రూ.2,000 కంటే తక్కువ ధరలో అన్‌లిమిటెడ్ కాలింగ్, 365 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్..!
ప్రముఖ ప్రైవేటు టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ (Airtel) ప్రస్తుతం యూజర్‌ల సంఖ్యలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఎయిర్‌టెల్ ప్రస్తుతం 380 మిలియన్‌లకు పైగా యూజర్ లను కలిగి ఉంది. భారీ సంఖ్యలో ఉన్న తన యూజర్ ల కోసం అనేక ప్రీపెయిట్ రీఛార్జ్ ప్లాన్ లను కలిగి ఉంది. ఎయిర్‌టెల్ వినియోగదారుల వ్యాలిడిటీ, డేటా, కాలింగ్ అవసరాలకు అనుగుణంగా అనేక రీఛార్జ్ ప్లాన్ లను కలిగి ఉంది. ఇతర ప్రైవేటు టెలికాం సంస్థల మాదిరిగానే ఎయిర్‌టెల్ కూడా ఈ సంవత్సరం జులై లో మొబైల్ టారిఫ్ ధరలను పెంచింది.
ఎయిర్‌టెల్ 365 రోజుల వ్యాలిడిటీ తో (Airtel 365 Days validity Recharge Plans) అనేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. అయితే కాలింగ్, డేటా, SMS సహా ఇతర ప్రయోజనాల కారణంగా ఈ ప్లాన్ ధరలు రూ.3500 లకు పైగా ఉన్నాయి. అయితే అన్‌లిమిటెడ్ కాలింగ్, పరిమిత డేటా, 365 రోజుల వ్యాలిడిటీతో ప్రస్తుతం ఎయిర్‌టెల్ ఒక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను కలిగి ఉంటుంది.

ఎయిర్‌టెల్ రూ.1999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ (Airtel RS1999 Prepaid Recharge Plan) ద్వారా 365 రోజులపాటు వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. డేటా పరంగా మొత్తంగా 24GB డేటాను వినియోగించుకోవచ్చు. ఎయిర్‌టెల్ స్ట్రీమ్‌ను సపోర్టు చేస్తుంది. ఎక్కువగా కాలింగ్, SMS లను వినియోగించేవారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.
365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లు :
ప్రస్తుతం ఎయిర్‌టెల్ మరో రెండు 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ లను అందిస్తోంది. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ ఆధారంగా రూ.3599 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ ను పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. రోజువారీ 2GB డేటాను పొందవచ్చు.
అన్‌లిమిటెడ్ 5G డేటా :
ఈ ప్లాన్‌లో భాగంగా 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు హాలోట్యూన్స్ ను కూడా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్‌టెల్ XStream యాప్ లో ఉచితంగా అందుబాటులో ఉన్న కంటెంట్ ను వీక్షించవచ్చు. apollo 24/7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.
రూ.3,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ ఆధారంగా రూ.3,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. డేటాపరంగా రోజువారీ 2.5GB డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ లో భాగంగా సంవత్సరం డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. వీటితోపాటు ఎయిర్‌టెల్ Xstream యాప్ ను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు Apollo 24/7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. స్పామ్ కాల్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎయిర్‌టెల్ ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ప్రత్యేక వ్యవస్థ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.


Click it and Unblock the Notifications








