Airtel యూజ‌ర్ల‌కు బంప‌రాఫ‌ర్‌: ఆ యాప్ డౌన్‌లోడ్‌తో 5జీబీ డేటా ఫ్రీ!

|

భారత మార్కెట్లో రెండవ అతిపెద్ద టెలికాం ప్లేయర్ అయిన భారతీ Airtel క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి అనేక ప్ర‌య‌త్నాలు చేస్తుంది. అందులో భాగంగా కంపెనీ ఇప్పుడు తన ప్రీపెయిడ్ కస్టమర్లకు 5GB డేటాను ఉచితంగా అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే, వినియోగ‌దారులు ఈ ఆఫ‌ర్‌ను పొంద‌డానికి Airtel థాంక్స్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ డేటా ఆఫ‌ర్‌ను పొంద‌డానికి అర్హ‌త సాధిస్తారు.

Airtel

కొత్త ప్రీపెయిడ్ కస్టమర్లు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ డౌన్‌లోడ్ చేసేందుకు అమ‌లు చేసిన ఆఫ‌ర్ అని తెలుస్తోంది. అయితే, ఈ 5GB డేటా ఆఫ‌ర్ ఏకమొత్తంలో వినియోగదారులకు అందించబడదని గ‌మ‌నించాలి. ఇది ఒక్కొక్కటి 1GB చొప్పున Airtel థాంక్స్ యాప్‌లో ఐదు కూపన్‌లుగా క్రెడిట్ చేయబడుతుంది. ఈ ఆఫ‌ర్ గురించి పూర్తి వివ‌రాల కోసం పూర్తిగా చ‌ద‌వండి.

Airtel థాంక్స్ యాప్ ద్వారా 5GB ఉచిత డేటా వోచర్ ఆఫర్:
భారతీ ఎయిర్‌టెల్ యొక్క కొత్త ప్రీపెయిడ్ సిమ్ కొనుగోలు చేసే కస్టమర్‌లకు భారతీ ఎయిర్‌టెల్ 5GB ఉచిత డేటాను అందిస్తుంది. ఈ ఆఫ‌ర్ పొంద‌డానికి ముందుగా, కొత్త Airtel కనెక్షన్‌ని తీసుకుని ఉండాలి. అనంత‌రం Airtel థాంక్స్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసి, మీ Airtel నంబర్‌తో రిజిస్ట‌ర్ చేసుకుని యాప్ లాగిన్ చేయండి. ఆ త‌ర్వాత, యాప్‌లోని My Coupons విభాగానికి వెళ్లి, ఉచిత డేటా కూపన్‌లను క్లెయిమ్ చేయండి.

Airtel

యాప్‌లోని కొత్త నంబర్‌తో లాగిన్ అయిన తర్వాత ప్రతి కొత్త వినియోగదారు కంపెనీ నుండి 1GB చొప్పున 5 కూపన్‌లను పొందడానికి అర్హులు అని Airtel తెలిపింది. వినియోగదారులు తప్పనిసరిగా 90 రోజులలోపు డేటా వోచర్‌లను క్లెయిమ్ చేయాలి లేదంటే వాటి గడువు ముగుస్తుంది. కొత్త ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ డౌన్‌లోడ్ చేసేందుకు అమ‌లు చేసిన ఆఫ‌ర్ అని తెలుస్తోంది.

అదేవిధంగా, Airtel వినియోగదారులు ప్రతి రిఫరల్‌పై కూడా రూ.100 సంపాదించవచ్చు. Airtel థాంక్స్ యాప్‌కి వెళ్లి, వినియోగ‌దారులు త‌మ స్నేహితుడికి ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ సిమ్ కొనుగోలు కోసం రిఫరల్ లింక్‌ను పంపవచ్చు. కొత్త ఎయిర్‌టెల్ సిమ్‌ని కొనుగోలు చేయడానికి యూజ‌ర్ యొక్క స్నేహితుడు రిఫరల్ లింక్ క్లిక్ చేస్తే, వినియోగదారుడు మరియు స్నేహితుడు ఇద్దరూ భారతీ ఎయిర్‌టెల్ నుండి రూ.100 విలువైన తగ్గింపు కూపన్‌లను పొందుతారు. ఈ రూ.100 కూప‌న్లు Airtel థాంక్స్ యాప్ నుండి ఏదైనా స‌ర్వీసుల్ని వినియోగించుకునే స‌మ‌యంలో ఉప‌యోగించుకోవ‌చ్చు.

Airtel

అదేవిధంగా, Airtel యూజ‌ర్లు కాల‌ర్ ట్యూన్ సెట్ చేసుకునే ప్ర‌క్రియ‌ను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం:
* ముందుగా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి 'Wynk Music' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* ఆ త‌ర్వాత యాప్ ఓపెన్ చేసి Home Page ట్యాబ్ ను ఎంపిక చేసుకోవాలి.
* అనంత‌రం సెర్చ్ బాక్స్‌లో మీకు న‌చ్చిన పాట‌ను సెర్చ్ చేయాలి. మీకు న‌చ్చిన పాట వ‌చ్చిన త‌ర్వాత దానిపై హ‌లో ట్యూన్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. దాన్ని ఎంపిక చేసుకోవాలి.
* అనంత‌రం మీరు ప్రివ్యూ విన‌డానికి అవ‌కాశం ల‌భిస్తుంది. ఆ త‌ర్వాత ప్రివ్యూలో మీకు న‌చ్చిన ట్యూన్‌ను ఎంపిక చేసుకోవాలి.
* ఆ ట్యూన్ మీకు న‌చ్చిన‌ట్ల‌యితే.. అక్క‌డే సెట్ కాల‌ర్ ట్యూన్‌ అనే ఆప్ష‌న్ ఉంటుంది. దానిని ఎంపిక చేసుకుని నిర్దారించాలి.
* ఇది విజ‌య‌వంతంగా పూర్త‌యిన త‌ర్వాత మీకు ఎయిర్‌టెల్ ట్యూన్ విజ‌య‌వంతంగా సెట్ అయిన‌ట్లు మెసేజ్ వ‌స్తుంది.
* ఈ ప్ర‌క్రియ‌ను ఫాలో అవ‌డం ద్వారా ఎయిర్‌టెల్ కాల‌ర్ ట్యూన్ సెట‌ప్ విజ‌య‌వంత‌మ‌వుతుంది.
* మెసేజ్ వ‌చ్చిన కాసేప‌టి త‌ర్వాత మీ నంబ‌ర్‌కు ట్యూన్ సెట్ అయిందా లేదా అనేది నిర్ధారించుకోవ‌డానికి వేరే నంబ‌ర్ నుంచి మీ నంబ‌ర్‌కు కాల్ చేసి త‌నిఖీ చేసుకోవ‌చ్చు.

Best Mobiles in India

English summary
Airtel offers 5GB free data for their users, who installs airtel thanks app.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X