Home
News

Airtel భారీ తగ్గింపు ఆఫర్లు, 6నెలలు, ఏడాది బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లపై..

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు రెడీ అయింది.

By Hazarath Aiah

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా ఎయిర్ టెల్ కంపెనీ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లపై తగ్గింపు ధరల్ని ప్రకటించింది. ఆరు నెలల ప్లాన్ తీసుకుంటే 15 శాతం, ఏడాది ప్లాన్ అయితే 20 శాతం డిస్కౌంట్ ను ఆఫర్ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. ప్రస్తుతమున్న కస్టమర్లను కాపాడుకోవడం, కొత్త కస్టమర్లను రాబట్టుకోవడమే ఆఫర్ల లక్ష్యంగా ఈ ఆఫర్లను తెరపైకి తెస్తోంది.

కస్టమర్లను కాపాడుకోవడం

కస్టమర్లను కాపాడుకోవడం

రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలు ఆరంభం అవుతున్న నేపథ్యంలో ఉన్న కస్టమర్లను కాపాడుకోవడం ఎయిర్ టెల్ కు సవాల్ గా మారనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటినుండే ఎయిర్‌టెల్ సరికొత్తగా ఆఫర్లను ప్రకటిస్తూ ముందుకు దూసుకువెళుతోంది.

100 ఎంబీపీఎస్ వేగం

100 ఎంబీపీఎస్ వేగం

100 ఎంబీపీఎస్ వేగంతో కూడిన బ్రాడ్ బ్యాండ్ ను, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, జియో టీవీ యాక్సెస్ తో నెలకు రూ.1,000లోపు చార్జీకే జియో అందించనున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జియోకి పోటీగా ఎయిర్ టెల్

జియోకి పోటీగా ఎయిర్ టెల్

కాగా జియోకి పోటీగా ఎయిర్ టెల్ కూడా 300 ఎంబీపీఎస్ ప్లాన్లను ఆఫర్ చేస్తుండడం గమనార్హం. కాకపోతే నెలవారీ చార్జీ రూ.2,199గా ఉంది. 1200జీబీ డేటా పరిమితి ఉంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఆఫర్ చేస్తోంది.

ఏడాది పాటు

ఏడాది పాటు

అలాగే, ఏడాది పాటు ప్లాన్ కు సబ్ స్క్రయిబ్ చేసుకుంటే అమేజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తోంది.

 ఐడియా–వొడాఫోన్‌ విలీనం ఆలస్యం

ఐడియా–వొడాఫోన్‌ విలీనం ఆలస్యం

ఐడియా-వొడాఫోన్‌ విలీనం ముందు అనుకున్నట్టు ఈ నెల 30లోపు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వొడాఫోన్‌ ఇండియా వన్‌టైమ్‌ స్పెక్ట్రమ్‌ చార్జీల రూపంలో రూ.4,700 కోట్ల మేర బకాయి ఉంది. దీంతో ఐడియాలో విలీనానికి ముందే ఈ బకాయిలను చెల్లించాలని టెలికం శాఖ కోరనుంది. లేదా బ్యాంకు గ్యారంటీలను సమర్పించాలని కోరనున్నట్టు సమాచారం.

 2015లో వొడాఫోన్‌

2015లో వొడాఫోన్‌

నిజానికి 2015లో వొడాఫోన్‌ తన సబ్సిడరీలైన వొడాఫోన్‌ ఈస్ట్, వొడాఫోన్‌ సౌత్, వొడాఫోన్‌ సెల్యులర్, వొడాఫోన్‌ డిజిలింక్‌లను వొడాఫోన్‌ మొబైల్‌ సర్వీసెస్‌లో విలీనం చేసింది.ఇదే ఇప్పుడు వొడాఫోన్‌ ఇండియాగా మారింది.

విలీనం సమయంలోనే..

విలీనం సమయంలోనే..

అయితే, విలీనం సమయంలోనే రూ.6,678 కోట్ల వన్‌టైమ్‌ స్పెక్ట్రమ్‌ బకాయిలను చెల్లించాలని టెలికం శాఖ డిమాండ్‌ నోటీసు చేయడంతో వొడాఫోన్‌ కోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వొడాఫోన్‌ రూ.2,000 కోట్ల బకాయిలనే చెల్లించింది.

బకాయిలపై టెలికం శాఖ..

బకాయిలపై టెలికం శాఖ..

దీంతో బకాయిలపై టెలికం శాఖ న్యాయ సలహా కోరగా, వొడాఫోన్‌ నుంచి బకాయిల చెల్లింపునకు డిమాండ్‌ చేయవచ్చని వచ్చింది. దీంతో వడ్డీ సహా మొత్తం ఎంత బకాయి అన్నది ఖరారు చేసే పనిలో ఉన్నట్టు ఆ అధికారి తెలిపారు.

Best Mobiles in India

English summary
Airtel Offers Up to 20 Percent Discount on 6-Month, 1-Year Broadband Plans More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X