీపెయిడ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.49కే 3జీబీ డేటాను ఉచితంగా అందిస్తున్నది. ఈ ఆఫర్లో భాగంగా రూ.49తో రీచార్జి చేసుకుంటే వినియోగదారులకు 3జీబీ 4జీ డేటా లభిస్తుంది. కాగా ఈ ప్లాన్ వాలిడిటీ కేవలం ఒక్క రోజు మాత్రమే. అయితే ఈ ప్లాన్ కేవలం ఎంపిక చేసిన సర్కిల్స్‌లో ఉన్న కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. దీన్ని ఎలా తెలుసుకోవాలంటే.. ఎయిర్‌టెల్ యాప్ ఓపెన్ చేసి అందులో ప్లాన్ల వివరాలను చూసుకోవాలి. వాటిల్లో రూ.49కి 3జీబీ డేటా అని ఉంటుంది. ప్లాన్ అందుబాటులో లేకపోతే రూ.49కు కేవలం 1జీబీ డేటా మాత్రమే వస్తుంది. ఇక మరో వైపు జియోలో రూ.49కు 1జీబీ డేటా మాత్రమే లభిస్తుండగా, ఇందులో అన్‌లిమిటెల్ కాల్స్, 50 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు కూడా వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. దీంతో పాటు ఈ మధ్య ప్రవేశపెట్టిన ప్లాన్లపై ఓ లుక్కేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

4జీ స్మార్ట్‌ఫోన్‌లోకి అప్‌గ్రేడ్‌ అయ్యే కస్టమర్లకు

టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ 4జీ స్మార్ట్‌ఫోన్‌లోకి అప్‌గ్రేడ్‌ అయ్యే తన ప్రస్తుత 2జీ, 3జీ కస్టమర్లకు ఉచితంగా 30జీబీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు ప్రకటించింది. ఇది ‘మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్‌' కార్యక్రమంలో మరో ఆఫర్‌గా కంపెనీ పేర్కొంది.

ప్రీపెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ కస్టమర్లందరికీ

ఈ ఆఫర్‌ తన ప్రీపెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ కస్టమర్లందరికీ వర్తించనుంది. కంపెనీ ఛార్జ్‌ చేసే ప్యాక్‌ల పైన రోజూ ఉచితంగా 1జీబీ డేటాను 30 రోజుల పాటు ప్రీపెయిడ్‌ కస్టమర్లు పొందనున్నట్టు కంపెనీ తెలిపింది. అదే పోస్టు పెయిడ్‌ కస్టమర్లైతే రోల్‌ఓవర్‌ సౌకర్యం కింద తొలి బిల్‌ సైకిల్‌లో ఉచితంగా 30జీబీ డేటాను పొందనున్నారు.

51111 టోల్‌ఫ్రీ నెంబర్‌కు..

అయితే ఈ ఉచిత డేటా ప్రయోజనాలను క్లయిమ్‌ చేసుకోవడానికి, అర్హతను చెక్‌ చేసుకోవడానికి 51111 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేయాలని లేదా మై ఎయిర్‌టెల్‌ మొబైల్‌ యాప్‌లో చూసుకోవాలని పేర్కొంది. 24 గంటల్లో 30జీబీ ఉచిత డేటాను కస్టమర్లకు క్లయిమ్‌ చేస్తామని ఎయిర్‌టెల్‌ తెలిపింది.

airtel.in/4gupgrade వెబ్‌సైట్‌ను

మరింత సమాచారం కోసం ఎయిర్‌టెల్‌ కస్టమర్లు airtel.in/4gupgrade వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని చెప్పింది. ‘మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్‌' కార్యక్రమం కింద ఇప్పటికే ఎయిర్‌టెల్‌, పలు మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ తయారీదారులతో భాగస్వామ్యం ఏర్పరుచుకుని, అత్యంత తక్కువ ధరల్లో 4జీ స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెడుతోంది.

రూ.249రీఛార్జ్‌ ద్వారా

 రూ.249రీఛార్జ్‌ ద్వారా వినియోగదారులు రోజుకు 2 జీబీ (3జీ/4జీ) డేటా అందిస్తుంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 28రోజులు. అంటే మొత్తంగా 56జీబీ డేటా పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ (లోకల్‌,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.

రూ.349 ప్యాక్‌ను

దీంతోపాటు రూ.349 ప్యాక్‌ను కూడా ఎయిర్‌టెల్‌ పునరుద్ధరించింది. ఇప్పటి వరకూ అందిస్తున్న 2.5జీబీ డేటా స్థానంలో తాజాగా 28రోజుల పాటు రోజుకు 3జీబీ డేటాను అందించనుంది. కాగా రూ.499 రీఛార్జ్‌తో నిన్న (మంగళవారం) కొత్త ప్రీపెయిడ్‌ను ప్రకటించింది. ఇందులో ఉచిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌తో పాటు, రోజుకు 2జీబీ డేటాను 82 రోజుల పాటు అందిస్తున్న సంగతి తెలిసిందే.

మరో ప్లాన్ లో రూ. 499లో ..

తాజాగా లాంచ్‌ చేసిన మరో ప్లాన్ లో రూ. 499లో రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటా అందిస్తుంది. యూజర్లు అన్‌ లిమిటెడ్‌, లోకల్‌, రోమిండ్‌ కాల్స్‌ ఉచితంగా పొందవచ్చు. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. ఈ ప్లాన్ 82 రోజులు చెల్లుతుంది. దీని అర్థం, ఎయిర్‌టెల్‌ మొత్తం 164జీబీ డేటాను అందిస్తుందన్నమాట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే
 

English summary
Airtel's New Rs. 49 Prepaid Recharge Plan Offers 3GB Data. Details Here More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot