జియోకి కౌంటర్ ఇచ్చిన ఎయిర్‌టెల్, 50 జిబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్

Written By:

జియోతో పోటీకి సై అంటే సై అంటున్నది ఎయిర్‌టెల్. ఆఫర్ల మీద ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తూనే ఉన్నది. రూ.1399కే 4జీ ఆండ్రాయిడ్ ఫోన్ అంటూ సంచలనం మరువక ముందే మరో ఆఫర్‌ని ప్రకటించింది. తాజాగా జియో ధన్‌ ధనా ధన్‌ ఆఫర్‌కు పోటీగా పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారుల కోసం మరో ఆఫర్‌ను తీసుకొచ్చింది.

జియో యూజర్లకు మరో కానుక, దీపావళి ధనాధన్‌ ఆఫర్‌

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.999కే అపరిమిత లోకల్‌ కాల్స్‌, 50 జీబీ 3జీ/4జీ డేటా..

డేటా ఎక్కువగా వాడే వారికోసం రూ.999కే అపరిమిత లోకల్‌ కాల్స్‌, 50 జీబీ 3జీ/4జీ డేటాను అందిస్తున్నట్లు ప్రకటించింది.ఈ కొత్త ప్లాన్ కింద 50 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోమింగ్‌లోనూ ఫ్రీకాల్స్ లభిస్తాయి

పాత, కొత్త పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులకు

ఈ ఆఫర్‌ పాత, కొత్త పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులకు వర్తిస్తుంది. అంతేకాదు మిగిలిపోయిన డేటాను రోల్ ఓవర్ కూడా చేస్తామని ఎయిర్‌టెల్ స్పష్టంచేసింది.

ప్రీపెయిడ్‌ వినియోగదారులకు రూ.999 ప్లాన్‌..

ఇప్పటికే ప్రీపెయిడ్‌ వినియోగదారులకు రూ.999 ప్లాన్‌ అందుబాటులో ఉంది. 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 4జీబీ 3జీ/4జీ డేటా, అపరిమిత లోకల్‌ కాల్స్‌ను అందిస్తోంది.

 

ప్రీపెయిడ్‌లో గరిష్ఠంగా రోజుకు 4 జీబీ..

ప్రీపెయిడ్‌లో గరిష్ఠంగా రోజుకు 4 జీబీ వాడుకొనే వెసులుబాటు ఉండగా.. పోస్ట్ పెయిడ్‌లో మాత్రం రోజువారీ డేటా పరిమితులు ఏమీ లేవు.

జియో కూడా రూ.999 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను ..

ఇప్పటికే జియో కూడా రూ.999 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద 90 జీబీ డేటా అందిస్తుండగా.. దీని వేలిడిటీ రెండు నెలలుగా ఉంది.

ఎయిర్‌టెల్ సెక్యూర్ సర్వీస్‌ను..

ఇక ఈ ఆఫర్‌తోపాటు ఎయిర్‌టెల్ సెక్యూర్ సర్వీస్‌ను ఆరు నెలల పాటు ఫ్రీగా అందిస్తున్నది. దీనికింద ఒకవేళ కస్టమర్ ఫోన్ ప్రమాదవశాత్తూ పాడైతే సంబంధింత ఆథోరైజ్డ్ సర్వీస్ సెంటర్‌లో రిపెయిర్ చేయించి ఇస్తుంది.

రూ.1,399కే 4జీ స్మార్ట్‌ఫోన్‌..

ఇంతకు ముందే 4జీ వినియోగదారుల కోసం రూ.1,399కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందించనున్నట్లు ఎయిర్‌టెల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel Offers 50GB Data, Unlimited Calls With Rs. 999 Postpaid Plan Read more News At Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot