ఆగని ఎయిర్‌టెల్ దూకుడు, 1000జిబి డేటా ఫ్రీ..

ఎయిర్‌టెల్ దూకుడు ఆగడం లేదు. జియో బ్రాడ్‌బాండ్ రాకముందే సంచలనాలను సృష్టించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

By Hazarath
|

ఎయిర్‌టెల్ దూకుడు ఆగడం లేదు. జియో బ్రాడ్‌బాండ్ రాకముందే సంచలనాలను సృష్టించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా చేరే ఎయిర్‌టెల్ కష్టమర్లకు భారీ డేటా ఆఫర్లను ప్రకటించేందుకు రెడీ అయింది. నెలసరి డేటాతో పాటు అదనంగా 1000 జిబి డేటాను అందించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్‌, జియో రూ.399కి చెక్ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్‌, జియో రూ.399కి చెక్

కస్టమర్లకు బంపర్‌ ఆఫర్లను

కస్టమర్లకు బంపర్‌ ఆఫర్లను

బ్రాడ్‌బ్యాండు మార్కెట్‌లో అడుగుపెట్టి, అక్కడ కూడా సంచలనాలు సృష్టించాలని రిలయన్స్‌ జియో ప్లాన్స్‌ వేస్తుండగా... దానికి ముందుస్తుగా ఎయిర్‌టెల్‌ కూడా తన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్లను ప్రకటిస్తోంది.

1000జీబీ వరకు అదనపు డేటా

1000జీబీ వరకు అదనపు డేటా

తాజాగా ఎయిర్‌టెల్‌ కొత్త బోనస్‌ డేటా ఆఫర్‌ను తన కస్టమర్లకు తీసుకొచ్చింది. ఈ కొత్త బోనస్‌ డేటా ఆఫర్‌ కింద కొత్త కస్టమర్లకు 1000జీబీ వరకు అదనపు డేటా అందించనున్నట్టు పేర్కొంది.

చౌకైన ప్లాన్లు

చౌకైన ప్లాన్లు

ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ చేస్తున్న చౌకైన ప్లాన్లు రూ.899 నుంచి ప్రారంభమవుతాయని, దీని కింద నెలకు 60 జీబీ డేటాను, అదనంగా ఏడాదిలో 500జీబీ డేటాను అందించనున్నట్టు కంపెనీ తెలిపింది.

ప్లాన్‌ స్పీడు 40 ఎంబీపీఎస్‌
 

ప్లాన్‌ స్పీడు 40 ఎంబీపీఎస్‌

ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్‌ ప్రకారం ఈ ప్లాన్‌ స్పీడు 40 ఎంబీపీఎస్‌ వరకు అని తెలిసింది.

రూ.1099 కింద

రూ.1099 కింద

మరో ప్లాన్‌ రూ.1099 కింద 40 ఎంబీపీఎస్‌ స్పీడులో నెలకు 100జీబీ డేటాను ఆఫర్‌ చేయనున్నామని, అంతేకాక 1000 జీబీ బోనస్‌ డేటాను వినియోగదారులకు అందించనున్నట్టు ప్రకటించింది.

రూ.1299 ప్లాన్‌కు, రూ.1499, రూ.1799 ప్లాన్లకు

రూ.1299 ప్లాన్‌కు, రూ.1499, రూ.1799 ప్లాన్లకు

అలాగే రూ.1299 ప్లాన్‌కు, రూ.1499, రూ.1799 ప్లాన్లకు 1000జీబీ వరకు బోనస్‌ డేటాను అందించనున్నట్టు ఎయిర్‌టెల్‌ తెలిపింది. కానీ ఇవన్నీ కొత్త కస్టమర్లకు మాత్రమేనని కంపెనీ వెల్లడించింది.

రిలయన్స్‌ జియో కూడా తన ఫైబర్‌ నెట్‌వర్క్‌ను

రిలయన్స్‌ జియో కూడా తన ఫైబర్‌ నెట్‌వర్క్‌ను

ప్రస్తుతం రిలయన్స్‌ జియో కూడా తన ఫైబర్‌ నెట్‌వర్క్‌ను లాంచ్‌ చేయడానికి టెస్టింగ్‌ చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వీటిని లాంచ్‌చేసింది కూడా. కానీ దేశవ్యాప్తంగా లాంచ్‌ చేయడానికి జియో ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్‌లో

బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్‌లో

ఇప్పటికే టెలికాం మార్కెట్‌లోకి జియో ఎంట్రీతో తీవ్ర కుదుపులోకి లోనైనా టెలికాం దిగ్గజాలు, బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్‌లో జియోకు కౌంటర్‌ ఇచ్చేందుకు ముందస్తుగానే సన్నద్ధమవుతున్నాయి.

Best Mobiles in India

English summary
Airtel Offers 1,000 GB Bonus Data To Broadband Users In 'Big Byte' Plans Read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X