హైదరాబాద్ వాసులకు ఎయిర్టెల్ బంపర్ ఆఫర్, అన్నింటికీ ఒకే బిల్!
ఇటీవల కాలం లో ఎయిర్టెల్ తన వన్ బిల్ సేవలను ప్రారంభించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఎయిర్టెల్ ఆపరేటర్ ఒకే బిల్లు తో బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, పోస్ట్‌పెయిడ్ మొబైల్ మరియు డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) తో సహా అనేక సేవలను అందిస్తోంది. మొదట్లో ఎయిర్టెల్ సంస్థ, ఈ వన్ బిల్ సర్వీస్ ను కొన్ని సర్కిల్‌ల లో మాత్రమే ప్రారంభించింది. ఇప్పుడు అది ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది.సంస్థ ఇప్పుడు వన్ బిల్ సైట్‌లో హైదరాబాద్‌ను కూడా చేర్చింది.

Airtel OneBill స్కీం లో ఆఫర్లు
Airtel OneBill స్కీం లో భాగంగా టెలికం ఆపరేటర్ నాలుగు ప్లాన్‌లను అందిస్తోంది. వాటి ధర రూ. 899, రూ. 1,349, రూ. 1,499, మరియు రూ. 1,999. గా ఉన్నాయి. రూ.899 ప్లాన్ లో భాగంగా వన్ ఎయిర్‌టెల్ ప్లాన్ పోస్ట్‌పెయిడ్ మొబైల్ సేవలు మరియు డిటిహెచ్ సేవలను ఒకే బిల్లులో అందిస్తోంది. ఇందులో 75GB డేటాతో పాటు ఒక సాధారణ సిమ్ మరియు వన్-యాడ్ ఆన్ సిమ్ ఉంటాయి. దీనిలో మీకు అపరిమిత కాలింగ్ తో పాటు , ఎస్టీడీ కాల్స్ మరియు రూ. 350. వరకు విలువైన టీవీ ఛానెల్స్ అందుబాటులో ఉంటాయి

Airtel One Bill స్కీం లో ఆఫర్లు
రెండవ ప్లాన్ రూ. 1,349, ఇక్కడ మీరు ఒక సాధారణ సిమ్ మరియు మూడు యాడ్-ఆన్ సిమ్‌లతో సహా నాలుగు పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌లను పొందుతారు. దీనిలో 150 జీబీ డేటా, 350 రూపాయల విలువైన టీవీ ఛానెళ్లను పొందుతారు. రూ. 1,499 ఒక బిల్లు కింద ఫైబర్, పోస్ట్‌పెయిడ్ మరియు ల్యాండ్‌లైన్ సేవలను అందిస్తోంది. ఈ ప్లాన్ లో మీకు 20 Mbps వేగంతో అపరిమిత డేటా లభిస్తుంది. ఇది ల్యాండ్‌లైన్ సౌకర్యాల ద్వారా అపరిమిత కాలింగ్ మరియు ఎస్‌టిడి కాలింగ్‌ను కూడా అందిస్తుంది.

Airtel One Bill స్కీం లో ఆఫర్లు
ఇక నాలుగవ ప్లాన్ వివరాలు చూస్తే , రూ. 1, 999, ఇది పోస్ట్‌పెయిడ్, డిటిహెచ్, మొబైల్ సేవలు మరియు ఫైబర్ సేవల ను అందిస్తుంది. ఈ ప్లాన్ లో మూడు కనెక్షన్ లు ఉంటాయి, వీటిలో ఒక సాధారణ సిమ్ మరియు రెండు అదనపు సిమ్ లు ఉన్నాయి. ఇది 300 జిబి డేటా మరియు డిటిహెచ్ సేవలను రూ. 424.వరకు అందిస్తుంది
పోస్ట్‌పెయిడ్, డిటిహెచ్, ఫైబర్ సర్వీసులతో పాటు, రూ. 3,999. విలువైన ఎక్స్‌ట్రీమ్ సెట్-టాప్ బాక్స్‌ను ఉచితంగా అందిస్తుంది.

సెట్ టాప్ బాక్స్
కానీ, ఈ సెట్ టాప్ బాక్స్ పొందటానికి వినియోగదారులు రూ. 1,500 డిపాజిట్ చేయవలసి untundi . ఒక సంవత్సరం తరువాత కంపెనీ తిరిగి చెల్లించబడుతుంది. Xstream బాక్స్ Android 9 తో పనిచేస్తుంది.
ఇది Chromecast, Google Assistant మరియు Google Play యాక్సెస్‌తో వస్తుంది. అంతేకాకుండా, మీరు ఎక్స్‌స్ట్రీమ్ సేవలను ఇన్‌స్టాల్ చేసుకున్నట్లైతే 12 నెలలు పాటు ఎటువంటి సర్వీస్ ఛార్జీ లేకుండా వాడుకోవచ్చు.

అదనంగా
అదనంగా అమెజాన్ ప్రైమ్ మరియు జీ 5 ను కూడా అందిస్తుంది. ముఖ్యంగా, ఎయిర్‌టెల్ ఈ సేవలను కేవలం 10 రాష్ట్రాలతో మాత్రమే ప్రారంభించింది, ఇప్పుడు అది జైపూర్, పంచకుల, చండీఘర్ మరియు చెన్నై వంటి మరిన్ని సర్కిల్‌ల లో కూడా ఈ సేవలను అందించడానికి ఎయిర్టెల్ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.


Click it and Unblock the Notifications








