Home
News

సడన్‌గా డేటా అయిపోయిందా.. రూ.100 కంటే తక్కువ ధరలో డేటా ప్లాన్‌లు మీకోసం..!

భారత టెలికాం రంగంలో యూజర్ల పరంగా ఎయిర్‌టెల్ (Airtel) రెండో స్థానంలో ఉంది. గత సంవత్సరం టారిఫ్‌ల పెంపు అనంతరం అనేక మంది యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లకు పోర్టింగ్‌ అయినా.. తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. భారీ సంఖ్యలో ఉన్న తమ యూజర్ల కోసం ఎయిర్‌టెల్‌ ప్రస్తుతం అనేక రీఛార్జ్‌ ప్లాన్‌లు కలిగి ఉంది. అయితే ప్రత్యేకంగా డేటా కోసం కూడా రీఛార్జ్‌ ప్లాన్‌లు ఉన్నాయి.

అయితే ఇటీవల వచ్చిన సమాచారం ఆధారంగా ఈ సంవత్సరం చివర్లో 10-12 శాతం రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏయే ప్లాన్‌లపై ధరలు పెంపు ఉంటుందో వెల్లడి కాలేదు. అయితే బేస్‌ ప్లాన్‌లు మినహా ఇతర ప్లాన్ల ధరలు పెరిగే అవకాశం ఉంది.

Airtel offers best data recharge packs under RS100  telugu news

ప్రస్తుతం ఎయిర్‌టెల్‌లో అనేక డేటా ప్లాన్‌లు (Airtel Data Packs) ఉన్నాయి. ఇందులో కేవలం రూ.11 ధరకే అన్‌లిమిటెడ్‌ డేటాను ఉపయోగించుకొనేందుకు అవకాశం ఉంది. అయితే ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ కేవలం గంట మాత్రమే. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఈ ప్లాన్‌ ఉపయోగపడుతుంది.

రూ.22 ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs22 Data Pack) భాగంగా ఎయిర్‌టెల్‌ యూజర్లు 1GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 1 రోజుగా ఉంది. ఈ ప్లాన్‌లో ఎటువంటి కాలింగ్‌, SMS ప్రయోజనాలు ఉండవని యూజర్లు గమనించాలి. వాట్సాప్‌ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో చాట్‌ చేసేందుకు ఒక్కరోజు వ్యాలిడిటీతో ఈ డేటా సరిపోతుంది.

రూ.26 ప్లాన్‌ :
ఈ డేటా ప్లాన్‌లో (Airtel Rs26 Data Pack) భాగంగా యూజర్లు 1.5GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ డేటాను ఒక్క రోజులో వినియోగించుకోవాల్సి ఉంటుంది. డేటా మినహా కాలింగ్‌, SMS ‌ప్రయోజనాలను పొందలేరు. అత్యవసర సమయాల్లో చాటింగ్‌, బ్రౌజింగ్‌ కోసం ఈ డేటాను ఉపయోగించుకోవచ్చు.

Airtel offers best data recharge packs under RS100  telugu news

రూ.33 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ డేటా ప్లాన్‌లో (Airtel Rs33 Data Pack) భాగంగా ఎయిర్‌టెల్‌ యూజర్లు 2GB 4G డేటాను పొందుతారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఒక రోజుగా ఉంది.

రూ.49 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs49 Data Pack) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ 4G డేటాను పొందుతారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 1 రోజుగా ఉంది. ఈ ప్లాన్‌లో డేటా మినహా ఇతర ప్రయోజనాలను అందించడం లేదు.

రూ.77 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs77 Data Pack) భాగంగా యూజర్లు 5GB 4G డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 7 రోజులుగా ఉంది. కాలింగ్‌, SMS ప్రయోజనాలను అందించడం లేదు. ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు చాటింగ్‌, బ్రౌజింగ్ వంటి అవసరాలు మాత్రమే ఉంటే ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది.

Take a Poll

రూ.99 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Airtel Rs99 Data Pack) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ 4G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 2 రోజులుగా ఉంటుంది. ఈ ప్లాన్‌లో డేటా మినహా కాలింగ్, SMS వంటి ఎటువంటి అదనపు ప్రయోజనాలను అందించడం లేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel offers best data recharge packs under RS100 here is the list and benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X