రోజుకి 1 జిబి కాదు, 4జిబి డేటా.. Airtel సరికొత్త ఆఫర్
టెలికం మార్కెట్లో జియోని ఢీ కొట్టడమే లక్ష్యంగా టెల్కోలు ముందుకుసాగుతున్న విషయం తెలిసిందే.
టెలికం మార్కెట్లో జియోని ఢీ కొట్టడమే లక్ష్యంగా టెల్కోలు ముందుకుసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఢీ కొట్టడంలో జియోకి పోటీగా Airtel మాత్రమే ముందంజలో ఉంది. తమ వినియోగదారులు జియోకి తరలిపోకుండా సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తూపోతోంది. ఈ నేపథ్యంలోనే Airtel సరికొత్త ఆఫర్‌ని ప్రవేశపెట్టింది. ఆ ప్లాన్ వివరాలపై ఓ లుక్కేయండి.

రూ. 999తో రీఛార్జ్
తమ ఫ్రీపెయిడ్ యూజర్ల కోసం Airtel కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ప్రకారం యూజర్లు రూ. 999తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 4జిబి డేటాను పొందవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ఆఫర్ లభిస్తోంది.

జియో ప్లాన్ కి పోటీగా
ఈ ప్లాన్ జియో ప్లాన్ కి పోటీగా ఉంది. జియోలో ఉన్న రూ. 999 ప్లాన్ ప్రకారం 90 రోజుల పాటు రోజుకి 1జిబి డేటా చొప్పున పొందవచ్చు. అలాగే అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉంటాయి. ఇదే ప్లాన్తో ఇప్పుడు Airtel ముందుకు వచ్చింది. అయితే వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే ఇచ్చింది.

ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే
అయితే ఈ ప్లాన్ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. వారు 112 జిబి డేటాను నెలరోజుల పాటు అందుకుంటారు. యూజర్లు Airtel రీఛార్జ్ పోర్టల్‌లోకెళ్లి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

50 శాతం డిస్కౌంటు
దీంతో పాటు ఈ రీఛార్జ్ పై 50 శాతం డిస్కౌంటును కూడా అందిస్తోంది. యూజర్లు ఈ డిస్కౌంటును పొందాలంటే Airtel పేమెంట్ బ్యాంకు ద్వారా చెల్లింపు జరపాల్సి ఉంటుంది.

పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం
ఇదేకాకుండా పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం ఎయిర్‌టెల్ మరో కొత్త పథకం తీసుకొచ్చింది. ‘బోనస్ 30 జిబి' పేరుతో తీసుకొచ్చిన ఈ పథకం కింద నెలకు పది జిబి చొప్పున మూడు నెలల కాలంలో 30 జిబి డేటా ఉచితంగా వాడుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే
ఈ పథకం కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే సిమ్ కార్డును కూడా ఎయిర్‌టెల్ డోర్ డెలివరీ చేయనున్నట్టు ఎయిర్‌టెల్.ఇన్ వెబ్‌సైట్లో తెలిపింది. రూ.299 తప్పించి రూ.1,000లోపు ఉండే మిగతా అన్ని ప్లాన్స్‌లో ఈ ఆఫర్ లభిస్తుంది.


Click it and Unblock the Notifications