వరద బాధితులకు ఎయిర్‌టెల్ గుడ్‌న్యూస్.. ఉచితంగా రోజుకు 1.5GB డేటా, అన్‌లిమిడెట్ కాలింగ్ సదుపాయం..!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక మంది ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. లక్షలాది మంది ప్రజలు ముంపునకు గురయ్యారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో నిమగ్నమై ఉంది. NDRF ఇతర సిబ్బంది హెలికాఫ్టర్‌లు, డ్రోన్‌ల ద్వారా ఆహారం అందిస్తున్నారు. NDRF సహా ఇతర బృందాలతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
బాధిత ప్రజలను ఆదుకొనేందుకు అనేక మంది ప్రముఖులు ముందుకొస్తున్నారు. బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందిస్తున్నారు. ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ (Airtel) వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు అన్‌లిమిడెట్ కాలింగ్, సహా డేటా ప్రయోజనాలను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటన చేసింది.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు రోజువారీ 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తున్నట్లు పేర్కొంది. వ్యాలిడిటీ పూర్తై.. రీఛార్జ్ చేసుకొనేందుకు అవకాశం లేని వినియోగదారులకు 4 రోజులపాటు ఈ ప్రయోజనాలు అందించనున్నట్లు ఎయిర్‌టెల్ ప్రకటనలో తెలిపింది.
ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ : వరద ప్రభావిత ప్రాంతాల్లోని వ్యాలిడిటీ పూర్తయిన ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు 7 రోజుల పాటు వ్యాలిడిటీని పెంచుతున్నట్లు తెలిపింది. వరద బాధితులకు టెలికాం సేవల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌టెల్ సంస్థ తెలిపింది.

ప్రీపెయిడ్ హోమ్స్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వరదల్లో చిక్కుకున్న వినియోగదారులకు నిరంతరాయ సేవల కోసం 4 రోజులపాటు సర్వీసులను పొడిగిస్తున్నట్లు ఎయిర్‌టెల్ పేర్కొంది. అదే విధంగా పోస్ట్‌పెయిడ్ హోమ్స్ వినియోగదారులకు కూడా 7 రోజుల పాటు సర్వీసులను పొడిగిస్తునట్లు తెలిపింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సహా ఇంధన కొరత కారణంగా టెలికాం సేవల్లో అంతరాయం తలెత్తకుండా తమ సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారని ఎయిర్‌టెల్ తన ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఉపసమనం కలిగించే దిశగా ఎయిర్‌టెల్ తమవంతు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
* ఎయిర్‌టెల్ ప్రస్తుతం 30 రోజుల వ్యాలిడిటీతో రూ.219 రీఛార్జ్ ప్లాన్‌ను కలిగి ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. మరియు ప్లాన్‌లో మొత్తంగా 3GB డేటాను పొందవచ్చు. వీటితోపాటు Wink మ్యూజిక్, హలో ట్యూన్స్‌ను కూడా వినియోగించుకోవచ్చు.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








