Home
News

Airtel లో అతి త‌క్కువ ధ‌ర క‌లిగిన బెస్ట్ ప్లాన్స్ ఇవే.. ఇది చ‌ద‌వండి!

Airtel కంపెనీ భార‌త దేశంలో రెండో అతిపెద్ద టెలికాం నెట్‌వ‌ర్క్‌గా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, బ‌డ్జెట్ ధ‌ర‌ల్లో ఉండే ప్లాన్ల కోసం చూస్తున్న వినియోగదారుల కోసం భారతి ఎయిర్‌టెల్ అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉంది. జియో మరియు BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) నుండి అందుబాటులో ఉన్న ప్లాన్‌లను పోల్చినట్లయితే, ఎయిర్‌టెల్ ప్లాన్‌లు కొంచెం ఖరీదైనవిగా కనిపిస్తాయి. కానీ, అంతే స్థాయిలో నాణ్య‌త‌తో కూడిన ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తాయి.

Airtel

మీరు భారతీ ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో ఉండాలనుకుంటే, మీ కోసం ఇక్కడ కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లు బ‌డ్జెట్ ధ‌ర‌ల్లో అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్ దేశవ్యాప్తంగా నాణ్యమైన సేవ మరియు 4G నెట్‌వర్క్‌ల ఉనికి కారణంగా భారతదేశంలోని అగ్ర టెలికాం ఆపరేటర్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇప్పుడు ఆ బ‌డ్జెట్ ప్లాన్ల గురించి ఓ సారి తెలుసుకుందాం. మీరు కూడా ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ అయి ఉండి బడ్జెట్ ప్లాన్ కోసం చూస్తున్న‌ట్ల‌యితే ఇది పూర్తిగా చ‌ద‌వండి.

Airtel రూ.99 ప్లాన్‌:

Airtel రూ.99 ప్లాన్‌:

భారతీ ఎయిర్‌టెల్ నుండి రూ.99 ప్లాన్ స్మార్ట్ రీఛార్జ్ విభాగంలోకి వస్తాయి. ఈ ప్లాన్‌ 200MB డేటా మరియు రూ.99 విలువైన టాక్ టైమ్‌ను అందిస్తాయి. కాల్‌లకు సెకనుకు 2.5 పైసలు వసూలు చేస్తారు. 28 రోజులు సర్వీస్ వాలిడిటీతో వస్తాయి. అన్ని ప్లాన్‌లు కూడా నామమాత్రపు ఖర్చులతో SMSలు పంపడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

Airtel రూ.109 ప్లాన్‌:

Airtel రూ.109 ప్లాన్‌:

ఎయిర్‌టెల్ నుంచి ఇదురవ‌ర‌కే ఉన్న రూ.99 ప్లాన్‌తో పోలిస్తే రూ.109 ప్లాన్ ఎక్కువ వ్యాలిడిటీని, ఎక్కువ డేటా బెనిఫిట్స్‌ను క‌ల్పిస్తుంది. ఈ రూ.109 రీఛార్జ్ ప్లాన్ ద్వారా ఎయిర్‌టెల్‌ 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న యూజ‌ర్ల‌కు 200MB డేటాను అందిస్తోంది. అంతేకాకుండా రూ.99 టాక్‌టైం ను కూడా అందిస్తోంది. వాయిస్ కాల్స్ కు ఒక సెక‌నుకు 2.5 పైసా ప‌డుతుంది. లోక‌ల్ ఎస్ఎంఎస్‌కు రూ.1, మ‌రియు ఎస్‌టీడీ ఎస్ఎంఎస్‌కు రూ.1.44 ప‌డుతుంద‌ని కంపెనీ పేర్కొంది.

Airtel రూ.111 ప్లాన్‌:

Airtel రూ.111 ప్లాన్‌:

ఈ రూ.111 రీఛార్జ్ ప్లాన్ ద్వారా సేమ్ రూ.109 ప్లాన్‌తో పొందే బెనిఫిట్స్ కంపెనీ అందిస్తోంది. Airtel ఈ ప్లాన్ రీఛార్జ్ ద్వారా 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న యూజ‌ర్ల‌కు 200MB డేటాను అందిస్తోంది. అంతేకాకుండా రూ.99 టాక్‌టైం ను కూడా అందిస్తోంది. వాయిస్ కాల్స్ కు ఒక సెక‌నుకు 2.5 పైసా ప‌డుతుంది.

Airtel రూ.155 ప్లాన్:

Airtel రూ.155 ప్లాన్:

భారతీ ఎయిర్‌టెల్ నుండి రూ.155 ప్రీపెయిడ్ ప్లాన్ 1GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 300 SMS ప్ర‌యోజ‌నాల‌ను క‌ల్పిస్తుంది. దీని వ్యాలిడిటీ కాస్త త‌క్కువ రోజులు ఉంటుంది. ఈ ప్లాన్ 24 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. Wynk సంగీతం మరియు ఉచిత Hellotunes సహా అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి, వినియోగదారులు Airtel థాంక్స్ యాప్‌కి వెళ్లాలి.

Airtel రూ.179 ప్లాన్:

Airtel రూ.179 ప్లాన్:

భారతీ ఎయిర్‌టెల్ నుండి రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం 2GB డేటాతో వస్తుంది మరియు 28 రోజుల చెల్లుబాటును కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 300 SMSలను కూడా అందిస్తుంది. ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలు కూడా దీనితో చేర్చబడ్డాయి. వాటిని క్లెయిమ్ చేసుకోవ‌డానికి, యాప్‌కి వెళ్లి, మీ రిజిస్టర్డ్ నంబర్ ద్వారా సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది.

Airtel రూ.209 ప్లాన్:

Airtel రూ.209 ప్లాన్:

భారతీ ఎయిర్‌టెల్ నుండి బ‌డ్జెట్ ధ‌ర‌లో అందుబాటులో ఉన్న మ‌రో ముఖ్య‌మైన ప్లాన్ రూ.209 ప్రీపెయిడ్ ప్లాన్. ఇది వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్, 100 SMS/రోజు మరియు 1GB రోజువారీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ మొత్తం 21 రోజుల వాలిడిటీని కలిగి ఉంటుంది. అంటే ఈ ప్లాన్‌తో అందించే మొత్తం డేటా 21GB గా ఉంటుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు Airtel థాంక్స్ ప్రయోజనాలను కూడా పొందుతారు.

Best Mobiles in India

English summary
Airtel offers best budget prepaid plans to their users. take a look on them
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X