రూ.1,500 డిస్కౌంట్ ఇస్తున్న ఎయిర్‌టెల్ ఎందుకో చూడండి
జియోతో పోటీని తట్టుకునేందుకు ఎప్పుడూ ముందుండే ఎయిర్టెల్ యూజర్ల కోసం మరో కొత్త ఆఫర్ ను ప్రవేశ పెట్టింది.ఎయిర్‌టెల్ పోస్టు పెయిడ్ వినియోగదారులు మరో వ్యక్తిని ఎయిర్‌టెల్ పోస్టు పెయిడ్ వినియోగదారుడిగా మార
జియోతో పోటీని తట్టుకునేందుకు ఎప్పుడూ ముందుండే ఎయిర్టెల్ యూజర్ల కోసం మరో కొత్త ఆఫర్ ను ప్రవేశ పెట్టింది.ఎయిర్‌టెల్ పోస్టు పెయిడ్ వినియోగదారులు మరో వ్యక్తిని ఎయిర్‌టెల్ పోస్టు పెయిడ్ వినియోగదారుడిగా మారిస్తే వారికి రూ.1500 డిస్కౌంట్ లభిస్తుంది.అలాగే కొత్తగా జాయిన్ అయిన వ్యక్తికి కూడా ఇదే విధమైన ప్రయోజనాలు అందుతాయి.

ఎయిర్‌టెల్ ప్రకారం....
ఎయిర్‌టెల్ ప్రకారం ఇప్పటికే పోస్ట్ పెయిడ్ యూజ్ చేస్తున్న వినియోగదారుడికి రూ.150 రూపంలో మూడు డిస్కౌంట్ కూపన్లు లభిస్తాయి. అలాగే, కొత్త వినియోగదారుడికి కూడా రూ.50 చొప్పున మూడు డిస్కౌంట్ కూపన్లు లభిస్తాయి. మై ఎయిర్‌టెల్ యాప్ ద్వారా వీటిని రిడీమ్ చేసుకోవచ్చు.

రెఫర్ చేసిన యూజర్ తో పాటు....
రెఫర్ చేసిన యూజర్ తో పాటు కొత్తగా చేరిన యూజర్ కి యాక్టివేషన్ అయిన 24 గంట్లలో డిస్కౌంట్ కూపన్లు అందుతాయి. ఇందులో పదిమంది వరకు రెఫర్ చేయవచ్చని, ఫలితంగా రూ.1500 విలువైన కూపన్లు అందుకోవచ్చని ఎయిర్టెల్ సంస్థ తెలిపింది.

ఆఫర్ పొందడం ఎలాగో ఇక్కడ చూడండి....
- ఆండ్రాయిడ్ లేదా iOS లో My Airtel యాప్ ను ఓపెన్ చేయండి
- నోటిఫికెషన్స్ సెక్షన్ దగ్గరికి స్క్రోల్ చేసి రూ.150 డిస్కౌంట్ ఆన్ యువర్ పోస్టు పెయిడ్ బిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి
- ఇచ్చిన కోడ్ ను కాపీ చేసి రిఫరీలతో సోషల్ మీడియా ద్వారా లేదా SMS ద్వారా షేర్ చేయండి
- మీ రిఫరీ లింకుపై క్లిక్ చేసి, ఆ ప్రక్రియను పూర్తిచేసిన తర్వాత, ఆ వ్యక్తికి ఎయిర్టెల్ ఎగ్జిక్యూటివ్ నుండి స్విచ్ ఓవర్ ప్రాసెస్ కోసం కాల్ వస్తుంది.
- మీరు మరియు మీ రిఫరీ ఇద్దరు సక్సెస్ ఫుల్ యాక్టీవ్షన్ తరువాత డిస్కౌంట్ కూపన్లు అందుకుంటారు.


Click it and Unblock the Notifications








