OTT సబ్‌స్క్రిప్షన్, 84 రోజుల వ్యాలిడిటీతో కూడిన రీఛార్జ్ ప్లాన్‌లు కావాలా.. ఇదిగో లిస్ట్, పూర్తి వివరాలు..
Airtel Recharge Plans with OTT Benefits : ఎయిర్‌టెల్ భారత్‌లో యూజర్ల పరంగా రెండో అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌గా ఉంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా అనేక రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. కొంత మంది యూజర్లు కాలింగ్, డేటా ప్రయోజనాలతోపాటు OTT సబ్‌స్క్రిప్షన్‌లను అందించే రీఛార్జ్ ప్లాన్‌ల కోసం చూస్తుంటారు. అలాంటి వారి కోసం ఎయిర్‌టెల్ అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది.
ఓటీటీ ప్రయోజనాలతోపాటు ఎక్కువ రోజుల వ్యాలిడిటీ అందించేలా ఎయిర్‌టెల్ ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. ఈ ప్లాన్‌ల జాబితాలో రూ.979, రూ.1029, రూ.1199, రూ.1729, రూ.1798 వంటి ప్లాన్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్‌ల పూర్తి ప్రయోజనాల వివరాలు మీకోసం.

రూ.979 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలను పొందవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 2GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్‌లో (Airtel Rs979 Plan) భాగంగా 22 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లతో కూడిన ఎయిర్‌టెల్ Xstream ప్లే ప్రీమియం ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా హాలోట్యూన్స్, Perplexity Pro AI ను కూడా ఉపయోగించుకోవచ్చు.
రూ.1029 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2GB 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్‌లో (Airtel Rs1029 Recharge Plan) భాగంగా 3 నెలల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మరియు హాలోట్యూన్స్‌తోపాటు Perplexity Pro AI ను కూడా ఉపయోగించుకోవచ్చు.
రూ.1199 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2.5GB 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్‌లో (Airtel Rs1199 Recharge Plan) భాగంగా అమెజాన్ ప్రైమ్ లైట్ ప్రయోజనాలను పొందవచ్చు. దీంతోపాటు ఎయిర్‌టెల్ Xstream ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. వీటితోపాటు హాలోట్యూన్స్, Perplexity Pro AI ను కూడా ఉపయోగించుకోవచ్చు.
రూ.1729 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2GB 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్‌లో (Airtel Rs1729 Plan) భాగంగా నెట్‌ఫ్లిక్స్ బేసిక్, జియోహాట్‌స్టార్ సూపర్, Zee5 ప్రీమియం, Xstream ప్లే ప్రీమియం వంటి ప్రయోజనాలను పొందవచ్చు. దీంతోపాటు హాలోట్యూన్స్, Perplexity Pro AI ను కూడా ఉపయోగించుకోవచ్చు.
రూ.1798 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 3GB 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.
దీంతోపాటు (Airtel Rs979 Recharge Plan) నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ ప్రయోజనాలను పొందవచ్చు. ఇటీవల ఎయిర్‌టెల్ ప్రకటించిన Perplexity Pro AI ను కూడా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








