రూ.5కే 4జీబి డేటా

జియో నుంచి ఎదురవుతోన్న పోటీ నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్ సరికొత్త డేటా ప్లాన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. రూ.5కే అందుబాటలో ఉండే ఈ డేటా ప్లాన్‌లో భాగంగా యూజర్‌కు 4జీబి 4జీ డేటా లభిస్తుందట. ఈ డేటాను 7 రోజుల్లోపు వినియోగించుకోవాల్సి ఉంటంది.

రూ.5కే 4జీబి డేటా

Read More : ఒక్క బిట్‌కాయిన్ ఖరీదు రూ.6 లక్షలా..?

ఈ వన్-టైమ్ రీఛార్జ్ ప్లాన్ ఎయిర్‌టెల్ ప్రీ-పెయిడ్ కస్టమర్స్‌కు మాత్రమే అందబాటలో ఉంటుందని సమాచారం. ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లోకి కొత్తగా చేరే చందాదారులు 54 రోజుల్లోపు ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవల్సి ఉంటుంది. ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎయిర్‌టెల్ ఇటీవల మార్కెట్లో లాంచ్ చేసిన పలు ప్రీపెయిడ్ ప్లాన్స్ తాలుకా వివరాలు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.8 ప్లాన్, రూ.10 ప్లాన్

రూ.8 ప్లాన్

56 రోజుల వ్యాలిడిటీతో వస్తోన్న ఈ ప్లాన్‌లో బాగంగా లోకల్, ఎస్‌టీడీ కాల్స్ పై నిమిషానికి 30 పైసలు మాత్రమే ఛార్జ్ చేయటం జరుగుతుంది.

రూ.10 ప్లాన్

26 రోజుల వ్యాలిడిటీతో వస్తోన్న ఈ ప్లాన్‌లో బాగంగా లోకల్ కాల్స్ పై నిమిషానికి 10 పైసలు మాత్రమే ఛార్జ్ చేయటం జరుగుతుంది.

 

రూ.40 ప్లాన్, రూ.60 ప్లాన్

రూ.40 ప్లాన్

ఈ రీఛార్జ్ ప్లాన్ పై అన్‌లిమిటెడ్ వ్యాలిడిటీతో రూ.35 టాక్ టైమ్ అందుబాటులో ఉంటుంది.

రూ.60 ప్లాన్

ఈ రీఛార్జ్ ప్లాన్ పై అన్‌లిమిటెడ్ వ్యాలిడిటీతో రూ.58 టాక్ టైమ్ అందుబాటులో ఉంటుంది.

 

రూ.90, రూ.149 ప్లాన్స్..

రూ.90 ప్లాన్

ఈ రీఛార్జ్ ప్లాన్ పై అన్‌లిమిటెడ్ వ్యాలిడిటీతో రూ.88 టాక్ టైమ్ అందుబాటులో ఉంటుంది.

రూ.149 ప్లాన్

28 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా 2జీబి 4జీ డేటాతో పాటు ఎయిర్‌టెల్ టు ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ మధ్య అన్‌లిమిటెడ్ కాల్స్ అందుబాటులో ఉంటాయి.

 

రూ.198, రూ.295 ప్లాన్స్..

రూ.198 ప్లాన్

28 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా 1జీబి 4జీ డేటాతో పాటు లోకల్, ఎస్‌టీడీ కాల్స్ పూర్తిగా అన్‌లిమిటెడ్.

రూ.295 ప్లాన్

84 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా లోకల్, ఎస్‌టీడీ కాల్స్ పూర్తిగా అన్‌లిమిటెడ్.

 

రూ.349, రూ.399 ప్లాన్స్

రూ.349 ప్లాన్

28 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 1జీబి 4జీ డేటాతో పాటు లోకల్, ఎస్‌టీడీ కాల్స్ పూర్తిగా ఉచితం.

రూ.399 ప్లాన్

28 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 1జీబి 4జీ డేటాతో పాటు లోకల్, ఎస్‌టీడీ కాల్స్ పూర్తిగా ఉచితం. అవుట్ గోయింగ్ రోమింగ్ కాల్స్ పై ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబడవు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel offers 4GB data for Rs 5, here’s all that you will get. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot