Airtel కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లతో 500MB రోజువారీ డేటాను ఉచితంగా అందిస్తోంది

|

భారతి ఎయిర్‌టెల్ ఇప్పుడు ధరల టారిఫ్ ను పెంచిన తరువాత కొత్త ధరల వద్ద ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇప్పుడు కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షంగా ఉన్నాయి. ఎయిర్‌టెల్ ఈరోజు నుండి బహుళ ప్రీపెయిడ్ ప్లాన్‌ల టారిఫ్‌లను పెంచింది. కానీ దానితో పాటు టెల్కో నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ఉచితంగా అందించే డేటా ప్రయోజనాలను కూడా అప్‌గ్రేడ్ చేసింది. రూ.719, రూ.299, రూ.265 మరియు రూ.839 ధరల వద్ద లభించే ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకునే ఎయిర్‌టెల్ వినియోగదారులు ప్రతిరోజూ కంపెనీ నుండి 500GB డేటాను ఉచితంగా పొందగలరు. ఈ 500MB డేటా ఆఫర్‌ను గతంలో టెల్కో తన రూ.249 ప్లాన్‌కు మాత్రమే పరిచయం చేసింది. అయితే ఇప్పుడు ధరల పెంపుతో ఇది ఇప్పుడు రూ.299 ప్లాన్‌గా మారింది. కొత్త ధరలు మరియు వాటి ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

500MB రోజువారీ అదనపు  ఉచిత డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లు

500MB రోజువారీ అదనపు ఉచిత డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ అందించే 500MB అదనపు రోజువారీ డేటాను రీడీమ్ చేసుకునే విధానం చాలా సులభం. వినియోగదారులు ఎయిర్‌టెల్ థాంక్స్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోని వారికి అవసరమైన సమయంలో ప్రతిరోజూ అక్కడ నుండి అదనపు డేటాను రీడీమ్ చేసుకోవాలి. రూ.719, రూ. 299, రూ. 265 మరియు రూ. 839తో వంటి అన్ని ప్లాన్‌లు అదనపు డేటాను అందించడంతో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తాయి.

రూ.839 ప్లాన్

రూ.839 ప్లాన్ వినియోగదారులకు 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. అయితే ఎయిర్‌టెల్ థాంక్స్ అప్లికేషన్ నుండి 500MB అదనపు రోజువారీ డేటాతో పొందడంతో వినియోగదారులు ప్రాథమికంగా 2.5GB రోజువారీ డేటాను పొందుతున్నారు. రూ.265 ధర వద్ద లభించే ప్లాన్ 1GB రోజువారీ డేటాతో అందించబడుతుంది. అలాగే అదనంగా బోనస్ 500MB డేటాతో కలుపుకొని రూ.265 ప్లాన్ 1.5GB రోజువారీ డేటాతో వస్తుంది.

1.5GB రోజువారీ డేటా

రూ.299 మరియు రూ.719 ప్లాన్‌లు రెండూ 1.5GB రోజువారీ డేటాను అందిస్తాయి, ఇది కంపెనీ అందించే 500MB అదనపు డేటాతో కలిపి 2GB రోజువారీ డేటాగా మారుతుంది. అలాగే రూ.299 మరియు రూ.265 ప్లాన్‌లు 28 రోజుల స్వల్ప వ్యాలిడిటీతో వస్తాయి. అయితే రూ.719 మరియు రూ.839 ప్లాన్‌లు 84 రోజుల సర్వీస్ వాలిడిటీతో వస్తాయి. ఇవి మీడియం-టర్మ్ వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. ఈ ప్లాన్లు ఒక నెల పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, వింక్ మ్యూజిక్ మరియు మరిన్నింటితో సహా అన్ని ఇతర Airtel థాంక్స్ ప్రయోజనాలు కూడా చేర్చబడ్డాయి. మీరు టెల్కో వెబ్‌సైట్ నుండి దిగువ చిత్రాన్ని కనుగొనవచ్చు, ఇది నిర్దిష్ట ప్లాన్‌లపై 500MB అదనపు డేటాను ప్రదర్శిస్తుంది.

Airtel ప్రీపెయిడ్ ప్లాన్‌ల కొత్త ధరలు

Airtel ప్రీపెయిడ్ ప్లాన్‌ల కొత్త ధరలు

** రూ.79 ప్లాన్ రూ.99కి పెంపు: రూ.99 విలువైన టాక్‌టైమ్ మరియు 200MB డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

** రూ.149 ప్లాన్ రూ.179కి పెంపు: 28 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు 2GB డేటాను అందిస్తుంది.

** రూ.219 ప్లాన్ రూ.265కి పెంపు: 28 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 1GB డేటాను అందిస్తుంది.

** రూ.249 ప్లాన్ రూ.299కి పెంపు: 28 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది.

** రూ.298 ప్లాన్ రూ.359కి పెంపు: 28 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 2GB డేటాను అందిస్తుంది.

** రూ.399 ప్లాన్ రూ.479కి పెంపు: 56 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది.

** రూ.449 ప్లాన్ రూ.549కి పెంపు: 56 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 2GB డేటాను అందిస్తుంది.

** రూ.379 ప్లాన్ రూ.455కి పెంపు: 84 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు 6GB డేటాను అందిస్తుంది.

** రూ.598 ప్లాన్ రూ.719కి పెంపు: 84 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది.

** రూ.698 ప్లాన్ రూ.839కి పెంపు: 84 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 2GB డేటాను అందిస్తుంది.

** రూ.1498 ప్లాన్ రూ.1799కి పెంపు: 365 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు 24GB డేటాను అందిస్తుంది.

** రూ.2498 ప్లాన్ రూ.2999కి పెంపు: 365 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 2GB డేటాను అందిస్తుంది.

 

Airtel డేటా టాప్-అప్‌ల కొత్త ధరల వివరాలు

రూ.48 ప్లాన్ రూ.58కి పెంపు: 3GB డేటాను ఆఫర్ చేస్తుంది.

రూ.98 ప్లాన్ రూ.118కి పెంపు: 12GB డేటాను ఆఫర్ చేస్తుంది.

రూ.251 ప్లాన్ రూ.301కి పెరిగింది: 50GB డేటాను ఆఫర్ చేస్తుంది.

 

Best Mobiles in India

English summary
Airtel Offers 0.5GB Free Daily Data With 4 New Prepaid Plans: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X