IPL 2025 కోసం జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్‌లు.. పూర్తి వివరాలు..!
ఐపీఎల్ 2025 కోసం (IPL 2025) టెలికాం సంస్థలు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. గతంలోనే ప్లాన్‌లు అందుబాటులో ఉండగా.. నిన్న కొన్ని ప్లాన్‌లను ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలు తీసుకొచ్చాయి. జియో కూడా లాంచ్ చేసింది. ఇప్పటికే రూ.299 అంత కంటే ఎక్కువ రీఛార్జ్‌లపై జియోహాట్‌స్టార్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.
నిన్న ఎయిర్‌టెల్ (Airtel Jiohotstar OTT Plans) రూ.100 మరియు రూ.195 ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా మరో రీఛార్జ్ ప్లాన్ కూడా అందుబాటులోకి వచ్చింది. రూ.301 రీఛార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. వీటి ద్వారా జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఫలితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా IPL తోపాటు సినిమాలు, షోలు సహా ఇతర డాక్యుమెంటరీలను చూడవచ్చు.

ఎయిర్‌టెల్ రూ.301 రీఛార్జ్ ప్లాన్ తో (Airtel Rs301 Recharge Plan) అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. మరియు ఈ ప్లాన్‌లో భాగంగా ప్రతిరోజు 1GB డేటాతోపాటు 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ప్లాన్‌లో మొత్తంగా 28GB డేటాను పొందవచ్చు.
ఈ ప్లాన్‌లో భాగంగా జియోహాట్‌స్టార్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 90 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. దీంతోపాటు హాలోట్యూన్స్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు అపోలో 24/7 సర్కిల్ ప్రయోజనాలను పొందవచ్చు.
ఎయిర్‌టెల్ రూ.100 రీఛార్జ్ ప్లాన్ లో భాగంగా 5GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియోహాట్‌స్టార్ మొబైల్ / టీవీ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 30 రోజులుపాటు వీటిని ఉపయోగించుకోవచ్చు. ఐపీఎల్ 2025 లైవ్ మ్యాచ్‌లతోపాటు సినిమాలు, డాక్యుమెంటరీలు సహా ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌ను వీక్షించవచ్చు.
ఈ ప్లాన్‌లో (Airtel Rs100 Recharge Plan) ఎటువంటి కాలింగ్, SMS ప్రయోజనాలను పొందలేదు. ఈ ప్లాన్ కేవలం యాడ్ ఆన్ డేటా ప్లాన్ మాత్రమే, అంటే ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకొనేందుకు కచ్చితంగా యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్‌ను కలిగి ఉండాలని ఎయిర్‌టెల్ తెలిపింది.
ఎయిర్‌టెల్ రూ.195 రీఛార్జ్ ప్లాన్ లో (Airtel Rs195 Recharge Plan) భాగంగా 15GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. డేటా, ఓటీటీల వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంటుంది. ఈ ప్లాన్ కూడా యాడ్ ఆన్ డేటా గానే అందుబాటులోకి వచ్చింది. అంటే కచ్చితంగా యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్ ఉంటేనే ఈ ఉపయోగించుకొనేందుకు అవకాశం ఉంది.
ఎయిర్‌టెల్ రూ.549 రీఛార్జ్ ప్లాన్ లో (Airtel Rs549 Recharge Plan) భాగంగా రోజువారీ 3GB డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్‌లో భాగంగా 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మరియు ఎయిర్‌టెల్ Xstream ప్రీమియం, Zee5 సబ్‌స్క్రిప్షన్‌ను కూడా వినియోగించుకోవచ్చు. వీటితోపాటు అపోలో 24/7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్, హాలోట్యూన్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
ఎయిర్‌టెల్ రూ.1029 రీఛార్జ్ ప్లాన్ తోనూ (Airtel Rs1029 Recharge Plan) జియోహాట్‌స్టార్ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయం సహా ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు రోజువారీ 2GB 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్‌లో భాగంగా 90 రోజుల వరకు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఎయిర్‌టెల్ Xstream, హాలోట్యూన్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. మరియు మూడు నెలల వరకు అపోలో 24/7 సర్కిల్ ప్రయోజనాలను కూడా పొందవచ్చు.


Click it and Unblock the Notifications








