పైసా కట్టక్కర్లేదు, Airtel 30జిబి డేటా ఉచితంగా వాడుకోండి

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు బంపరాఫర్ ఇచ్చింది. జియోకి పోటీగా ఈ సంస్థ 4జీ వోల్టే సర్వీసులను అధికారికంగా ప్రారంభించే సన్నాహాల్లో ఉంది.

|

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు బంపరాఫర్ ఇచ్చింది. జియోకి పోటీగా ఈ సంస్థ 4జీ వోల్టే సర్వీసులను అధికారికంగా ప్రారంభించే సన్నాహాల్లో ఉంది. ఇందులో భాగంగానే దీనికంటే ముందు సాంకేతిక సన్నద్ధత, లోపాల గుర్తింపునకు గాను 4జీ వోల్టే బీటా సేవలను దేశవ్యాప్తంగా కొన్ని సర్కిళ్లలో ఆరంభించింది. 'ఉచితంగా డేటా వినియోగించుకోండి... మా టెక్నాలజీ ఎలా ఉందో పరీక్షించి అభిప్రాయాలు చెప్పండి' అంటూ ఈ సంస్థ ఆహ్వానం పలుకుతోంది. మీరు మీ అభిప్రాయాన్ని చెప్పి డేటాను వాడుకోవచ్చని కంపెనీ చేసిన ఆసక్తికర ప్రకటన ఇప్పుడు యూజర్లకు డేటాను వాడుకునేందుకు మంచి అవకాశంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

షియోమి ఫ్లాష్‌సేల్ వెనుక దిమ్మతిరిగే నిజాలు, అంతా ఓ మాయషియోమి ఫ్లాష్‌సేల్ వెనుక దిమ్మతిరిగే నిజాలు, అంతా ఓ మాయ

ఉచిత డేటా ప్యాకేజీలో భాగంగా..

ఉచిత డేటా ప్యాకేజీలో భాగంగా..

ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా, పశ్చిమబెంగాల్, అసోం, బిహార్, పంజాబ్ సర్కిళ్లలో ఎయిర్ టెల్ వోల్టే బీటా కార్యక్రమం అందుబాటులో ఉంది. ఉచిత డేటా ప్యాకేజీలో భాగంగా యూజర్లు 30జీబీ వరకు యాక్సెస్ చేసుకోవచ్చు.

10జీబీ డౌన్ లోడింగ్ కు

10జీబీ డౌన్ లోడింగ్ కు

ఇందులో 10జీబీ డౌన్ లోడింగ్ కు తొలుత అవకాశం ఇస్తుంది. నాలుగు వారాల వినియోగం తర్వాత ఫీడ్ బ్యాక్ తీసుకుంటుంది. అనంతరం మరో 10జీబీ డేటా ఉచితంగా ఇస్తుంది. ఆ తర్వాత మరో నాలుగు వారాలు గడిచిన అనంతరం ఫీడ్ బ్యాక్ తీసుకుని చివరిగా 10 జీబీ డేటా ఇస్తుంది. నెట్ వర్క్ పరంగా ఎదుర్కొనే సమస్యలపై యూజర్లు ఎప్పటికప్పుడు తెలియజేయాల్సి ఉంటుంది.

HD voice calling, instant call connect..

HD voice calling, instant call connect..

కాగా Airtel ఆఫర్ చేస్తున్న ఇందులో యూజర్లకు HD voice calling, instant call connect అంటే ఇప్పుడున్న వాటికి 3 రెట్లు వేగంతో కాల్స్ , multitasking లాంటి ఫీచర్లను అందించనుంది. కాగా ఈ రకమైన సేవలను ఇప్పటికే కలకత్తాలో కంపెనీ ప్రారంభించింది.

రిలయన్స్ జియో ఇప్పటికే..

రిలయన్స్ జియో ఇప్పటికే..

రిలయన్స్ జియో ఇప్పటికే VoLTE technologyలో దూసుకుపోతున్న నేపథ్యంలో Airtel కూడా జియోని ఢీ కొట్టేందుకు రెడీ అయింది. కాగా వొడాఫోన్ కూడా ఇప్పటికే Mumbai, Gujarat, Delhi, Karnataka, and Kolkata లాంటి నగరాలలో ఫస్ట ఫేజ్ కింద ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ బాటలోనే ఎయిర్ టెల్ ముందుక నడవనుంది.

ఆఫర్ యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే ..

ఆఫర్ యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే ..

మీరు ఈ ఆఫర్ యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే మీ ఫోన్ 4జీ వోల్ట్ అవునో కాదే చెక్ చేసుకోవాలి. ఒక వేళ మీ ఫోన్ 4జీ వోల్ట్ అయితే మీరు Airtel 4జీ సిమ్ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు upgraded OS software ద్వారా VoLTE switch ఎనేబుల్ చేసుకోవాలి.

మీ నంబర్ ఈ ఆఫర్ కి

మీ నంబర్ ఈ ఆఫర్ కి

మీ నంబర్ ఈ ఆఫర్ కి అందుబాటులో ఉందో లేదో ఈ Airtel లింక్ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. అక్కడ మీకు కనిపించే validate mobile numberలో మీ నంబర్ టైపు చేయడం ద్వారా మీరు ఆఫర్ కి అర్హులో కాదో తెలుస్తుంది. కాగా కొంతమంది కలకత్తా రీజియన్ లోని నంబర్లు టైపు చేయగా వారికి ఇందులో మీ నంబర్ unavailable అని వస్తోంది. కాబట్టి మీరు చెక్ చేసుకోవాలని మనవి.

