Home
News

జియోని టార్గెట్ చేసిన Airtel, కౌంటర్‌కి రీకౌంటర్ !

జియో టెలికం మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి అన్ని టెల్కోలు దానితో ఢీ అంటే ఢీ అంటున్నాయి.

By Hazarath

జియో టెలికం మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి అన్ని టెల్కోలు దానితో ఢీ అంటే ఢీ అంటున్నాయి. జియో పెట్టిన ప్రతి ఆఫర్‌కి కౌంటర్‌గా కొత్త ఆఫర్లను తీసుకొస్తున్నాయి. ఇక దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నAirtel అయితే జియో తెచ్చిన ప్రతీ ఆఫర్ కి సరికొత్త ఆఫర్ ని తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు 100 శాతం క్యాష్‌బ్యాక్‌తో వస్తోంది.

రూ.399 ప్లాన్‌పై ప్రకటించిన 100 శాతం క్యాష్‌బ్యాక్‌..

రూ.399 ప్లాన్‌పై ప్రకటించిన 100 శాతం క్యాష్‌బ్యాక్‌..

జియో ఫెస్టివల్‌ సీజన్‌లో రూ.399 ప్లాన్‌పై ప్రకటించిన 100 శాతం క్యాష్‌బ్యాక్‌ మాదిరిగానే మరో టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ కూడా సరికొత్త ఆఫర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

పరిమిత కాల వ్యవధిలోనే..

పరిమిత కాల వ్యవధిలోనే..

తన ప్రీపెయిడ్‌ యూజర్లకు ఎయిర్‌టెల్‌ రూ.349 ప్లాన్‌పై 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు తెలిపింది. ఇది కూడా పరిమిత కాల వ్యవధిలోనే ఆఫర్‌ చేస్తోంది.

ఎప్పుడైనా ఇది ముగియవచ్చని..

ఎప్పుడైనా ఇది ముగియవచ్చని..

ఇది కేవలం పరిమిత కాల ఆఫర్‌ అని, ఎప్పుడైనా ఇది ముగియవచ్చని కంపెనీ పేర్కొంది. కానీ ఈ ఆఫర్‌ తుది గడువు ఎప్పుడనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

వాయిదాల పద్ధతిలో ఈ క్యాష్‌బ్యాక్‌ మొత్తాన్ని ..

వాయిదాల పద్ధతిలో ఈ క్యాష్‌బ్యాక్‌ మొత్తాన్ని ..

కంపెనీ డైరెక్ట్‌గా కాక, వాయిదాల పద్ధతిలో ఈ క్యాష్‌బ్యాక్‌ మొత్తాన్ని అందిస్తోంది. ఎయిర్‌టెల్‌ కస్టమర్లు తొలుత రూ.349తో రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. తరువాత 7 వాయిదాల్లో ఈ మొత్తాన్ని కంపెనీ రీఫండ్‌ చేస్తోంది.

మై ఎయిర్‌టెల్‌ యాప్‌ ద్వారా రీఛార్జ్‌..

మై ఎయిర్‌టెల్‌ యాప్‌ ద్వారా రీఛార్జ్‌..

ఈ ఆఫర్‌ అందుబాటులో ఉన్నవారు ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు, మై ఎయిర్‌టెల్‌ యాప్‌ ద్వారా రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది.

28జీబీ డేటాను 28 రోజుల పాటు..

28జీబీ డేటాను 28 రోజుల పాటు..

రూ.349 ప్లాన్‌ కింద ఎయిర్‌టెల్‌ 28జీబీ డేటాను 28 రోజుల పాటు అందిస్తోంది. అంతేకాక ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్‌ కాల్స్‌ను చేసుకోవచ్చు. రోజుకు 1జీబీ డేటాను వాడుకోవచ్చు.

 

Best Mobiles in India

English summary
Airtel offering 100 per cent cashback on Rs 349 recharge. Conditions apply Read more at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X