సూపర్ ప్లాన్ ను విడుదల చేసిన ఎయిర్‌టెల్
భారతి ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఎప్పడికప్పుడు సరికొత్త ప్లాన్లను ఆవిష్కరిస్తూ ఉంది.
భారతి ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఎప్పడికప్పుడు సరికొత్త ప్లాన్లను ఆవిష్కరిస్తూ ఉంది. ఇప్పటికే పలు ప్రీపెయిడ్ ప్లాన్ల సమీక్షలతో కస‍్టమర్లను తనవైపు తిప్పుకుంటున్న ఎయిర్టెల్ తాజాగా రూ.76 అనే సరికొత్త మరో ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రధాన ప్రత్యర్థులు జియో, వోడాఫోన్‌లకు పోటీగా తాజా రీచార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.

ఎయిర్టెల్ రూ.76 ప్లాన్...
ఈ రూ.76 ప్లాన్‌ను రీచార్జి చేసుకునే కస్టమర్లకు రూ.26 టాక్ టైం ,100MB 2G/3G/4G డేటా లభిస్తుంది.వాయిస్ కాల్స్ కు నిమిషానికి 60 పైసలు ఛార్జ్ అవుతుంది.ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు మాత్రమే. అయితే ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ లో కొత్తగా చేరే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.ఈ ప్లాన్ ను కస్టమర్లు My Airtel యాప్ లేదా ఎయిర్‌టెల్ అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే రీఛార్జ్ చేసుకోవల్సొ ఉంటుంది.

ఎయిర్టెల్ రూ.76 ప్లాన్ vs జియో రూ.52 ప్లాన్
జియో కూడ వారి కస్టమర్ల కోసం ఎయిర్టెల్ లాంచ్ చేసిన రూ.76 ప్లాన్ తరహాలోనే రూ.52 ప్లాన్ ను లాంచ్ చేసింది. ఈ రూ.52 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న జియో కస్టమర్ కి అపరిమిత కాల్స్ తో పాటు 1.05జిబి డేటా అలాగే రోజుకి 70 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 7 రోజులు మాత్రమే

ఎయిర్టెల్ రూ.76 ప్లాన్ vs వోడాఫోన్ రూ.72 ప్లాన్
వోడాఫోన్ కూడ వారి కస్టమర్ల కోసం ఎయిర్టెల్ లాంచ్ చేసిన రూ.76 ప్లాన్ తరహాలోనే రూ.72 ప్లాన్ ను లాంచ్ చేసింది. ఈ రూ.52 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వోడాఫోన్ కస్టమర్ కి అపరిమిత కాల్స్ మాత్రమే లభిస్తాయి.ఈ ప్లాన్ లో ఎటువంటి SMS ఆఫర్లు అలాగే డేటా ఆఫర్లు ఉండవు.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

వోడాఫోన్ రూ.51 ప్లాన్
వోడాఫోన్ రూ.51 ప్లాన్ ను కూడా లాంచ్ చేసింది. ఈ ప్లాన్ను రీఛార్జి చేసుకున్న కస్టమర్ కి 1జిబి 3G/4G డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

ఎయిర్టెల్ రూ.76 ప్లాన్ vs ఐడియా రూ.75 ప్లాన్
ఐడియా కూడ వారి కస్టమర్ల కోసం ఎయిర్టెల్ లాంచ్ చేసిన రూ.76 ప్లాన్ తరహాలోనే రూ.75 ప్లాన్ ను లాంచ్ చేసింది. ఈ రూ.75 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న ఐడియా కస్టమర్ కి 1జిబి డేటా,18000సెకండ్ల Local/STD కాల్స్ అలాగే రోజుకి 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 21 రోజులు మాత్రమే


Click it and Unblock the Notifications