4G VoLTE వేరు, 4G వేరు..మీ ఫోన్ ఏదో చెక్ చేసుకోండి

4G VoLTE వేరు, 4G వేరు..మీ ఫోన్ ఏదో చెక్ చేసుకోండి

volte 4జీ అంటే volte 4జీ అంటే స‌ద‌రు ఫోన్ కేవ‌లం 4జీ ఇంట‌ర్నెట్ డేటాకే కాదు, 4జీ వాయిస్ కాల్స్‌కు కూడా స‌పోర్ట్ చేయాలి. దాన్నే volte 4జీ అంటారు. 4జీలో అయితే కేవలం డేటా మాత్రమే వాడుకుంటాం.ఈ ఫీచర్ తో యూజ‌ర్ త‌న డివైస్‌లో 4జీ ఇంట‌ర్నెట్ డేటాతోపాటు, హెచ్‌డీ క్వాలిటీతో కూడిన 4జీ వాయిస్ కాల్స్‌ను కూడా చేసుకోవచ్చు. చాలా కంపెనీలు వోల్ట్ అని చెప్పి 4జీ ఫోన్లను ఇస్తున్నాయి ఇప్పుడు. మీరు కొంచెం చూసి తీసుకోండి.

వాయిస్ ఓవ‌ర్ ఎల్‌టీఈ

వాయిస్ ఓవ‌ర్ ఎల్‌టీఈ

4G VoLTE అంటే వాయిస్ ఓవ‌ర్ ఎల్‌టీఈ అని అర్థం. డివైస్‌లో 4జీ ఇంట‌ర్నెట్ డేటాతో పాటు, 4జీ వాయిస్ కాల్స్ కూడా చేసుకోవ‌చ్చ‌ని అర్థం. అలాంటి ఫోన్లు చాలా కాస్ట్ లో లభిస్తున్నాయి ఇప్పుడు. 

4జీ ఫోన్లు అయితే

4జీ ఫోన్లు అయితే

4జీ ఫోన్లు అయితే చాలా తక్కువ ధరల్లోనే ఇస్తున్నారు.4జీ ఫోన్లు అయితే మీరు అనుకునే 4జీ ఫోన్లు అయితే కేవలం డేటా వాడుకోవటానికి మాత్రమే పనికొస్తాయి. 4జీ వాయిస్ కాల్స్ కి సపోర్ట్ చేయవు. అంటే మీరు హెచ్ డి వాయిస్ కాల్స్ అసలు చేసుకోలేరు.

VoLTE checker

VoLTE checker

దీన్ని త‌మ త‌మ డివైస్‌ల‌లో గుర్తించ‌డం చాలా మందికి క‌ష్ట‌త‌ర‌మ‌వుతోంది. అందుకే గూగుల్ ప్లే స్టోర్‌లో అలాంటి వారి కోసం ఓ యాప్ అందుబాటులోకి వ‌చ్చింది.VoLTE checker' పేరిట ప్లే స్టోర్‌లో ల‌భ్య‌మ‌వుతున్న ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ యూజ‌ర్లు ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు.

త‌మ ఫోన్‌లో VoLTE ఉందా, లేదా..

త‌మ ఫోన్‌లో VoLTE ఉందా, లేదా..

దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుని ఓపెన్ చేస్తే ఈ యాప్ వెంట‌నే స‌ద‌రు డివైస్ అస‌లైన 4జీ ఫోన్ అవునో కాదో వెంట‌నే తెలియ‌జేస్తుంది. దీంతో యూజ‌ర్లు త‌మ ఫోన్‌లో VoLTE ఉందా, లేదా అని గుర్తించ‌వ‌చ్చు.జియో నుంచి వచ్చిన అన్ని lyf ఫోన్లు ఈ వోల్ట్ ఫీచర్ తోనే వస్తున్నాయి. కాబట్టి వాటికి జియో సిమ్ సపోర్ట్ చేస్తోంది. మిగతా ఫోన్లకు సపోర్ట్ చేసినా వాయిస్ కాల్స్ లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి.

ఇంకో ఆప్సన్

ఇంకో ఆప్సన్

దీంతో పాటు మీకు ఇంకో ఆప్సన్ కూడా ఉంది. మీరు మీ ఆండ్రాయిడ్ 4 జీ మొబైల్ నుంచి స్టార్ హ్యాష్ స్టార్ హ్యాష్ 4636 హ్యాష్ స్టార్ హ్యాష్ స్టార్ (* # * # 4636 # * # *) ఈ నంబర్లు నొక్కితే చాలు చివరి హ్యాష్ ఎంటర్ చేయగానే మీ మొబైల్ సర్వీస్ పై నాలుగు ఆప్షన్స్ వస్తాయి.

మీ మొబైల్ కి సంబంధించిన డిటైల్స్

మీ మొబైల్ కి సంబంధించిన డిటైల్స్

దాంట్లో మొదటిది డ్రైవ్స్ ఇన్ఫర్మేషన్ లేదా ఫోన్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. దాన్ని ఎంచుకుని కిందకు స్క్రోల్ చేస్తే నెట్ వర్క్ టైప్ అని ఉంటుంది. అక్కడ మీ మొబైల్ కి సంబంధించిన డిటైల్స్ కనిపిస్తాయి. మీ ఫోన్ ఎల్టీఈ లేక వోల్టా (వీవోఎల్టీఈ) అనేది కూడా అక్కడ కనిపిస్తుంది.

Best Mobiles in India

English summary
Airtel Offers 30GB of Free Data to Rope in VoLTE Beta Testers More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X