ఉచితంగా అమెజాన్ పే గిఫ్ట్ కార్డును పొందడం ఎలా ?

దేశీయ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తన కస్టమర్లందరికీ ఉచితంగా అమెజాన్ పే గిఫ్ట్ కార్డులను అందిస్తున్నది.

|

దేశీయ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తన కస్టమర్లందరికీ ఉచితంగా అమెజాన్ పే గిఫ్ట్ కార్డులను అందిస్తున్నది. పోస్ట్‌పెయిడ్‌, ప్రీపెయిడ్‌ కస‍్టమర్లందరికీ 51 రూపాయల విలువైన అమెజాన్ పే డిజిటల్ గిఫ్టు కార్డును ఆఫర్‌ చేస్తోంది. దీని ద్వారా మొబైల్ రీచార్జ్‌లు, బిల్లు చెల్లింపులు లేదా అమెజాన్ ప్లాట్‌ఫాంలో షాపింగ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఎయిర్‌టెల్ తన 23వ వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా తన కస్టమర్లందరికీ ఈ బంపర్ ఆఫర్‌ను అందిస్తున్నది. ఆఫర్ పూర్తి వివరాలు, ఎలా పొందాలనే దానిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

5 నిమిషాలకే ఎర్రర్ మెసేజ్, జియో కొత్త అప్‌డేట్ ఏంటీ ?5 నిమిషాలకే ఎర్రర్ మెసేజ్, జియో కొత్త అప్‌డేట్ ఏంటీ ?

కస్టమర్లు ఏం చేయాలంటే..

కస్టమర్లు ఏం చేయాలంటే..

ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై మై ఎయిర్‌టెల్ యాప్ ఓపెన్ చేసి అందులో హోమ్ పేజీలో ఉండే ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బ్యానర్‌పై క్లిక్ చేయాలి.

 మీ ఫోన్ నంబర్‌ను

మీ ఫోన్ నంబర్‌ను

అనంతరం మీ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. తరువాత వచ్చే ఓటీపీని కన్‌ఫాం చేయాలి. దీంతో 15 డిజిట్లు ఉన్న వోచర్ కోడ్ కస్టమర్‌కు లభిస్తుంది.

అక్టోబర్ 31వ తేదీ లోపు

అక్టోబర్ 31వ తేదీ లోపు

ఈ కోడ్‌ను అక్టోబర్ 31వ తేదీ లోపు అమెజాన్ పే అకౌంట్‌లో యాడ్ చేసి ఉపయోగించుకోవాలి.

అమెజాన్ పే అకౌంట్‌లో..

అమెజాన్ పే అకౌంట్‌లో..

అమెజాన్ పే అకౌంట్‌లో ఎలా ఉపయోగించుకోవాలి.
అమెజాన్‌ పేలో యాడ్‌ గిఫ్ట్‌కార్డ్‌ మీద క్లిక్‌ చేయాలి. అక్కడ వోచర్‌ కోడ్‌ ఎంటర్‌ చేసి, యాడ్‌ నౌ అని క్లిక్‌ చేస్తే మీ బాలెన్స్‌ యాడ్‌ అయినట్లు డిస్‌ప్లేలో కనిపిస్తుంది.

రూ.51 విలువైన అమెజాన్ పే వాలెట్..

రూ.51 విలువైన అమెజాన్ పే వాలెట్..

దీంతో కస్టమర్‌కు రూ.51 విలువైన అమెజాన్ పే వాలెట్ బ్యాలెన్స్ లభిస్తుంది. దాన్ని అమెజాన్‌లో వస్తువులు కొనేందుకు లేదా రీచార్జి చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు.

ఈ కస్టమర్లు మాత్రమే

ఈ కస్టమర్లు మాత్రమే

ఎయిర్‌టెల్‌లో రూ.100 ఆపైన విలువైన బండిల్డ్ ప్రీపెయిడ్ ప్యాక్‌ను లేదా పోస్ట్‌పెయిడ్ ఇన్ఫినిటీ ప్లాన్‌ను వాడే కస్టమర్లు మాత్రమే ఈ ఆఫర్‌ను పొందగలుగుతారు.

అమెజాన్ పేతో భాగస్వామి కావడం..

అమెజాన్ పేతో భాగస్వామి కావడం..

వార్షికోత్సవ వేడుకల్లో వినియోగదారుల సంతోష పెట్టడానికి అమెజాన్ పేతో భాగస్వామి కావడం ఆనందదాయకమని, వినియోగదారుల్లో స్మార్ట్‌ఫోన్లు ఆన్లైన్ షాపింగ్ చాలా ప్రజాదరణ పొందిందని ఎయిర్‌టెల్‌ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వాణి వెంకటేష్ పేర్కొన్నారు.

అమెజాన్ పే ఇండియా

అమెజాన్ పే ఇండియా

అలాగే ఈ వేడుకలో ఎయిర్‌టెల్‌తో భాగస్వాములైనందుకు సంతోషిస్తున్నామని అమెజాన్ పే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ షారుఖ్ ప్లాస్టిక్‌వాలా తెలిపారు.

Best Mobiles in India

English summary
Airtel offers Amazon Pay gift card to postpaid, prepaid users More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X