ఎయిర్‌టెల్ మరో కానుక, ఏడాది పాటు Amazon Prime Membership ఉచితం

Written By:

టెలికాం రంగంలో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్‌ మరో దిగ్గజం జియోని ఢీకొట్టేందుకు అన్ని రకాల ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగా తన పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం మరో బంపరాఫర్‌ని తీసుకొచ్చింది. పోస్టుపెయిడ్‌, వీ-ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లకు తమ టీవీ యాప్‌ డౌన్‌లోడ్‌పై ఏడాది పాటు ఉచితంగా అమెజాన్‌ ప్రైమ్‌ సర్వీసుల సబ్‌స్క్రిప్షన్‌ను అందించనున్నట్టు పేర్కొంది. కాగా ఈ ప్రమోషనల్‌ ఆఫర్‌ అంతకముందు కేవలం కొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా హానర్ 9 లైట్, ధర రూ. 11,700 మాత్రమే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పోస్టుపెయిడ్‌, వీ-ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లందరికీ..

ఇప్పుడు ఈ ఆఫర్ పోస్టుపెయిడ్‌, వీ-ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రమోషనల్‌ ఆఫర్‌తో కేవలం సినిమాలు, టీవీ షోలు చూడటానికి మరో ప్లాట్‌ఫామ్‌ను అందించడమే కాకుండా... జియోకు గట్టి పోటీ ఇవ్వడానికి దోహదం చేయనుందని కంపెనీ చెప్పింది.

499 రూపాయలు ఆపైన మొత్తాలతో మైఇన్ఫినిటీ ప్లాన్లను..

అయితే ఈ ఆఫర్ వర్తించాలంటే యూజర్లు 499 రూపాయలు ఆపైన మొత్తాలతో మైఇన్ఫినిటీ ప్లాన్లను యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి 12 నెలల పాటు ఈ సర్వీసులను అందించనుంది.

ఆఫర్‌ను క్లయిమ్‌ చేసుకోవాలంటే

యాప్‌ స్టోర్‌ లేదా ప్లే స్టోర్‌ నుంచి ఎయిర్‌టెల్‌ టీవీ యాప్‌ను సబ్‌స్క్రైబర్లు డౌన్‌లోడ్‌ చేసుకుని, రిజిస్ట్రర్‌ మొబైల్‌ నెంబర్‌తో లాగిన్‌ అవ్వాలి.

అమెజాన్ అకౌంట్ వివరాలు..

లాగిన్‌ తర్వాత కింద మీకు అమెజాన్‌ ప్రైమ్‌ బ్యానర్‌ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే ప్రైమ్‌ సర్వీసుల వివరాలతో కూడిన డైలాగ్‌ బాక్స్‌ వస్తుంది. దాన్ని యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మీ అమెజాన్ అకౌంట్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.

ధృవీకరణ మెసేజ్‌

ఆ వివరాలు వెరిఫై అయ్యాక, ఉచితంగా 365 రోజుల అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమవుతుంది. ఎస్‌ఎంఎస్‌, ఈమెయిల్‌ ద్వారా మీకు ఈ ఉచిత సర్వీసులు యాక్టివేట్‌ అయినట్టు ధృవీకరణ మెసేజ్‌ వస్తుంది.

ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ లేని అమెజాన్‌ యూజర్లకు మాత్రమే..

ఈ ఆఫర్‌ కూడా కేవలం ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ లేని అమెజాన్‌ యూజర్లకు మాత్రమే. ఒకవేళ మీరు ప్రైమ్‌ సబ్‌స్క్రైబర్లు అయి ఉంటే, ప్రస్తుతం నడుస్తున్న సబ్‌స్క్రిప్షన్‌ ముగిసిన తర్వాత ఈ ఆఫర్‌ను పొందాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel Offering Free Amazon Prime Membership For 1 Year More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot