రెండు గంటల్లో పోస్ట్‌పెయిడ్ కనెక్షన్

భారతదేశపు అతిపెద్ద టెలికం నెట్‌వర్క్ ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ సరికొత్త సర్వీసును అనౌన్స్ చేసింది. ఈ సర్వీసులో భాగంగా కొత్త కస్టమర్‌లు కేవలం 2 గంటల వ్యవధిలోనే ఎయిర్‌టెల్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్‌ను పొందే వీలుంటుంది.

Read More : 10 లక్షల Redmi Note 4 ఫోన్‌లు అమ్మేసాం..!

రెండు గంటల్లో పోస్ట్‌పెయిడ్ కనెక్షన్

'Impatient? Get your SIM in two hours' అంటూ తమ కొత్త సర్వీసుకు సంబంధించిన వివరాలను ఎయిర్‌టెల్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. కొత్త పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ తీసుకునే యూజర్లు రూ.199 నుంచి రూ.1599 వరకు అందుబాటులో ఉండే సింగిల్ లేదా ఫ్యామిలీ ప్లాన్ ను సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది.

Read More : ఆండ్రాయిడ్ పై గూగుల్ పట్టు కోల్పోతుందా..?

రెండు గంటల్లో పోస్ట్‌పెయిడ్ కనెక్షన్

పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ నిమిత్తం ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ ద్వారా మీరు పంపిన రిక్వెస్ట్ ఆధారంగా ఎయిర్‌టెల్ కస్టమర్ ఎగ్జిక్యూటివ్ రెండు గంటల్లోపు మీరున్న అడ్రస్ కు చేరుకుని కొత్త కనెక్షన్ ను మంజూరు చేస్తారు. ప్రస్తుతానికి ఈ సదుపాయం ఢిల్లీ NCR, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది.

Read More : రిలయన్స్ జియో, గూగుల్ కాంభినేషన్‌లో స్మార్ట్‌ఫోన్

English summary
Airtel Now Offers New Postpaid Connection Within Two Hours at Your Door Step. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot