ఎయిర్‌టెల్ యూజర్లకు 60జీబి ఉచిత డేటా
ఫోన్‌లో Airtel TV appను ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు..
భారతీ ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ ఖతాదారుల కోసం సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్ క్రింద 60జీబి ఉచిత డేటా లభిస్తుంది. ఈ ఉచిత డేటా ఆఫర్‌ను పొందాలనుకునే వారు ముందుగా తమ ఫోన్‌లో Airtel TV appను ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.

ఈ 60 జీబి డేటాను నెలకు 10 జీబి చొప్పున 6 నెలల పాటు ఎయిర్‌టెల్ అందిస్తుంది. గతంలో ఈ ఆఫర్ క్రింద 30జీబి డేటా మాత్రమే లభించేది. ఈ డేటాను నెలకు 10 జీబి చొప్పున 3 నెలల పాటు ఎయిర్ టెల్ అందించేది.

ఈ ఆఫర్‌ను సద్వినియోం చేసుకోవాలనుకునే ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ యూజర్లు ముందుగా MyAirtel appలోకి వెళ్లవల్సి ఉంటుంది. అక్కడ వారికి Airtel TV appను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఎయిర్‌టెల్ టీవీ యాప్ ద్వారా యూజర్లు లైవ్ టీవీతో పాటు Eros Now, HOOQ, Sony LIV, YouTube, Dailymotion వంటి ఆన్ ద డిమాండ్ వీడియో ఛానల్స్‌కు సంబంధించిన కంటెంట్‌ను స్ట్రీమ్‌ను చేసుకునే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications