730GB డేటా, Unlimited 5G డేటా మరియు OTT ప్రయోజనాలతో Airtel ప్లాన్! వివరాలు
భారతదేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్లలో ఒకటైన భారతి ఎయిర్‌టెల్ అద్భుతమైన ప్రయోజనాలతో ప్రీపెయిడ్ ప్లాన్‌ను కలిగి ఉంది. దీనితో వినియోగదారులు 730GB మొత్తం డేటా, అపరిమిత 5G డేటా మరియు OTT (ఓవర్-ది-టాప్) ప్రయోజనాలను పొందుతారు. ఇప్పుడు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
ఈ ప్లాన్ మీకు మంచి డీల్ అవుతుందా? కాదా? అని తెలుసుకుందాం. భారతీ ఎయిర్‌టెల్ యొక్క 5G నెట్‌వర్క్ ఇప్పుడు దాదాపు భారతదేశం అంతటా అందుబాటులో ఉంది. దేశంలో ఎక్కడున్నా వినియోగదారులకు హై-స్పీడ్ నెట్‌వర్క్‌లు అందుబాటులో ఉండేలా సుదూర ప్రాంతాలలో 4Gని అందుబాటులోకి తీసుకురావడంపై కూడా టెల్కో దృష్టి సారించింది.

అందుకే, మేము ఇక్కడ మాట్లాడుతున్న ఈ ప్లాన్ మంచి డీల్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇది మీ SIMని ఎక్కువ కాలం యాక్టివ్‌గా ఉంచుతుంది మరియు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మీ కమ్యూనికేషన్‌లను సాఫీగా చేసుకునేందుకు అనేక ప్రయోజనాలను మీకు అందిస్తుంది. మేము ఇక్కడ మాట్లాడుతున్న ప్లాన్ ధర రూ. 3599 గా ఉంది.
భారతీ ఎయిర్‌టెల్ రూ. 3599 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాల వివరాలు
ధర రూ.3599 ప్లాన్ భారతి ఎయిర్‌టెల్ నుండి అందుబాటులో ఉన్న రెండవ అత్యంత ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ ఎల్లప్పుడూ ప్రయాణంలో ఉండే మరియు హై-స్పీడ్ నెట్‌వర్క్‌లకు కనెక్ట్ అయి ఉండాల్సిన భారీ మొబైల్ డేటా వినియోగదారులకు అనువైనది.
ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, 100 SMS/రోజు మరియు 2GB రోజువారీ డేటాతో సహా ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ సేవ చెల్లుబాటు 365 రోజులు కాబట్టి, వినియోగదారులు మొత్తం 730GB డేటాను పొందుతారు.
దీనికి అదనంగా, వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ల ద్వారా లాగిన్ చేయడం ద్వారా ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ నుండి unlimited 5G డేటా ఆఫర్‌ను కూడా క్లెయిమ్ చేయవచ్చు. ఆపై, ప్లాన్‌తో కూడిన OTT ప్రయోజనాలు కూడా ఉన్నాయి. OTT ప్రయోజనాలు Airtel Xstream Play సబ్‌స్క్రిప్షన్ కింద బండిల్ చేయబడ్డాయి.
Airtel Xstream Play తో, వినియోగదారులు ఒకే లాగిన్‌తో అనేక OTT ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్‌కు యాక్సిస్ ని పొందుతారు. వినియోగదారులు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ నుండి కూడా ఈ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు మరియు ప్రయాణంలో కంటెంట్‌ని చూడటానికి వారి మొబైల్‌లో Xstream Play యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇంకా, ఎయిర్‌టెల్ దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటి మరియు ఇప్పుడు కంపెనీ తన ప్రీపెయిడ్ ప్లాన్‌లలో కొన్నిప్లాన్ల తో పాటు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్‌ను అందిస్తోంది. అవి, రూ. 239, రూ. 399 మరియు రూ. 969 ప్రీపెయిడ్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకునే ఎయిర్‌టెల్ వినియోగదారులు ఈ ప్రయోజనాలను పొందవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియా ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








