Home
News

కేవలం కాలింగ్‌ కోసమే రీఛార్జ్‌ ప్లాన్‌లు ఉన్నాయని మీకు తెలుసా.. ఈ మూడు ప్లాన్‌ల పూర్తి వివరాలు..!

భారత్‌ లో ప్రస్తుతం ఉన్న బెస్ట్ టెలికాం నెట్‌వర్క్‌ లో ఎయిర్‌టెల్‌ ఒకటిగా ఉంది. ఫలితంగా భారీ సంఖ్యలో యూజర్లను కలిగి ఉంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌టెల్‌ అనేక రీఛార్జ్‌ ప్లాన్‌లను కలిగి ఉంది. చాలా వరకు ప్లా్న్‌లో కాలింగ్, డేటా, SMS లను ఉపయోగించుకోవచ్చు. అయితే ఎయిర్‌టెల్‌ లో కేవలం కాలింగ్‌ లేదా డేటా కోసం కూడా ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌ లు ఉన్నాయి.

ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ కేవలం కాలింగ్ కోసం ప్రత్యేకంగా మూడు రీఛార్జ్‌ ప్లాన్‌ లను కలిగి ఉంది. ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్లాన్‌లను విడుదల చేసింది. ఫోన్‌లను కేవలం కాలింగ్ కోసమే ఉపయోగించేవారు లేదా డేటా కోసం WiFi వంటి సదుపాయాలు ఉన్న యూజర్లకు ఈ మూడు రీఛార్జ్‌ ప్లాన్‌లు ఉపయోగపడతాయి.

Airtel offers Rs469  Rs489  Rs548 Recharge plans

ఎయిర్‌టెల్ రూ.469 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌ లో ( Airtel Rs469 Recharge Plan ) భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. మరియు మొత్తంగా 900 SMS లను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌ లో ఎటువంటి డేటాను పొందలేరు. కేవలం కాలింగ్ కోసమే ఈ ప్లాన్‌ ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంటుంది.

ఈ ప్లాన్‌ లో భాగంగా హలోట్యూన్స్‌ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. పెర్‌ఫ్లెక్సిటీ ప్రో AI మోడల్‌ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఏఐ మోడల్‌ సాధారణ ధర సంవత్సరానికి రూ.17 వేలుగా ఉంది. అయితే ఎయిర్‌టెల్‌ యూజర్లు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

ఎయిర్‌టెల్ రూ.489 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌ లో ( Airtel Rs489 Recharge Plan ) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్‌, STD కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు 600 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో భాగంగా మొత్తంగా 6GB డేటాను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 77 రోజులుగా ఉంటుంది.

దీంతోపాటు ఈ ప్లాన్‌ లో భాగంగా హలోట్యూన్స్‌ ను ఉచితంగా పొందవచ్చు. మరియు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో AI మోడల్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. డేటా అవసరాలు తక్కువగా ఉండడం లేదా డేటా కోసం వైఫై వంటి సదుపాయాలు ఉన్న యూజర్లకు ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది.

ఎయిర్‌టెల్ రూ.548 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌ లో ( Airtel Rs548 Recharge Plan ) భాగంగా ఎయిర్‌టెల్‌ యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు మొత్తంగా 900 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు మొత్తంగా 7GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంటుంది.

ఈ ప్లాన్‌ లో భాగంగా హలోట్యూన్స్‌ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. మరియు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో AI మోడల్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. డేటా అవసరాలు తక్కువగా ఉండడం లేదా డేటా కోసం వైఫై వంటి సదుపాయాలు ఉన్న యూజర్లకు ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel offers Rs469, Rs489, Rs548 Recharge plans for only for calling, full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X