జియోకు పోటీగా ఎయిర్‌‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్

Posted By: BOMMU SIVANJANEYULU

ఎయిర్‌టెల్, జియో నెట్‌వర్క్‌ల మధ్య నడుస్తోన్న టెలికామ్ వార్ ఇప్పుడప్పుడే తగ్గేటట్టు కనిపించటం లేదు. నిన్న మొన్నటి వరకు మొబైల్ నెట్‌వర్క్ సెగ్మెంట్‌లో పోటీపడిన ఈ ఆపరేటర్స్ తాజాగా తమ ఫోకస్‌ను బ్రాండ్‌బ్యాండ్ సెక్టార్‌కు షిఫ్ట్ చేసాయి.

జియోకు పోటీగా ఎయిర్‌‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇప్పటికే జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను విజయవంతంగా పరీక్షించి అఫీషియల్ లాంచింగ్‌కు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ తన బ్రాండ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌కు సంబంధించి సరికొత్త ఆఫర్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది.

ఈ ఆఫర్‌లో భాగంగా ఎయిర్‌టెల్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను కలిగి ఉన్న పోస్ట్‌పెయిడ్ యూజర్లకు 5 జీబి అదనపు డేటా లభిస్తుంది. ఈ సరికొత్త ఆఫర్‌ను మైహోమ్ రివార్డ్స్ ప్రోగ్రామ్ క్రింద ఎయిర్‌టెల్ లాంచ్ చేసింది. టెలికం సర్కిల్‌ను బట్టి ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎయిర్‌టెల్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ అకౌంట్‌తో లింక్ అయి ఉన్న ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌లకు మాత్రమే ఈ 5జీబి డేటా ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ ఎలా వర్తిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం...

ఎయిర్‌టెల్ పోస్ట్ పెయిడ్ యూజర్ తన అవసరానికి అనుగుణంగా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకోవల్సి ఉటుంది. ప్లాన్ తీసుకున్న వెంటనే యూజర్‌కు సంబంధించిన మైఎయిర్‌టెల్ యాప్‌ అకౌంట్‌లో 5జీబి డేటా యాడ్ అవుతుంది. డేటా క్రెడిట్ అయిన వెంటనే యూజర్‌కు నోటిఫికేషన్ లేదా ఓ టెక్స్ట్ మెసేజ్ అందుతుంది. ఈ డేటాను క్లెయిమ్ చేసుకోవాలంటే మైఎయిర్‌టెల్ యాప్‌లోని మైహోమ్ ట్యాబ్ సెక్షన్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది.

హైదరాబాద్‌లో మరో ఐటీ క్లస్టర్, త్వరలో లక్షన్నర కొత్త ఉద్యోగాలు

బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్ బ్రాడ్ బ్యాండ్‌లకు పోటీగా జియో త్వరలో లాంచ్ చేయబోతున్న బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ప్లాన్స్ సర్వత్రా ఉత్కంఠకు తెరలేపుతున్నాయి. జియో తన బ్రాడ్‌బ్యాండ్ సేవలను Jio Fiber Broadband సర్వీసెస్ పేరుతో త్వరలో లాంచ్ చేయనుంది. తాజాగా అందుతోన్న సనమచారం ప్రకారం జియో ఫైబర్ నెట్ మొత్తం మూడు రకాల ప్లాన్‌లలో లభ్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అవి సిల్వర్, గోల్డ్, ప్లాటినమ్. ఈ మూడు రకాల ప్లాన్లలో ఎవరికి నచ్చినట్టు వారు వేసుకోవచ్చు. జియో ఫైబర్, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల స్పెషల్ ఆఫర్ ప్లాన్‌లు ఈ విధంగా ఉండొచ్చని తెలుస్తోంది.

రూ.500 చెల్లిస్తే 600జీబి ఇంటర్నెట్‌ను 15 ఎంబీపీఎస్ వేగంతో 30 రోజుల పాటు వాడుకునే అవకాశం ఉంటుంది. రూ.1000 చెల్లిస్తే 500 జీబి ఇంటర్నెట్‌ను 25 ఎంబీపీఎస్ వేగంతో 30 రోజుల పాటు వాడుకునే అవకాశం ఉంటుంది. రూ.500 చెల్లిస్తే రోజుకు 3.5జీబి ఇంటర్నెట్‌ను 30 రోజుల పాటు వాడుకునే అవకాశం ఉంటుంది. రూ.500 చెల్లిస్తే 25 ఎంబీపీఎస్ వేగంతో కూడిన ఇంటర్నెట్‌ను 30 రోజుల పాటు వాడుకునే అవకాశం ఉంటుంది. రూ.800 చెల్లిస్తే 30 రోజుల పాటు అపరిమితంగా ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు.

English summary
Mukesh Amabani headed RIL is testing JioFiber and is expected to launch it soon. Although there's no confirmed timeline as of yet. Meanwhile, Airtel is leaving no stone unturned to counter the upcoming JioFiber. Airtel on Friday announces to offer 5GB of additional data postpaid subscribers with Airtel home broadband connection.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot