ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ అందించే రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా.. అయితే ఈ మూడు ప్లాన్‌లు మీకోసమే..!
Airtel Netflix Recharge Plans : భారత టెలికాం రంగంలో యూజర్ల పరంగా ఎయిర్‌టెల్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్ ను అందిస్తోంది. అయితే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తో కూడిన రీఛార్జ్ ప్లాన్ లు అనేకం ఉన్నాయి. ఈ ప్లాన్ లో కాలింగ్, డేటా, SMS వంటి ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ను అందించే ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ల వివరాలు మీకోసం.
* ఎయిర్‌టెల్ రూ.279 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లో ( Airtel Rs279 Recharge Plan ) భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ ను అందిస్తోంది. దీంతోపాటు జియోహాట్‌స్టార్ సూపర్ ప్లాన్ ను కూడా అందిస్తోంది. వీటితోపాటు Zee5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ను కూడా పొందవచ్చు.

ఈ ప్లాన్ లో భాగంగా ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. ఇందులో భాగంగా 20 కి పైగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లా్న్ లో మొత్తంగా 1GB 4G డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ నెలరోజులుగా ఉంది.
* రూ.598 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. రోజువారీ 2GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు 5G స్మార్ట్‌ఫోన్, 5G నెట్‌వర్క్ కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు.
ఈ ప్లాన్ లో ( Airtel Rs598 Recharge Plan ) నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. దీంతోపాటు జియోహాట్‌స్టార్, Zee5 సబ్‌స్క్రిప్షన్ ను ఉపయోగించుకోవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం ప్లాన్ ప్రయోజనాలను పొందవచ్చు.
ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లో భాగంగా పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్ ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఉచిత హలోట్యూన్స్ ను కూడా ఉచితంగా ఉపయోగించుకొనే అవకాశం ఉంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. అధిక డేటాతోపాటు ఓటీటీలు కావాల్సిన యూజర్లు ఈ ప్లాన్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.
* రూ.1729 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా పొందవచ్చు.
ఈ ప్లాన్ లో ( Airtel Rs1729 Recharge Plan ) నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లా్‌న్ సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. దీంతోపాటు జియోహాట్‌స్టార్ సూపర్ ప్లాన్, Zee5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. Xstream ప్లే ప్రీమియం ప్రయోజనాలను కూడా అందిస్తోంది.
వీటితోపాటు ఎయిర్‌టెల్ యూజర్లు పెర్‌ఫ్లిక్సిటీ ప్రో AI మోడల్ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. మరియు హలోట్యూన్స్ ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.


Click it and Unblock the Notifications