ఎయిర్‌టెల్‌ 1200జీబీ హై స్పీడ్ డేటా ప్లాన్, అపరిమిత కాల్స్ !

Written By:

దేశీయ టెలికాం రంగంలో రోజురోజుకు విప్లవాత్మక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రిలయన్స్ జియోతో దిగ్గజ టెల్కోలన్నీ వార్ కి సై అంటున్నాయి. డేటా టారిఫ్ వార్ కొనసాగుతుండగానే ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్‌ వార్ మొదలైంది. రిలయన్స్ జియో బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్లోకి రాకుండానే ఎయిర్‌టెల్‌ యూజర్లను ఆకట్టుకోవడానికి స్పెషల్ ఆఫర్లను ప్రకటిస్తూ పోతోంది. ఈ నేపథ్యంలోనే సరికొత్త ప్లాన్ ఆవిష్కరించింది. బ్రాడ్‌బ్యాండ్‌ కంపెనీల సవాల్ చేస్తూ ఎయిర్‌టెల్‌ తన తొలి 300ఎంబీపీఎస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను ఆవిష్కరించింది. నెలవారీ రెంటల్‌ రూ.2199తో ఈ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను ఎయిర్‌టెల్‌ మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ఎయిర్‌టెల్‌ 1200జీబీ హై స్పీడ్ డేటా ప్లాన్, అపరిమిత కాల్స్ !

కాగా ఫైబర్‌-టూ-ది-హోమ్‌(ఎఫ్‌టీటీహెచ్‌) సర్వీసు సబ్‌స్క్రైబర్లను టార్గెట్‌గా చేసుకుని ఈ ప్లాన్‌ను ఎయిర్‌టెల్‌ స్పెషల్‌గా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ కొత్త ప్లాన్‌ కింద 1200జీబీ ఆల్ట్రా హై స్పీడు డేటాను అపరిమిత ఎస్టీడీ, లోకల్‌ కాలింగ్‌ ప్రయోజనాలను అందించనున్నట్టు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ఈ కొత్త 300ఎంబీపీఎస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను ఎంచుకునే ఎయిర్‌టెల్‌ సబ్‌స్క్రైబర్లకు, ఎయిర్‌టెల్‌ వింక్‌ మ్యూజిక్‌, ఎయిర్‌టెల్‌ టీవీ వంటి ఓటీటీ యాప్స్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ లభించనుంది. అంతేకాకుండా అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను యూజర్లు పొందనున్నారు.

ఫేస్‌బుక్ మాయలో పిట్టల్లా రాలుతున్న ప్రాణాలెన్నో, జాగ్రత్తగా లేకుంటే అంతే !

ఈ ప్లాన్‌ డేటా రోల్‌అవుట్‌ ప్రయోజనాలను, ఎయిర్‌టెల్‌ సర్‌ప్రైజ్‌, మైహోమ్‌ రివార్డులను అందించనుంది. అంతేకాకుండా 1టీబీ బోనస్‌ డేటా కూడా అక్టోబర్‌ 31 వరకు యూజర్లకు అందుబాటులో ఉండనుంది. ఇది కేవలం ఈ ప్లాన్‌ను ఆన్‌లైన్‌ కొనుగోలు చేసే కస్టమర్లకు మాత్రమే. అయితే ఎంపిక చేసిన సర్కిళ్లకు మాత్రమే ఈ ప్లాన్‌ను అందుబాటులో ఉంచుతున్నామని ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఎయిర్‌టెల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సైట్‌ను విజిట్‌ చేసి, సబ్‌స్క్రైబర్లు తమ సర్కిళ్లు ఉన్నాయో లేదో చెక్‌ చేసుకోవాలని సూచించింది. హై స్పీడు డేటా ఆశించే వారికి ఈ కొత్త ఎఫ్‌టీటీహెచ్‌ ఆధారిత ప్లాన్లను ప్రవేశపెట్టడం చాలా ఆనందదాయకంగా ఉందని భారతీ ఎయిర్‌టెల్‌ సీఈవో జార్జ్‌ మతేన్ అన్నారు. వచ్చే రోజుల్లో ఎఫ్‌టీటీహెచ్‌ ఆఫర్స్‌ను మరింత పెంచి యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు.

English summary
Airtel Now Offers 300Mbps Broadband Plan at Rs. 2,199 Per Month More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot