Home
News

IPL 2021 ఫోన్‌లో ఉచితంగా చూడడానికి డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఎయిర్‌టెల్ ప్లాన్‌లు

ఇండియాలోని టెలికాం రంగంలో గల రెండవ అతి పెద్ద సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన యొక్క వినియోగదారుల కోసం అద్భుతమైన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మరియు ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) యొక్క సెకండ్ ఫేజ్ చూడాలని కొరికి ఉన్నవారికి గొప్ప అవకాశం అందిస్తున్నది. మీ స్మార్ట్‌ఫోన్‌లో నేరుగా IPL ఆన్‌లైన్‌లో చూడటానికి మీకు డిస్నీ+ హాట్‌స్టార్‌కు సబ్‌స్క్రిప్షన్ అవసరం. మీరు డిస్నీ+ హాట్‌స్టార్ యొక్క స్వతంత్ర చందాను కొనుగోలు చేయవచ్చు లేదా వినియోగదారులకు ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ అందించే ప్లాన్‌ను మీరు భారతి ఎయిర్‌టెల్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఐపిఎల్ 2021 ను ఉచితంగా చూడాలనుకునే వారికి భారతీ ఎయిర్‌టెల్ అందించే మెరుగైన ఒప్పందాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

IPL 2021 కోసం భారతీ ఎయిర్‌టెల్ ప్లాన్‌లు

IPL 2021 కోసం భారతీ ఎయిర్‌టెల్ ప్లాన్‌లు

భారతీ ఎయిర్‌టెల్ యొక్క మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లు డిస్నీ+ హాట్‌స్టార్ ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌లు రూ.499, రూ.699 మరియు రూ.2,798 ధరల వద్ద లభిస్తాయి. ఇందులో రూ.499 ప్లాన్ 3GB రోజువారీ డేటాను 28 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. అయితే రూ.699 మరియు రూ.2,798 ప్లాన్‌లు రెండూ వినియోగదారులకు 2GB రోజువారీ డేటాను వరుసగా 56 రోజులు మరియు 365 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తాయి. ఈ ప్లాన్‌లన్నీ కస్టమర్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు, 100 SMS/రోజు మరియు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తాయి. అంతేకాకుండా ఎయిర్‌టెల్ థాంక్స్ వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్‌లు ఐపిఎల్ 2021 రెండవ దశను చూడటానికి మీకు సహాయపడతాయి. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్ యొక్క స్వతంత్ర చందా ధర సంవత్సరానికి రూ.499 అని గమనించండి.

IPL 2021 కోసం భారతీ ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

IPL 2021 కోసం భారతీ ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

భారతీ ఎయిర్‌టెల్ డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్-ఓన్లీ ప్లాన్‌కి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ని అందిస్తుంది. దాని పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లన్నీ నెలకు రూ.499 మరియు అంతకంటే ఎక్కువ నుండి ప్రారంభమవుతాయి. విభిన్న డేటా ప్రయోజనాలతో అనేక ప్రణాళికలు ఉన్నాయి. ఇవి అన్ని కూడా ఇతర OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత సభ్యత్వాన్ని కూడా కలిగి ఉంటాయి. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌కి వెళ్లడం ద్వారా మీరు వాటిని తనిఖీ చేయవచ్చు.

IPL 2021 కోసం భారతీ ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

IPL 2021 కోసం భారతీ ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

భారతీ ఎయిర్‌టెల్ కంపెనీ యొక్క బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో నెలకు రూ.999 మరియు అంతకంటే ఎక్కువ ధర వద్ద లభించే ప్లాన్‌లు అన్ని కూడా డిస్నీ+ హాట్‌స్టార్ సూపర్ ప్లాన్ (సంవత్సరానికి రూ.899) ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో వస్తాయి. ఈ ప్లాన్‌లు అన్ని కూడా 1 Gbps వరకు డౌన్‌లోడ్ వేగం మరియు ఇతర ప్రయోజనాలను అందించే బహుళ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ఉన్నాయి.

భారతీ ఎయిర్‌టెల్ రూ .599 ప్లాన్

భారతీ ఎయిర్‌టెల్ రూ .599 ప్లాన్

భారతీ ఎయిర్‌టెల్ అందించే రూ.599 ప్లాన్ యొక్క ఆఫర్‌ల విషయానికి వస్తే ఇది వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS లు మరియు 2GB రోజువారీ డేటా ప్రయోజనాలను 56 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. దీనికి అదనంగా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఒక నెల ట్రయల్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్, ఫ్రీ హెలోట్యూన్స్, ఒక సంవత్సరం షా అకాడమీ కోర్సు మరియు డిస్నీ+ హాట్ స్టార్ VIP యొక్క ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలు ఉన్నాయి. వీటితో పాటుగా అదనంగా FASTag లావాదేవీలపై రూ.100 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.401 డేటా ప్యాక్ బెనిఫిట్స్

ఎయిర్‌టెల్ రూ.401 డేటా ప్యాక్ బెనిఫిట్స్

భారతి ఎయిర్‌టెల్ టెల్కో తన కస్టమర్లకు చివరగా అందిస్తున్న డేటా ప్యాక్ రూ.401 ధర వద్ద లభిస్తుంది. ఇది రూ.399 విలువైన డిస్నీ + హాట్స్టార్ విఐపి చందాను ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా లభిస్తుంది. ఇది మీ ప్రస్తుత ప్లాన్‌తో పాటు 28 రోజుల చెల్లుబాటు కాలంలో ఉపయోగించగలగడానికి 30GB డేటాను కూడా అందిస్తోంది.

Best Mobiles in India

English summary
Airtel Offers Disney + Hotstar Free Subscription to Watch IPL 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X