హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ Nxtra డేటా సెంటర్.. వచ్చే రెండు సంవత్సరాల్లో ప్రారంభం..!
ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ హైదరాబాద్‌లో డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. ఎయిర్‌టెల్‌కు చెందిన డేటా సెంటర్ విభాగం నెక్స్‌ట్రా కోసం (Airtel Nxtra) 40 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. రానున్న రెండు సంవత్సరాల్లో కంపెనీ ప్రణాళికలకు అనుగుణంగా ఈ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎయిర్‌టెల్ నెక్స్‌ట్రా డేటా సెంటర్ 200 మెగావాట్ల సామర్థ్యంతో (Airtel Nxtra Data Center) ఏర్పాటు కానుంది. వచ్చే రెండు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా డేటా సెంటర్‌ల సామర్థ్యాన్ని 400 మెగావాట్లకు పెంచాలనే ప్రణాళికల్లో భాగంగా ఏర్పాటుకానున్న హైదరాబాద్ డేటా సెంటర్ కీలకం కానుంది.

హైదరాబాద్ డేటా సెంటర్ పై నెక్స్‌ట్రా సీఈవో ఆసిస్ ఆరోరా కీలక ప్రకటన చేశారు. వచ్చే రెండు సంవత్సరాల్లోనే డేటా సెంటర్ అందుబాటులోకి రానుందని తెలిపారు. మొత్తంగా 5 సంవత్సరాల్లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. ప్రస్తుతం సంస్థకు 12 భారీ డేటా సెంటర్‌లు ఉన్నట్లు తెలిపారు.
మెరుగైన పనితీరు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించిన డేటా సెంటర్‌గా దేశంలోనే తొలిస్థానంలో నెక్స్‌ట్రా నిలిచినట్లు చెప్పారు. నెక్స్‌ట్రా తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ తొలుత చెన్నై డేటా సెంటర్‌లో వినియోగించినట్లు తెలుస్తోంది. క్రమంగా అన్ని కోర్ డేటా సెంటర్‌లకు విస్తరిస్తామని ఆసిస్ ఆరోరా తెలిపారు.
AI ద్వారా ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, ఆపరేషనల్ ఎఫిషియన్సీ, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఆప్టిమైజేషన్ వంటి సామర్థ్యాలు మెరుగుపరచడం లక్ష్యంగా తెలుస్తోంది. ఈ టెక్నాలజీ ద్వారా తన ఉత్పాదకతలో 25 శాతం మెరుగవుతుందని అంచనా వేస్తోంది. తమ డేటా సెంటర్‌లో AI వినియోగం కీలక దశగా ఆరోరా తెలిపారు.
రానున్న మూడేళ్లలో రూ.5000 కోట్ల పెట్టుబడితో Nxtra తన సామర్థ్యాన్ని 400 మెగావాట్ల రెట్టింపు చేస్తుందని ఆరోరా తెలిపారు. కొత్త టెక్నాలజీ వినియోగంతో ఖర్చులను తగ్గించడం సహా సేవలను మెరుగుపరచడం మరియు కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడం నెక్స్‌ట్రా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
* టెలికాం రంగంలో ఎయిర్‌టెల్ ప్రస్తుతం అతిపెద్ద నెట్‌వర్క్‌గా ఉంది. దేశంలో ఎక్కువ యూజర్‌లు కలిగిన రెండో నెట్‌వర్క్‌గా ఉంది. ఎయిర్‌టెల్ ఇటీవలే స్పామ్ కాల్స్, మెసేజ్‌లకు చెక్ పెట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ తరహా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి టెలికాం నెట్‌వర్క్‌గా ఎయిర్‌టెల్ నిలిచింది.
ఎయిర్‌టెల్ యూజర్‌లకు ఉచితంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్పామ్ డిటెక్షన్ సిస్టమ్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉంది. స్పామ్ కాల్స్, SMS లపై వినియోగదారులను హెచ్చరిస్తుంది. ఎయిర్‌టెల్ స్పామ్ డిటెక్షన్ సొల్యుషన్ డ్యూయల్ లేయర్ రక్షణ ను కలిగి ఉంటుంది.
ఈ స్పామ్ డిటెక్షన్ సిస్టమ్ రెండు స్థాయిల్లో ఫిల్టర్‌లను కలిగి ఉంటుంది. నెట్‌వర్క్, ఐటీ సిస్టమ్ స్థాయిల్లో ఉంటుంది. ప్రతి SMS మరియు కాల్ డ్యూయల్ లేయర్ AI షీల్డ్‌ను దాటి వెళ్లాల్సి ఉంటుంది.. దీంతోపాటు ఈ వ్యవస్థ SMSల ద్వారా వచ్చే URL లపైనా అప్రమత్తం చేస్తుందని తెలిపింది.
image source : Nxtra


Click it and Unblock the Notifications








