Airtel, Vi సబ్‌స్క్రైబర్‌లకు అధిక డేటా ప్రయోజనం కోసం బెస్ట్ ప్లాన్‌లు
భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లు తమ సబ్‌స్క్రైబర్‌లను పెంచుకోవడానికి అనేక ప్రయోజనాలతో వివిధ రకాల ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నారు. వినియోగదారులు అధిక డేటాను అందించే తక్కువ ఖర్చుతో కూడుకున్న రోజువారీ డేటా ప్లాన్‌ల కోసం లేదా ప్రతిరోజూ ఎక్కువ డేటాను అందించే హై-ఎండ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఎంచుకోవడానికి అధికంగా ఇష్టపడుతూ ఉంటారు. ప్రస్తుతం ప్రతి రోజు జరిగే IPL యొక్క క్రికెట్ మ్యాచ్ లను చూడడానికి ఎక్కువ మంది అధిక డేటా ప్రయోజనం గల ప్లాన్‌ల రీఛార్జ్ చేయడానికి ఇష్టపడతారు. మీరు Airtel లేదా Vi యొక్క సబ్‌స్క్రైబర్ అయితే ఇవి అందించే 3GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌ల ప్యాక్ వివరాల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Airtel 3GB రోజువారీ డేటా ప్లాన్‌లు
3GB రోజువారీ డేటా యొక్క ప్లాన్‌ల విషయానికి వస్తే ఎయిర్టెల్ టెలికాం ఆపరేటర్ తన వినియోగదారుల యొక్క అవసరాల దృష్ట్యా రెండు ప్లాన్‌లను మాత్రమే అందిస్తుంది. వీటిలో ఏదీ కూడా దీర్ఘకాలిక ప్లాన్ కాకపోవడం విషేశం. టెల్కో రూ.599 ధర ట్యాగ్‌తో 28 రోజుల చెల్లుబాటు వ్యవధికి 3GB/రోజు ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ OTT ప్లాట్‌ఫారమ్‌కు వార్షిక సబ్‌స్క్రిప్షన్‌తో పాటు లభిస్తుంది. అదనంగా అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMSల ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వినియోగదారులు ఎయిర్‌టెల్ వినియోగదారులు మరొక ప్రీపెయిడ్ ప్లాన్‌ను రూ.699 ధరతో పొందవచ్చు. ఇది ప్రతిరోజు 3GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు వ్యవధి 56 రోజులు. ఈ ప్లాన్ నిజంగా అపరిమిత వాయిస్ కాల్‌లను అలాగే రోజుకు 100 SMSలను అందిస్తుంది.

వోడాఫోన్ ఐడియా లేదా Vi 3GB రోజువారీ డేటా ప్లాన్‌లు
వోడాఫోన్ ఐడియా (Vi) టెల్కో మరోవైపు 3GB రోజువారీ డేటా ఇంటర్నెట్ ప్రయోజనంను బహుళ ప్రీపెయిడ్ ప్లాన్‌లతో అందిస్తుంది. ఇందులో 3GB రోజువారీ బేస్ ప్యాక్ రూ.475 ధర వద్ద వస్తుంది. ఇది అపరిమిత వాయిస్ కాల్‌లతో పాటు 100 SMS/రోజు ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు వ్యవధికి అందిస్తుంది. జాబితాలోని తదుపరి ప్లాన్ రూ.699 ధర వద్ద అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్ బేస్ ప్లాన్ అందించే సమానమైన ప్రయోజనాలను ఇది కూడా కలిగి ఉంది. రూ.699 ప్లాన్ వినియోగదారులకు 56 రోజుల చెల్లుబాటు వ్యవధిలో రోజుకు 3GB డేటా ప్రయోజనంతో లభిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది.

చివరగా టెల్కో డిస్నీ+ హాట్‌స్టార్ యాక్సెస్‌తో రెండు ప్లాన్‌లను అందిస్తుంది. Vi 28 రోజుల చెల్లుబాటు వ్యవధికి రూ.601 ధర ట్యాగ్‌తో 3GB/రోజు ప్లాన్‌ను అందిస్తుంది. ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్ మరియు 100 SMS/రోజు అందిస్తుంది. రోజువారీ 3GB డేటాతో పాటు వినియోగదారులు మొత్తంగా 16GB డేటాను కూడా అదనంగా పొందుతారు. మరోవైపు టెల్కో రూ.901 ధర వద్ద రోజుకు 3GB ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ 70 రోజుల చెల్లుబాటు వ్యవధితో వస్తుంది. ఈ మొత్తం వాలిడిటీ కాలంలో రోజుకు 100 SMSలతో పాటు నిజమైన అపరిమిత వాయిస్ కాల్‌ల ప్రయోజనాలను అందిస్తుంది.

డిస్నీ+ హాట్‌స్టార్ ప్రయోజనంతో జియో రూ.555 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్
రిలయన్స్ జియో ఇప్పుడు రూ.555 ధర వద్ద కొత్తగా ఒక ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రారంభించింది. ఇది మొత్తంగా 55GB డేటాతో వస్తుంది. వాయిస్ కాలింగ్ మరియు SMS ప్రయోజనాలను కూడా బండిల్ చేసే అపరిమిత ప్రయోజనాల ప్రీపెయిడ్ ప్లాన్‌ని కోరుకునే వినియోగదారుల కోసం ఈ ప్లాన్ ఉద్దేశించినది కాదని గుర్తుంచుకోండి. రూ.555 ప్లాన్ వాస్తవానికి డేటా యాడ్-ఆన్ ప్లాన్. ఇది వినియోగదారులకు ఏకమొత్తంలో 55GB డేటాను అందిస్తుంది. పేర్కొన్నట్లుగా ఈ ప్లాన్ వాయిస్ కాలింగ్ లేదా SMS ప్రయోజనాలను అందించదు. ఈ ప్లాన్‌తో అందించే మొత్తం వాలిడిటీ 55 రోజులు. ఓవర్-ది-టాప్ (OTT) సబ్‌స్క్రిప్షన్‌లలో డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ కూడా ఉంది. దీని ధర స్వతంత్ర ప్రాతిపదికన సంవత్సరానికి రూ.499. ఇంకా JioCloud, JioTV, JioSecurity మరియు JioCinemaతో సహా Jio యాప్‌లు ఈ ప్లాన్‌తో వినియోగదారులకు అందించబడతాయి. ఈ ప్లాన్ ధర రూ.200 కంటే ఎక్కువ కనుక. మీరు రూ.200 వరకు 20% JioMart మహా క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. ఇది ఇళ్ల నుండి పని చేస్తున్న వ్యక్తుల కోసం ఒక సాలిడ్ డేటా యాడ్-ఆన్ ప్లాన్. ఇది స్వతంత్ర వాలిడిటీతో కూడా వస్తుంది కాబట్టి ఎక్కువగా టాక్‌టైమ్ ప్లాన్‌లతో మాత్రమే రీఛార్జ్ చేసుకునే వ్యక్తులకు ఇది గొప్ప ఎంపిక.


Click it and Unblock the Notifications








