Home
News

15 కంటే ఎక్కువ OTT చానెళ్లను అందించే ఎయిర్టెల్ ప్లాన్! రూ.149 మాత్రమే!

By Maheswara

భారతదేశపు రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన భారతి ఎయిర్‌టెల్ తమ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఒకదానితో రూ. 200 కంటే తక్కువ ధరతో ఎక్కువ OTT (ఓవర్-ది-టాప్) ప్రయోజనాలను అందిస్తోంది. ఈ రీఛార్జి ప్లాన్ ద్వారా అనేక ప్లాట్‌ఫారమ్‌ల నుండి OTT కంటెంట్‌ను వినియోగించాలనుకునే వారికి ఇది గొప్ప ఆఫర్.

అవును, మనము చర్చించుకుంటున్న ప్లాన్ ఎయిర్‌టెల్ యొక్క రూ. 149 డేటా వోచర్ ప్లాన్. ఈ ప్లాన్ వినియోగదారులకు డేటాతో పాటు OTT ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇది ఇటీవల ఎయిర్‌టెల్ ఆఫర్‌లకు జోడించబడింది. ఇది కేవలం ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ యొక్క కొత్తగా అప్డేట్ చేయబడిన ప్లాన్. ఇప్పుడు ఈ ప్లాన్‌ లో అందించే అన్ని ప్రయోజనాలను పరిశీలిద్దాం.

Airtel Offering Major OTT Benefits With Rs.149 Data Voucher Plan. Check Plan Details Here.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం బండిల్ డేటా వోచర్ ప్లాన్ రూ.149 కే
ఎయిర్‌టెల్ ఈ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం బండిల్ డేటా వోచర్‌ ప్లాన్ ను రూ. 149 కి అందిస్తోంది. ఈ ప్లాన్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకునే వినియోగదారులు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లాన్‌కి ఉచిత ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో పాటు మొత్తం 1GB డేటాను పొందుతారు. ఈ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం అనేది ఎయిర్‌టెల్ యొక్క అంతర్గత OTT ప్లాట్‌ఫారమ్, ఇది వినియోగదారుల కోసం ఒకే యాప్‌లో 15+ OTT ఛానల్ లను అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు వినియోగదారులకు ఇప్పటికే ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ లాగానే ఉంటుంది.

ఇంకా, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ప్రయోజనంతో వచ్చే డేటా వోచర్ ఇదొక్కటే కాదని గుర్తుంచుకోండి. ఎయిర్టెల్ అందించే అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ యొక్క ప్రయోజనంతో వస్తాయి, అయితే వీటిలో చాలా ప్లాన్‌లు ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం లో OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఒకదానికి మాత్రమే యాక్సెస్‌ను అందిస్తాయి. కానీ, ఎయిర్టెల్ నుండి అందుబాటులో ఉన్న ఈ రూ.149 డేటా వోచర్‌తో, మీరు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం ప్లాట్‌ఫారమ్‌లన్నింటికీ యాక్సెస్ పొందుతారు.

ఇంకా ఈ ప్లాన్ గురించి మరింత సమాచారం తెలుసుకుంటే, ఇది డేటా కావాలనుకునే వినియోగదారుల కోసం ఉద్దేశించిన ప్లాన్ కాదు. బదులుగా, ఎయిర్‌టెల్ తన అంతర్గత OTT ప్లాట్‌ఫారమ్‌ను స్వీకరించడానికి ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్ వినియోగదారులు టీవీలు మరియు PCలు వంటి స్మార్ట్‌ఫోన్‌లు కాకుండా ఇతర పరికరాలలో ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం నుండి కంటెంట్‌ను చూడటానికి కూడా ఈ ప్లాన్ అనుమతిస్తుంది.

ఇటీవలే సంస్థ సీఈఓ, త్వరలోనే ఎయిర్టెల్ రీఛార్జి ధరలు పెంచాలని ఆలోచిస్తున్నట్లు ప్రకటించిన విషయం మీకు తెలిసిందే. భారతీ ఎయిర్‌టెల్ సంస్థ ఈ ఏడాది తమ యొక్క అన్ని రీచార్జి ప్లాన్‌లలో మొబైల్ ఫోన్ కాల్ మరియు డేటా రేట్లను పెంచాలని ఆలోచిస్తున్నట్లు, ఆ టెలికాం సంస్థ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ ఒక సమావేశంలో తెలిపారు. కంపెనీ గత నెలలో తమ కనీస రీఛార్జ్ ధర లేదా 28-రోజుల మొబైల్ ఫోన్ సర్వీస్ ప్లాన్ కోసం ఎంట్రీ-లెవల్ ధరను దాదాపు 57 శాతం పెంచి ఎనిమిది సర్కిల్‌లలో ₹ 155కి పెంచింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel Offering Major OTT Benefits With Rs.149 Data Voucher Plan. Check Plan Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X